E-Paper
Advertisement

‘ రాకాస ‘ ట్విట్టర్ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే..?

‘ రాకాస ‘ ట్విట్టర్ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే..?
Advertisement

Rakasa Movie Twitter Review: మెగా డాటర్ నిహారిక కొనిదెల సొంత నిర్మాణ సంస్థని స్థాపించిన విషయం అందరికీ తెలిసిందే.. గతంలో ఆమె నిర్మాణ సంస్థ బ్యానర్ పై కమిటీ కుర్రోళ్ళు అనే మూవీని నిర్మించారు.. ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చిన చిన్న సినిమాగా ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకోవడంతో పాటుగా కలెక్షన్లు కూడా భారీగానే వసూలు చేసి బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచింది.. నిహారిక నిర్మించిన మొదటి సినిమా మంచి సక్సెస్ ని సొంతం చేసుకోవడంతో ఇప్పుడు వచ్చిన రెండో సినిమాపై అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి. రెండో చిత్రం రాకాస. లవ్, కామెడీ, అడ్వెంచర్, ఫాంటసీ ఎలిమెంట్స్‌ తో ఈ మూవీ వచ్చింది. యంగ్ డైరెక్టర్ మానస శర్మ ఈ మూవీకి దర్శకత్వం వహించారు.

పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, జీ స్టూడియోస్‌ బ్యానర్‌పై ఉమేశ్ కుమార్ బన్సాల్‌- నిహారిక కొణిదెల కలిసి సంయుక్తంగా నిర్మించారు. మ్యాడ్ తో మంచి క్రేజ్ ను అందుకున్న సంగీత్ శోభన్, నయన్ సారిక, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, తనికెళ్ల భరణి, ఆశిష్ విద్యార్ధి, గెటప్ శ్రీను, సుఖ్వీందర్ సింగ్, అనూపర్ సింగ్, వాసు ఇంటూరి, రోహిణి, రోహన్ రాయ్‌ తదితరులు కీలకపాత్రలు పోషించారు.. ఈ మూవీ మంచి అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. కొన్ని నిముషాల ముందు ప్రీమియర్ షోలు థియేటర్లలో పడిపోయాయి.. మరి ఈ సినిమా టాక్ ఎలా ఉంది? నెటిజన్లు ఎలాంటి రెస్పాన్స్ ను ఇస్తున్నారో అన్నది ట్విట్టర్ రివ్యూలో చూసేద్దాం..

Advertisement

ఈ మూవీ నుంచి బయటకు వచ్చినా పోస్టర్లు, అలాగే టీజర్, ట్రైలర్లు జనాలని ఎంతగా ఆకట్టుకున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ఇప్పటివరకు వచ్చిన అప్డేట్స్ అన్నీ కూడా మంచి రెస్పాన్స్ని అందుకోవడంతో సినిమాపై అంచనాలు కూడా ఎక్కువగానే పెరిగాయి. మరి సినిమా ఎలా ఉందో నిహారిక అకౌంట్ లో మరో హిట్ పడిందో లేదో ఒకసారి తెలుసుకుందాం..

రాకాస మూవీ ఫస్ట్ ఆఫ్ కన్నా సెకండ్ హాఫ్ కామెడీగా ప్రేక్షకులను ఆకట్టుకుంది.. ప్రతి ఒక్కరూ తమ నటనతో అలరించారు. ప్రత్యేకించి సంగీత్ శోభన్, వెన్నెల కిషోర్‌లు ఇరగదీశారు.. హీరోయిన్ నయన్సారిక, కమెడియన్ గెటప్ శీను ఇద్దరు కూడా ఎవరికి వారే అన్నట్లుగా బాగా నటించేసారు. క్లైమాక్స్‌లో ఫన్, ఇంటెన్స్‌గా ఉంది. ఎమోషనల్ టచ్‌తో అనుదీప్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాగుంది. మానస శర్మ డైరెక్షన్ స్టాండ్‌ ఔట్‌గా ఉంది.. నిహారిక అకౌంట్లో మరో హిట్ సినిమా పడినట్లే అంటూ ఓ నెటిజన్ ట్వీట్ చేశారు..

Advertisement

రాకాస మూవీ గుడ్, బ్లెండ్ హారర్ కామెడీ మూవీ.. కామెడితో ఫన్నిగా ఉంది. ప్రతి సీన్ కూడా కడుపుబ్బా నవ్విస్తూ వస్తుంది. స్క్రీన్ ప్లే స్టార్టింగ్ నుంచి ఎండిగ్ వరకు ఆసక్తికరంగా సాగింది. గెటప్ శ్రీను టైమింగ్ ఈ సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్.. థియేటర్లలో ఈ సినిమాని మిస్ అవ్వకుండా చూడాల్సిందే అని మరో నెటిజన్ ట్విట్ చేశారు..

కామెడీతో ఈ సినిమా ఫన్‌గా ఉంది. సాంగ్స్, బీజీఎం చాలా బాగున్నాయి. ఇందులో స్నేక్ డ్యాన్స్ హైలెట్ గా నిలిచింది. అలాగే క్లైమాక్స్ మాత్రం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఫ్యామిలీతో కలిసి ఈ సినిమాని చూసి ఎంత ఎంజాయ్ చేయొచ్చు అని మరో నెటిజను ట్వీట్ తో పాటుగా రేటింగ్ ని కూడా ఇచ్చారు.

లార్డ్ సంగీత శోభన్, అలాగే గెటప్ శ్రీను, వెన్నెల కిషోర్ అదరగొట్టేశారు. వీకేండ్వెళ్లి హ్యాపీగా ఈ సినిమాని థియేటర్లలో చూసేయొచ్చు.. మెగా ప్రొడ్యూసర్ నిహారిక హిట్ ట్రాక్ కంటిన్యూ అవుతుంది కంగ్రాజులేషన్స్ అంటూ మరో నెటిజన్ ట్వీట్ చేశారు.

https://x.com/i/status/2039727064300027948

నెటిజన్ల రెస్పాన్స్ని బట్టి చూస్తే రాకాస మూవీ మంచి టాక్ ని సొంతం చేసుకుంది. ప్రీమియర్ షోలతో ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చిందని చెప్పాలి. మరి కలెక్షన్లు ఏమాత్రం వసూల్ అవుతాయో తెలియాలంటే ఇంకొన్ని గంటలు వెయిట్ చేయక తప్పదు..

Related News

Dharmastala Niyojakavargam Movie Review : ‘ధర్మస్థల నియోజకవర్గం’ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే..?

Romanchakam Review : ‘రోమాంచకం’.. నవ్వుల ప్రయాణం..

సుమంత్ ప్రభాస్ ‘రోమాంచకం’ ట్విట్టర్ రివ్యూ..

‘కికు చిరంజీవి’ మూవీ రివ్యూ.. గుండె కుడివైపు ఉంటే.. రహస్యం ఎటువైపు దారితీసింది?

టాక్సిక్’ రివ్యూ.. గీత దాటలేదు, కానీ ఓపిక మాత్రం దాటింది!”

ది రెడ్ బ్యాగ్ మూవీ రివ్యూ.. క్రైమ్ థ్రిల్లర్ మెప్పించిందా?

అమీర్ లోగ్ మూవీ రివ్యూ.. పాతబస్తీ గల్లీ స్నేహం వర్కౌట్ అయ్యిందా?

రవితేజ ‘ఇరుముడి’ రివ్యూ.. అయ్యప్పమాల కలిసొచ్చిందా?

Big Stories

Advertisement
×