E-Paper
Advertisement

Horror Comedy OTT : తాత ఆఖరి కోరిక… మెంటలెక్కించే మనవరాలు… క్లైమాక్స్ వరకు నవ్వులే

Horror Comedy OTT : తాత ఆఖరి కోరిక… మెంటలెక్కించే మనవరాలు… క్లైమాక్స్ వరకు నవ్వులే

Horror Comedy OTT : హారర్ సినిమాకు కామెడీని జోడిస్తే ఆ కిక్కే వేరబ్బా అంటున్నారు ప్రేక్షకులు. ఇక ఇలాంటి హారర్ కామెడీ సినిమాలు ఏ భాషలో వచ్చిన వదిలిపెట్టడం లేదు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే గుజరాతి మూవీ కూడా ఇదే జానర్లో వచ్చి మంచి రెస్పాన్స్ ఇచ్చింది. ఈ సినిమా కడుపుబ్బ నవ్విస్తూనే, భయపెట్టే సీన్లతో టెన్షన్ గా సాగుతుంది. ఈ హర్రర్ కామెడీ సినిమా పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే ..

ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అంటే

ఈ గుజరాతీ హర్రర్ కామెడీ మూవీ పేరు ‘అఫ్రా తఫ్రి’ (Affraa Taffri). వైరల్ రావు దర్శకత్వం వహించిన ఈ సినిమా, గుజరాతీ చిత్ర పరిశ్రమలో వచ్చిన మొదటి హర్రర్ కామెడీ చిత్రాలలో ఒకటిగా నిలిచింది. ఇందులో మిత్రా గధ్వి, ఖుషీ షా, చేతన్ దైయా, శేఖర్ శుక్లా ప్రధాన పాత్రల్లో నటించారు. దాదాపు 2 గంటల నిడివి ఉన్న ఈ సినిమా 2020 ఫిబ్రవరి 14న థియేటర్లలో రిలీజ్ అయింది. IMDbలో 7.0/10 రేటింగ్ ను కూడా పొందింది. ఈ సినిమా ప్రస్తుతం Amazon Prime Video, ShemarooMe, Airtel Xstream Playలో అందుబాటులో ఉంది.

స్టోరీ ఏమిటంటే

విశ్రాంపూర్ అనే ఊళ్లో ఒక ముసలాయన చనిపోవడానికి సిద్ధంగా ఉంటాడు. ఆయనకు తన మనవరాలు సోనాల్ పెళ్లి చూడాలని ఆఖరి కోరిక ఉంటుంది. కానీ ఆ అమ్మాయికి అప్పుడే పెళ్లి చేసుకోవడం అస్సలు ఇష్టం ఉండదు. ఇంట్లో వాళ్లేమో ముసలాయన పోయేలోపు పెళ్లి చేయాలని ఒక పక్క, ఆమెకు ఇష్టం లేక ఇంకో పక్క… ఇలా ఇల్లంతా గందరగోళంగా మారుతుంది. ఇక పెళ్లి చూపులు, హడావిడి జరుగుతుండగా కథలోకి దెయ్యం ఎంట్రీ ఇస్తుంది. అప్పటిదాకా నవ్వులాటగా సాగిన సీన్లు కాస్తా భయపెట్టేలా మారతాయి. ఆ ఇంట్లో ఏదో తేడా ఉందని అందరికీ అర్థమవుతుంది. అసలు ఆ దెయ్యం ఎందుకు వచ్చింది? పెళ్లిని ఆపడానికా ? పాత కక్షలు ఏవైనా ఉన్నాయా? ఆ ఇంట్లో ఉన్న దెయ్యం గొడవను ఎలా పరిష్కరించారు ? సోనాల్ పెళ్లి జరిగిందా ? అనే ప్రశ్నలకు సమాధానాలను తెలుసుకోవాలనుకుంటే, ఈ గుజరాతీ హర్రర్ కామెడీ సినిమాను మిస్ కాకుండా చూడండి.

Read Also : ప్రేమించిన ప్రతి ఒక్కడికి యమపురికి టిక్కెట్టు … డిటెక్టివ్ కే మెంటలెక్కించే కేసు… ఉక్కిరి బిక్కిరి చేసే మలుపులు

Tags

Related News

థియేటర్లలో డిజాస్టర్ ఈ తెలుగు మూవీ… ఓటీటీలో ట్రెండింగ్ లోకి ఎలాగబ్బా ?

ఎట్టకేలకు హాట్ స్టార్ మోస్ట్ అవైటింగ్ క్రైమ్ సిరీస్‌ రిలీజ్ డేట్ ఫిక్స్

ఈ వారం OTTలో చూడాల్సిన మలయాళ తమిళ సినిమాల లిస్ట్

ఈ వీకెండ్ ఓటీటీలో మిస్ అవ్వకుండా చూడాల్సిన తెలుగు కన్నడ సినిమాలు ఇవే

ట్రంకు పెట్టెలో శవం… భోజనానికి ఆహ్వానిస్తే బుర్రపాడు ట్విస్ట్

17 ఏళ్ల అమ్మాయి హత్య… ఓటీటీని ఊపేస్తున్న 6 ఎపిసోడ్‌ల మిస్టరీ థ్రిల్లర్

IMDbలో 7.5 రేటింగ్… మలయాళం మర్డర్ మిస్టరీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫ్లిక్స్

క్రైమ్ నుంచి రొమాన్స్ వరకు… ఈ వారం నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ కానున్న సినిమాలు ఇవే

Big Stories

×