E-Paper
Advertisement

ట్రైలర్ తోనే తడిపించిన సినిమా భయ్యా… ఒక్కో సీనుకూ వణికిపోవాల్సిందే

ట్రైలర్ తోనే తడిపించిన సినిమా భయ్యా… ఒక్కో సీనుకూ వణికిపోవాల్సిందే
Advertisement

Horror Movie OTT : సూపర్ నేచురల్ హర్రర్ మూవీస్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. దెయ్యాలతో పాటు మంత్రగత్తెలు వంటి ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ ఉంటే కేకో కేక ఆ మూవీ. ఓటీటీలో ఇలాంటి మూవీ కోసమే వెతుకుతున్నారా ? అయితే ఈ మూవీ సజెషన్ మీ కోసమే. మరి ఈ మూవీ పేరేంటి ? కథ ఏంటి ? అనే వివరాలను వివరంగా తెలుసుకుందాం పదండి.

ఎక్కడ చూడవచ్చు అంటే ?

ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న భయంకరమైన హర్రర్ మూవీ పేరు Hokum. 2026లోనే విడుదలైన ఈ మూవీ ఐరిష్ జానపద కథలు, మంత్రగత్తెల నేపథ్యంతో సాగే అతీంద్రియ హారర్ థ్రిల్లర్. ‘ఆడిటీ’ (Oddity) ఫేమ్ దర్శకుడు డామియన్ మెక్‌కార్తీ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ విజువల్ హారర్ చిత్రం ఇదే ఏడాది మేలో థియేటర్లలో విడుదలై సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఇందులో ఆడమ్ స్కాట్ ఒంటరిగా ఒకే రూమ్‌లో పడే మానసిక వేదన హైలెట్ గా ఉంటుంది. జోసెఫ్ బిషారా అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, వెస్ట్ కార్క్‌లోని ఆ చీకటి లొకేషన్లు సినిమాలో మంచి హారర్ ఎలిమెంట్స్ ను జోడించాయి. ఇంకా థియేటర్లలో భయపెడుతున్న ఈ మూవీ త్వరలోనే ప్రముఖ ఓటీటీలైన Amazon Prime Video లేదా Apple TV లో రెంట్‌కి అందుబాటులోకి రానుంది.

కథలోకి వెళ్తే…

Advertisement

ఓం బోమన్ పాపులర్ హారర్ నవలా రచయిత. చనిపోయిన తన తల్లిదండ్రుల అస్తికలను చల్లడం కోసం ఐర్లాండ్‌లోని ఒక మారుమూల గ్రామీణ ప్రాంతంలో ఉన్న పాత హోటల్‌కు వెళతాడు. ఆ హోటల్ గతంలో అతని తల్లిదండ్రులు హనీమూన్ కోసం గడిపిన ప్రదేశం కావడం విశేషం. అయితే ఆ హోటల్‌లోని ‘హనీమూన్ సూట్’ గదిలో ఒక భయంకరమైన మంత్రగత్తె (Witch) ఆత్మ దాగి స్థానికులు చెప్పుకోవడం వింటాడు అతను. వినడమే కాదు ఆ రూమ్‌ లో అడుగు పెట్టినప్పటి నుండి బోమన్‌ కు భయంకరమైన వింత దృశ్యాలు కన్పిస్తాయి.

Also Read : బయట అడుగు పెడితే చావు మూడినట్టే… గుండెల్లో దడ పుట్టించే జాంబీలు… ఓటీటీలోకి సరికొత్త హారర్ థ్రిల్లర్

Advertisement

ఈ నేపథ్యంలోనే ఓరోజు రాత్రి ఆ హోటల్‌ లో హాలోవీన్ పార్టీ జరుగుతుంది. ఆ పార్టీలో బార్టెండర్ అమ్మాయి ఫ్లోరెన్స్, జెర్రీ అనే లోకల్ వ్యక్తి కన్పించకుండా పోతారు. వాళ్ళ కోసం బోమన్ వెతకడం స్టార్ట్ చేస్తాడు. అయితే హోటల్ మేనేజర్ (పీటర్ కూనన్) అతనికి అడ్డు పడతాడు. దీంతో అనుమానం వచ్చిన బోమన్, హోటల్‌లోని రహస్య సందుల్లో, అండర్‌గ్రౌండ్ బేస్‌మెంట్‌ లో కూడా వదలకుండా వెతుకుతాడు. ఆ క్రమంలో అతనికి దెయ్యాలు మాత్రమే కాదు ఆ హోటల్ వెనుక దాగి ఉన్న క్రూరమైన షాకింగ్ విషయం తెలుస్తుంది. కథలో ట్విస్ట్ ఏమిటంటే, ఆ హోటల్‌లో తిరుగుతున్న మంత్రగత్తె దుష్టశక్తి మాత్రమే కాదు; గతాన్ని గుర్తు చేసి గాయపరిచే ప్రతిరూపం. మరి బోమన్ గతం ఏంటి ? ఆ మంత్రగత్తె నుంచి ఎలా బయట పడ్డాడు ? ఆ హోటల్ వెనకున్న షాకింగ్ నిజం ఏంటి ? అన్నది తెలియాలంటే ఈ మూవీని చూడాల్సిందే.

Related News

వీళ్ళకు చావులేదు… తెలుగులో స్ట్రీమింగ్ అవుతున్న హై-వోల్టేజ్ ఫాంటసీ యాక్షన్ సీక్వెల్

సముద్రం ఎడారిగా మారితే ? మనిషి మాంసం కోసం అగాధపు జీవుల అరాచకం… థ్రిల్లింగ్ సర్వైవల్ అడ్వెంచర్

ZEE5లో సెప్టెంబర్ సినిమాల జాతర… మైండ్ బ్లాక్ చేసే మల్టీ-లాంగ్వేజ్ మూవీస్ సిరీస్ల లిస్ట్

1300 కోట్ల థ్రిల్లర్ తెలుగులో… కేక పుట్టిస్తున్న మైండ్ బ్లాక్ క్రైమ్ కామెడీ

2600 కోట్ల కలెక్షన్లు… 7.9 IMDb రేటింగ్… తెలుగులో అందుబాటులో ఉన్న ఆల్ టైమ్ క్లాసిక్ మిస్టరీ థ్రిల్లర్

ఈ వారం ఓటీటీలో పండగే పండగ… తెలుగులో ఏకంగా 6 సూపర్ హిట్ సినిమాలు

ఫ్రెండ్స్‌తో చూస్తే పొట్టచేక్కలవ్వాల్సిందే… పిచ్చి పిచ్చి గొడవలతో నవ్వించే కామెడీ డ్రామా

ఎఫైర్ ను అడ్డం పెట్టుకుని ఇదేం పాడుపని ? ప్రతీ నిమిషం నెయిల్ బైటింగ్ సస్పెన్స్

Big Stories

Advertisement
×