E-Paper
Advertisement

బయట అడుగు పెడితే చావు మూడినట్టే… గుండెల్లో దడ పుట్టించే జాంబీలు… ఓటీటీలోకి సరికొత్త హారర్ థ్రిల్లర్

బయట అడుగు పెడితే చావు మూడినట్టే… గుండెల్లో దడ పుట్టించే జాంబీలు… ఓటీటీలోకి సరికొత్త హారర్ థ్రిల్లర్
Advertisement

Horror Thriller Movie on OTT : ఎంతో అందంగా కనిపించే ఈ ప్రపంచం ఒక్కసారిగా నరకంగా మారిపోతే ఎంత భయంకరంగా ఉంటుంది ? బయట అడుగు పెడితే చావు పలకరిస్తుంది. లోపల ఉంటే ఉన్న వాళ్ళ మధ్యే నమ్మకం ఉండదు. అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో గుండె దడ పెరిగిపోతుంటే… ఇలాంటి సరికొత్త హాలీవుడ్ హారర్ థ్రిల్లరే ‘దిస్ ఈజ్ నాట్ ఏ టెస్ట్’. మరి ఈ మూవీ కథేంటి ? ఓటీటీలో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోంది ? అనే విషయాలపై ఒక లుక్కేద్దాం పదండి.

రెండు ఓటీటీలలో స్ట్రీమింగ్

ప్రముఖ రచయిత్రి కోర్ట్నీ సమ్మర్స్ రాసిన నవల ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘This Is Not a Test’. నిజానికి ఇదొక జాంబీ మూవీ. ఎప్పటిలా ఇది సాధారణ జాంబీ సినిమాలా ఇందులో రక్తపాతం మాత్రమే కాకుండా సైకలాజికల్ అంశాలు, హర్రర్, ఒంటరితనం, బతకాలని మనిషి పడే తపన ఇందులో ఇంటెన్స్‌ గా ఉంటుంది. ఈ సినిమాకు దర్శకుడు ఆడమ్ మెక్‌డొనాల్డ్ దర్శకత్వం వహించాడు. ఒక చిన్న పట్టణంలో అకస్మాత్తుగా వ్యాపించే ప్రమాదకరమైన వైరస్ వల్ల మనుషులు జాంబీలుగా మారతారు. అయితే ఈ సినిమాలో జాంబీలు నెమ్మదిగా కాకుండా, క్షణాల్లో మనుషులపై దాడి చేసే వేగవంతమైన మృగాల్లా మారతారు.

Advertisement

‘28 డేస్ లేటర్’, ‘డాన్ ఆఫ్ ది డెడ్’ తరహా ఫాస్ట్ జాంబీ జోనర్‌ సినిమాలను ఇష్టపడే వారికి ఈ సినిమా థ్రిల్లింగ్ గా అన్పిస్తుంది. ప్రస్తుతం ‘దిస్ ఈజ్ నాట్ ఏ టెస్ట్’ Shudder లో అందుబాటులో ఉంది. Amazon Prime Video, Apple TV లో డిజిటల్ రెంట్, బై ఆప్షన్ ద్వారా స్ట్రీమింగ్ అవుతోంది. ఫిబ్రవరి 20న అమెరికాలో లిమిటెడ్ థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఇంగ్లీష్ లో మాత్రమే అందుబాటులో ఉండడం గమనార్హం.

కథలోకి వెళ్తే…

స్లోన్ అనే టీనేజ్ అమ్మాయి పాత్ర ఇందులో కీలకం. ఒలివియా హోల్ట్ ఇందులో నటించారు. మొదట్లో జీవితంపై పూర్తిగా ఆశ కోల్పోయిన అమ్మాయి తను. ఇంట్లో తండ్రి పెట్టే టార్చర్ ఆమె అలా తయారవుతుంది. కానీ సడన్ గా ఒకరోజు నగరమంతా జాంబీల చేతిలో నాశనం అవ్వడం చూస్తుంది. అప్పటికే చావాలని డిసైడ్ అయిన ఆ అమ్మాయి, జాంబీల నుంచి తప్పించుకుని బతికి బయట పడాలని అనుకుంటుంది. అందుకోసం హైస్కూల్ స్నేహితులతో కలిసి స్కూల్ బిల్డింగ్‌ లో దాక్కుంటుంది. స్కూల్ బయట మాత్రం వేలాది జాంబీలు ఉంటాయి. అవన్నీ స్కూల్ గేట్లను పగలగొట్టడానికి తీవ్రంగా ప్రయత్నిస్తాయి. ఇంకోవైపు స్కూల్లో దాక్కున్న వాళ్లకు అవసరమైన ఆహారం, నీళ్లు వంటివి పూర్తిగా తగ్గిపోతాయి. ఇక్కడ డేంజరస్ విషయం ఏమిటంటే విద్యార్థులు ఒకరిపై ఒకరు నమ్మకం కోల్పోతారు. అక్కడున్న వాళ్లలో అసలు లీడర్ ఎవరు ? బయటకు వెళ్లి బతకగలమా ? లోపల ఉంటే ఆహరం లేక అల్లాడిపోయి చావడం బెటరా ? అనే ఉత్కంఠ క్లైమాక్స్ వరకు సాగుతుంది.

Advertisement

Read Also : బ్రూస్ లీ కథ ఆధారంగా వచ్చిన మార్షల్ ఆర్ట్స్ సిరీస్… స్ట్రీమింగ్ ఎక్కడంటే ?

Tags

Related News

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

ఫ్రెండ్ లైఫ్ లోకి అమ్మాయి వచ్చిందనే ద్వేషంతో ఇదేం పని ? నిబ్బా నిబ్బీలు డోంట్ మిస్

14,000 ఏళ్ల వయసున్న టీచర్… మైండ్ బ్లోయింగ్ ట్విస్టులున్న క్లాసిక్ సై-ఫై మూవీ

మనుషులంటేనే పడని మిస్టీరియస్ మనిషి… దిమ్మతిరిగే ట్విస్టులున్న మలయాళం థ్రిల్లర్

బిజీ మార్కెట్ లో మహిళ దారుణ హత్య… రా అండ్ రస్టిక్ క్రైమ్ థ్రిల్లర్

ఓటీటీలో సెన్సేషన్ క్రియేట్ చేసిన ప్రభాస్ ఫ్లాప్ మూవీ!

21 కోట్ల కోసం బ్లడీ డేంజరస్ డెత్ గేమ్… క్లైమాక్స్ కిరాక్ మావా

Big Stories

Advertisement
×