భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన రైట్స్ లిమిటెడ్ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. రెగ్యులర్ ప్రాతిపదికన ఖాళీగా ఉన్న డిప్యూటీ జనరల్ మేనేజర్ అలాగే అసిస్టెంట్ మేనేజర్ (లీగల్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. న్యాయశాస్త్రంలో పట్టా పొంది అనుభవం ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ నియామక ప్రక్రియ ద్వారా మొత్తం ఐదు ఖాళీలను భర్తీ చేయనున్నారు.
వయస్సు, జీతం వివరాలు:
ఈ నోటిఫికేషన్‌లో ఒక డిప్యూటీ జనరల్ మేనేజర్ పోస్టు ఉంది. దీనికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయోపరిమితి 41 ఏళ్లు మించకూడదు. ఎంపికైన వారికి నెలకు రూ. 70,000 నుంచి రూ. 2,00,000 వరకు వేతనం లభిస్తుంది. అదేవిధంగా నాలుగు అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు అందుబాటులో ఉన్నాయి. ఈ పోస్టులకు 32 ఏళ్ల లోపు వారు అర్హులు. వీరికి నెలకు రూ. 40,000 నుంచి రూ. 1,40,000 వరకు జీతభత్యాలు చెల్లిస్తారు.
విద్యార్హత:
అర్హత విషయానికి వస్తే అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి లా (LLB/BL) పూర్తి చేసి ఉండాలి. సంబంధిత విభాగంలో పని అనుభవం తప్పనిసరి.
ముఖ్యమైన తేదీలు:
ఆసక్తి గల అభ్యర్థులు 2026 మార్చి 13వ తేదీ నుంచి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించవచ్చు. దరఖాస్తు చేసుకోవడానికి ఏప్రిల్ 27 చివరి తేదీగా నిర్ణయించారు.
దరఖాస్తు ఫీజు: జనరల్ తో పాటు ఓబీసీ అభ్యర్థులు రూ. 600 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఈడబ్ల్యూఎస్ సహా ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపునిస్తూ రూ. 300 గా ఖరారు చేశారు.
ఉద్యోగ ఎంపిక ప్రక్రియ: అభ్యర్థుల ఎంపిక పూర్తిగా పారదర్శకంగా జరుగుతుంది. రాత పరీక్ష నిర్వహించిన అనంతరం అర్హత సాధించిన వారికి ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఈ రెండింటిలో కనబరిచిన ప్రతిభ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
కేంద్ర ప్రభుత్వ సంస్థలో స్థిరమైన ఉద్యోగం పొందాలనుకునే న్యాయ కోవిదులకు ఇది గొప్ప అవకాశం. అధికారిక వెబ్‌సైట్ సందర్శించి గడువులోగా దరఖాస్తు పూర్తి చేయాలని అధికారులు సూచిస్తున్నారు.
నోటిఫికేషన్ కు సంబంధించి ఎలాంటి సందేహాలు ఉన్నా అఫీషియల్ వెబ్ సైట్ ను సందర్శించండి.
అఫీషియల్ వెబ్ సైట్: https://www.rites.com/
ALSO READ: NIC Recruitment 2026: రూ.లక్షల జీతంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.. ఈ అర్హత ఉంటే ఎనఫ్, పూర్తి వివరాలివే