E-Paper
Advertisement

శ్రీ కృష్ణుడుకి 16 వేల మంది భార్యలు ఎందుకు… తెలుసుకోవాలంటే ఈ మూవీని డోంట్ మిస్

శ్రీ కృష్ణుడుకి 16 వేల మంది భార్యలు ఎందుకు… తెలుసుకోవాలంటే ఈ మూవీని డోంట్ మిస్
Advertisement

Devotional Drama OTT : దేవుళ్ళ గురించి తెలుసుకుంటూ ఉంటే విన్నకొద్దీ వినాలి అన్పించే కథలు ఉంటాయి. అయితే ఎవ్వరూ తీర్చలేని కొన్ని సందేహాలు కూడా కలుగుతాయి. మరి ఆ సందేహాలను ఎవరు తీరుస్తారు ? అందులోనూ అసలు శ్రీకృష్ణుడికి 16 వేల మంది భార్యలు ఎందుకు ? అనే ప్రశ్నకు చాలా మందికి సమాధానమే తెలియదు. మరి ముఖ్యంగా ఈ ప్రశ్నకు సమాధానం తెలియాలంటే ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీని చూడాల్సిందే.

ఇంకా ఓటీటీలోకి రాని మూవీ

ప్రతిష్టాత్మకమైన పౌరాణిక రొమాంటిక్ డ్రామా Krishnavataram Part 1: The Heart. 2026 మే 7న విడుదలైన ఈ చిత్రానికి హార్దిక్ గజ్జర్ దర్శకత్వం వహించారు. రామ్ మోరి రాసిన ‘సత్యభామ’ నవల ఆధారంగా తెరకెక్కింది. శ్రీకృష్ణుని జీవితాన్ని యుద్ధాల పరంగా కాకుండా, ఆయన పంచిన ప్రేమ, ఎదుర్కొన్న భావోద్వేగాల కోణంలో ఇందులో ఆవిష్కరించారు. క్రియేటివ్‌ల్యాండ్ స్టూడియోస్ నిర్మించిన ఈ చిత్రం భారీ బడ్జెట్ సినిమాలకు ఏమాత్రం తీసిపోని విధంగా రూపొందించారు. అద్భుతమైన విజువల్స్ తో ప్రసాద్ ఎస్ అందించిన దైవికమైన సంగీతంతో ఆకట్టుకుంది. ఈ సినిమా ఒరిజినల్‌గా హిందీలో రూపొందినప్పటికీ మలయాళం, తెలుగు, తమిళ భాషల్లో కూడా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైంది. ఇది మొత్తం మూడు భాగాలుగా రాబోతున్న ‘కృష్ణావతారం’ త్రయంలో మొదటి భాగం. అయితే ఈ మూవీ ఇంకా ఓటీటీలోకి రాలేదు.

కథలోకి వెళ్తే…

Advertisement

శ్రీకృష్ణుని కథలన్నీ రాధా-కృష్ణుల ప్రేమపైనే ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి. శ్రీకృష్ణుడు (సిద్ధార్థ్ గుప్తా) బృందావనంలో రాధను వదిలి ద్వారకకు చేరుకున్న తర్వాతి జీవితాన్ని ఈ సినిమాలో చూడవచ్చు. ముఖ్యంగా సత్యభామ దృక్కోణం నుండి ఈ కథ నడుస్తుంది. కృష్ణునిపై ఆమెకు విపరీతమైన ప్రేమ ఉంటుంది. దానివల్ల ఆమె పొందిన హృదయ వేదన, రుక్మిణి (నివాశిని కృష్ణన్) సైలెన్స్ మధ్య కృష్ణుని జీవితం ఎలా సాగిందనేది ఈ మొదటి భాగంలో చూడవచ్చు.

Also Read : పందెం కోడి చుట్టూ పరుగులు పెట్టే మూవీ… కడుపుబ్బా నవ్వించే కామెడీ మావా

Advertisement

బాల్క తీర్థం వద్ద కృష్ణుని నిర్యాణంతో కథ మొదలవుతుంది. తరువాత 2026లో జగన్నాథపురికి మారుతుంది. అక్కడ ఆధునిక యువకుడు స్వామి (జాకీ ష్రాఫ్) ఆధ్యాత్మిక ఉపన్యాసాన్ని చెప్పడాన్ని వింటాడు. నేటి తరం యువతకు కృష్ణుని ప్రేమ తత్వం, ఆలోచనలు ఎలా ఉపయోగపడతాయో తెలుస్తుంది. తరువాత కథ ద్వాపర యుగంలోకి తీసుకెళ్తుంది.

సినిమాలో శ్రీకృష్ణుని దేవుడిలా కాకుండా, అన్ని రకాల భావోద్వేగాలు ఉన్న గొప్ప వ్యక్తిగా చూపించారు. ద్వారక రాజ్యాంగ బాధ్యతలు, తన భార్యలైన రుక్మిణి, సత్యభామలతో ఆయనకున్న అనుబంధం, చివరకు కురుక్షేత్ర యుద్ధానికి దారితీసిన పరిస్థితుల చుట్టూ నడిచే కథ ఆసక్తికరంగా ఉంటుంది. పెయింటింగ్ లాంటి విజువల్స్ తో అద్భుతంగా ఉండే ఈ మూవీని చూడడానికి ఓటీటీ మూవీ లవర్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

Related News

వీళ్ళకు చావులేదు… తెలుగులో స్ట్రీమింగ్ అవుతున్న హై-వోల్టేజ్ ఫాంటసీ యాక్షన్ సీక్వెల్

సముద్రం ఎడారిగా మారితే ? మనిషి మాంసం కోసం అగాధపు జీవుల అరాచకం… థ్రిల్లింగ్ సర్వైవల్ అడ్వెంచర్

ZEE5లో సెప్టెంబర్ సినిమాల జాతర… మైండ్ బ్లాక్ చేసే మల్టీ-లాంగ్వేజ్ మూవీస్ సిరీస్ల లిస్ట్

1300 కోట్ల థ్రిల్లర్ తెలుగులో… కేక పుట్టిస్తున్న మైండ్ బ్లాక్ క్రైమ్ కామెడీ

2600 కోట్ల కలెక్షన్లు… 7.9 IMDb రేటింగ్… తెలుగులో అందుబాటులో ఉన్న ఆల్ టైమ్ క్లాసిక్ మిస్టరీ థ్రిల్లర్

ఈ వారం ఓటీటీలో పండగే పండగ… తెలుగులో ఏకంగా 6 సూపర్ హిట్ సినిమాలు

ఫ్రెండ్స్‌తో చూస్తే పొట్టచేక్కలవ్వాల్సిందే… పిచ్చి పిచ్చి గొడవలతో నవ్వించే కామెడీ డ్రామా

ఎఫైర్ ను అడ్డం పెట్టుకుని ఇదేం పాడుపని ? ప్రతీ నిమిషం నెయిల్ బైటింగ్ సస్పెన్స్

Big Stories

Advertisement
×