E-Paper
Advertisement

హర్షవీణపై రాడ్లతో దాడి.. జ‌న‌సేన నేత‌ల‌పై కేసు న‌మోదు

హర్షవీణపై రాడ్లతో దాడి.. జ‌న‌సేన నేత‌ల‌పై కేసు న‌మోదు
Advertisement

Harshaveena Attack Railway Koduru: వైఎస్ఆర్ కడప జిల్లా రైల్వేకోడూరు నియోజకవర్గంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధితురాలిగా గత కొంతకాలంగా పోరాడుతున్న హర్షవీణపై జనసేన నాయకుడు తాతంశెట్టి నాగేంద్ర, అతని అనుచరులు దారుణంగా దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన మంగళవారం సాయంత్రం స్థానిక టోల్ గేట్ సమీపంలో చోటుచేసుకుంది. తన బాబు కోసం పూలు, సామాన్లు కొనేందుకు టోల్ గేట్ వద్ద ఆగిన సమయంలో ఎటువంటి కారణం లేకుండానే తనపై, తనతో ఉన్న అబ్బాయిపై రాడ్లు, పైపులతో దాడి చేశారని బాధితురాలు కన్నీటి పర్యంతమైంది.

ఈ దాడిపై హర్షవీణ మాట్లాడుతూ.. “మేము పని ముగించుకుని వస్తుండగా టోల్ గేట్ వద్ద ఆగాము. అదే సమయంలో ఎమ్మెల్యే అరవ శ్రీధర్, జనసేన నేత తాతంశెట్టి నాగేంద్ర కాన్వాయ్ అక్కడికి వచ్చింది. నేను కేవలం కారు వైపు తొంగి చూశాను అంతే. తాతంశెట్టి నాగేంద్ర ఆకస్మికంగా కారు దిగి తన అనుచరులతో కలిసి మాతో ఉన్న అబ్బాయిని తరిమి తరిమి కొట్టారు. చేతుల్లో రాడ్లు, పైపులు పట్టుకుని హోటల్ వరకు వెంటాడి 10 దెబ్బలకు పైగా వేశారు. ఎందుకు కొడుతున్నారని నేను అడ్డు వెళ్లగా, నా తల మీద కూడా బలంగా కొట్టి చంపేస్తానని బెదిరించారు” అని వాపోయారు.

Advertisement

ఈ దాడికి ముందు హర్షవీణ తెలుగుదేశం పార్టీ (TDP) కార్యాలయంలో జరిగిన ప్రజాదర్బార్ కు వెళ్లారు. అక్కడ పార్టీ నేత ముక్కా రూపానందరెడ్డిని కలిసి తనకు జరుగుతున్న అన్యాయంపై ఫిర్యాదు చేసి, న్యాయం చేయాలని కోరారు. ప్రజాదర్బార్ ముగిసి తిరిగి వెళ్తున్న సమయంలోనే ఈ దాడి జరగడం వెనుక రాజకీయ కుట్ర ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. “పని అయిపోయింది. ఈరోజు నా చేతిలో చచ్చిపోతావు.” అంటూ తాతంశెట్టి నాగేంద్ర తనను వ్యక్తిగతంగా దూషించాడని ఆమె ఆరోపించారు. టోల్ గేట్ వద్ద ఉన్న సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తే నిజానిజాలు బయటపడతాయని ఆమె స్పష్టం చేశారు.

తీవ్రంగా గాయపడిన హర్షవీణ రైల్వేకోడూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మద్యం మత్తులో ఉన్నారో లేదా పాత కక్షలతో చేశారో తెలియదు కానీ, నడిరోడ్డుపై ఒక మహిళ అని కూడా చూడకుండా దాడి చేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటనా స్థలంలోని సీసీ ఫుటేజీని సేకరించే పనిలో ఉన్నారు. అధికార కూటమికి చెందిన నాయకుల మధ్యే ఇలాంటి వివాదాలు రావడం నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది.

Advertisement

Read Also: జన నాయగన్ వాయిదా వెనుక రాజకీయ కుట్ర… విజయ్ ఎమోషనల్ కామెంట్స్!

Related News

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

సరదా కోసం వెళ్లి.. అనంత లోకాలకు.. విశాఖపట్నంలో ఘోర ప్రమాదం

పరారీలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. కుటుంబ సభ్యులపై భూకబ్జా కేసు, అసలేం జరిగింది?

మరో అల్పపీడన గండం.. రాబోయే వారం రోజులు ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే!

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

Big Stories

Advertisement
×