E-Paper
Advertisement

భూమి మీద భారీ విధ్వంసం… మంచు కొండల్లో ఇరుక్కుపోయిన ఫ్యామిలీ… తెలుగులోనూ స్ట్రీమింగ్

భూమి మీద భారీ విధ్వంసం… మంచు కొండల్లో ఇరుక్కుపోయిన ఫ్యామిలీ… తెలుగులోనూ స్ట్రీమింగ్
Advertisement

Science fiction survival Thriller : ఓటీటీలోకి సైన్స్ ఫిక్షన్ సర్వైవల్ థ్రిల్లర్ మూవీ ‘గ్రీన్‌ల్యాండ్ 2’ (Greenland 2) ఆడియన్స్ ను పలకరిస్తోంది. యాక్షన్ హీరో గెరార్డ్ బట్లర్ నటించిన ఈ హాలీవుడ్ సినిమా, ఇప్పుడు తెలుగులో కూడా అందుబాటులో ఉంది. ప్రకృతి విపత్తు నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా సీట్ ఎడ్జ్ థ్రిల్ తో ఆకట్టుకుంటోంది. 2020 లో వచ్చిన ‘గ్రీన్‌ల్యాండ్’ మూవీకి ఇది సీక్వెల్ గా వచ్చింది. పార్ట్ వన్ సూపర్ హిట్ అవ్వడంతో, పార్ట్ 2 కూడా తెరకెక్కింది. అయితే ఇది అనుకున్నంత స్థాయిలో మెప్పించలేక పోయింది. థియేటర్లలో ఓ మోస్తారు కలెక్షన్స్ మాత్రమే రాబట్టింది. అయితే ఓటీటీలో దీనికి మంచి స్పందన వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రకృతి విపత్తు సినిమాలను చూసేందుకు ప్రేక్షకులు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు.

ఎక్కడ చూడచ్చు అంటే

‘గ్రీన్‌ల్యాండ్ 2’ లో జాన్ గ్యారిటీగా గెరార్డ్ బట్లర్, అలిసన్ పాత్రలో మోరెనా బక్కారిన్ అదరగొట్టారనే చెప్పాలి. ఈ సినిమాకు రిక్ రోమన్ వా దర్శకత్వం వహించారు. మిక్స్డ్ టాక్ తో నడిచిన ఈ సినిమాని దాదాపు రూ. 750 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో నిర్మించారు. అయితే బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా కలెక్షన్ల పరంగా నిరాశపరిచింది. పెట్టిన బడ్జెట్ లో సగం కూడా రీచ్ కాలేక పోయింది. ఇది భారతదేశంలో 2026జనవరి 16న థియేటర్లలో విడుదలైంది. అంతకుముందు అమెరికాలో జనవరి 9న దీనిని విడుదల చేశారు. ఈ సినిమా లయన్స్ గేట్ ప్లే (Lionsgate Play)లో ఏప్రిల్ 24 నుండి స్ట్రీమింగ్ లో ఉంది. ఇంగ్లీష్‌తోపాటు తెలుగు, హిందీ, తమిళం భాషల్లో కూడా దీనిని చూడచ్చు. అంతేకాకుండా ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో రెంటల్ పద్ధతిలో అందుబాటులో కూడా ఉంది.

స్టోరీలోకి వెళ్తే

Advertisement

మొదటి భాగంలో తోకచుక్క వచ్చి భూమిని ఢీ కొట్టడంతో హీరో (జెరార్డ్ బట్లర్) ఫ్యామిలీ గ్రీన్ ల్యాండ్ బంకర్‌లో తల దాచుకుంటుంది. ఇప్పుడు పార్ట్ 2 లో ఐదేళ్ల తర్వాత వీళ్ళు మెల్లగా బయటకొస్తారు. బయట చూస్తే ప్రపంచం మొత్తం బూడిద కుప్పలా మారిపోయి ఉంటుంది. ఇక్కడ బతకడం కష్టమని తెలిసి, ఎక్కడో యూరప్ అవతల మంచు ప్రాంతంలో ఇంకా సేఫ్ ప్లేస్ ఉందని తెలుస్తుంది. వీళ్ళు అక్కడ బతకడానికి ఒక పెద్ద సాహస యాత్రనే మొదలుపెడతారు. కానీ ఈ ప్రయాణం అంత ఈజీగా సాగదు. దారి పొడవునా తిండి లేక అల్లాడిపోయే జనం, దొరికినకాడికి దోచుకునే గ్యాంగులు ఎదురవుతుంటారు. మరో పక్క ప్రకృతి వైపరీత్యాలు వెంటాడుతుంటాయి. వీటి మధ్య హీరో ఫ్యామిలీ చిక్కుకుంటుంది. ఒకానొక టైమ్‌లో హీరో తన భార్యాపిల్లల కోసం ఏకంగా ప్రాణాలకు తెగించి పోరాడాల్సి వస్తుంది. చివరికి హీరో ఫ్యామిలీ అనుకున్న చోటికి చేరుకున్నారా? ఆ మంచు గడ్డల మధ్య వాళ్ళకి ఆశ్రయం దొరికిందా? అన్నదే అసలు కథ.

Read Also : హత్య కేసులో బోలెడు అనుమానాలు… కూతురిని కూడా అనుమానించే తండ్రి… నరాలు తెగే ఉత్కంఠ

Related News

ఏం సిరీస్ రా అయ్యా… రక్తం ఏరులై పారే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్

అమాయకపు దొంగను అడ్డం పెట్టుకుని ఇవేం పాడు పనులు… ఈ తమిళ మిస్టరీ థ్రిల్లర్ క్లైమాక్స్ హైలెట్

40 ఏళ్ల వయసులో పట్టే పిచ్చి… ఫ్యామిలీ ఫ్యామిలీకి నెంబర్ల శాపం… కట్ చేస్తే గజగజా వణికిపోయే ట్విస్ట్

సైనికుడిని సొంత ప్రభుత్వమే ఉగ్రవాదిగా ముద్రవేస్తే… మెంటల్ మాస్ యాక్షన్ థ్రిల్లర్

శబరిమల కొండల్లో కొడుకు మిస్సింగ్… ఎమోషనల్ తమిళ ఫ్యామిలీ డ్రామా

పెళ్ళయిన వ్యక్తితో ప్రేమ… ఓటీటీలోకి వచ్చేసిన ట్రయాంగిల్ రొమాంటిక్ డ్రామా

కోమాలో ఉన్న భార్యను కాపాడుకోవడానికి కిరాక్ ప్లాన్, కానీ… ఒక్కసారి చూస్తే మర్చిపోలేరు భయ్యా

ఘనంగా నెక్సా ఓటీటీ అకాడమీ అవార్డ్స్ వేడుక.. సత్తా చాటిన తెలుగు కుర్రాడు!

Big Stories

Advertisement
×