E-Paper
Advertisement

అర్థరాత్రి వినిపించే అడుగుల సప్పుడు… కనిపించని మనుషుల నీడలు… గుండె గట్టిగున్నోల్లే చూడాల్సిన సిరీస్

అర్థరాత్రి వినిపించే అడుగుల సప్పుడు… కనిపించని మనుషుల నీడలు… గుండె గట్టిగున్నోల్లే చూడాల్సిన సిరీస్
Advertisement

Horror Thriller OTT : భయపెట్టే హారర్ సిరీస్ లు ఓటీటీలో చాలానే ఉన్నాయి. అయితే సిరీస్ మొదలు నుంచి, చివరి ఎపిసోడ్ దాకా వణికించే సిరీస్ లు కొన్నే ఉంటాయి. ఇప్పుడు మనం అలాంటి సిరీస్ గురించే చెప్పుకోబోతున్నాం. ఇది మామూలుగా అయితే ఉండదు. గుండె గట్టిగా ఉన్నోళ్ళు మాత్రమే చూడాలి. ఈ కథ ఇద్దరు పిల్లల్ని చూసుకొనేందుకు ఒక యువతి కేర్ టేకర్ గా వెళ్తుంది. ఆ తరువాత కథ వణికించేస్తుంది.

నెట్ ఫ్లిక్స్ (Netflix)లో స్ట్రీమింగ్ 

2020లో వచ్చిన ఈ అమెరికన్ హారర్ వెబ్ సిరీస్ పేరు ‘ది హాంటింగ్ ఆఫ్ బ్లై మనోర్’ (The Haunting of Bly Manor). మైక్ ఫ్లానాగన్ రూపొందించిన ఈ సిరీస్, హెన్రీ జేమ్స్ రాసిన ‘ది టర్న్ ఆఫ్ ది స్క్రూ’ అనే నవల ఆధారంగా తెరకెక్కింది. ఇందులో విక్టోరియా పెడ్రెట్టి (డాని), ఆలివర్ జాక్సన్-కోహెన్ (పీటర్ క్వింట్) లీడ్ రోల్స్ లో నటించారు. మొత్తం 9 ఎపిసోడ్లు ఉన్న ఈ సిరీస్ ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ (Netflix)లో అందుబాటులో ఉంది. ఈ సిరీస్ ఎమ్మీ (Emmy) అవార్డ్స్ కు కూడా నామినేట్ అయ్యింది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

ఈ కథ 1980ల్లో ఇంగ్లాండ్‌లో డాని అనే అమెరికన్ పిల్లతో మొదలవుతుంది. ఆమె లండన్‌లోని ‘బ్లై మనోర్’ అనే ఒక పెద్ద బంగళాలో ఇద్దరు పిల్లల్ని చూసుకోవడానికి ఆయాగా చేరుద్ది. ఆ పిల్లల పేరెంట్స్ చనిపోయి ఉంటారు. ఆ పిల్లల బాబాయ్ ఏమో సిటీలో ఉంటూ వీళ్లని పట్టించుకోడు. ఆ బంగళాలో ఆల్రెడీ ఒక వంటవాడు, ఒక తోటమాలి, ఒక పనిమనిషి ఉంటారు. మొదట్లో అంతా బాగానే ఉన్నట్టు అనిపించినా, ఆ పిల్లలు అప్పుడప్పుడు వింతగా ప్రవర్తిస్తుంటే డానికి ఏదో తేడా కొడుతుంది. పోను పోను ఆ బంగళాలో దెయ్యాల తిరుగుడు ఎక్కువ అవుతుంది. ఆ పిల్లలు కూడా ఏవో బొమ్మలతో, అద్దాల్లో కనిపించే ఆకారాలతో మాట్లాడుతుంటారు.

అసలు విషయం ఏంటంటే.. గతంలో అక్కడ పని చేసిన పాత ఆయా, ఇంకో పనోడు చనిపోయి అక్కడే దెయ్యాలై తిరుగుతుంటారు. వాళ్లు ఈ పిల్లల శరీరాల్ని వాడుకుని మళ్ళీ బతకాలని ప్లాన్ వేస్తుంటారు. ఇంకో అసలు ట్విస్ట్ ఏంటంటే.. ఆ బంగళా పక్కనే ఉన్న చెరువులో ఒక భయంకరమైన దెయ్యం ఉంటుంది. వందల ఏళ్ల క్రితం చనిపోయిన ఆ దెయ్యం, ఎవరైనా తన దారికి అడ్డొస్తే చంపేసి నీళ్లలోకి లాగేస్తుంటది. చివరికి ఆ దెయ్యాల గోల నుంచి డాని బయట పడుతుందా ? ఆ బంగ్లాలో ఉన్న పిల్లలు ఏమవుతారు ? అనే విషయాలను, ఈ హారర్ సిరీస్ ను చూసి తెలుసుకోవాల్సిందే.

Advertisement

Read Also : ఇప్పటికీ ఆశ్చర్యపరుస్తున్న 26 ఏళ్ల హాలీవుడ్ మూవీ… యాక్టింగ్ ఇరగదీసిన బ్రాడ్ పిట్… ఐయండిబిలో 8.8 రేటింగ్

Tags

Related News

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. ఏకంగా 14 స్ట్రీమింగ్…!

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

Big Stories

Advertisement
×