E-Paper
Advertisement

Rajendra Prasad: చిన్నారిపై రాజేంద్రప్రసాద్ దురుసు ప్రవర్తన.. క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్!

Rajendra Prasad: చిన్నారిపై రాజేంద్రప్రసాద్ దురుసు ప్రవర్తన.. క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్!
Advertisement

Rajendra Prasad: సినిమా సెలబ్రిటీలు పబ్లిక్ ఫిగర్స్ కాబట్టి వారు ఎప్పుడైనా సరే పబ్లిక్ లోకి వస్తే వారితో కరచాలనం చేయాలని , ఫోటోలు దిగాలి అని అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తారు. అయితే అందులో కొంతమంది ఓపికగా అభిమానులకు సెల్ఫీలు ఇవ్వడానికి ఇష్టపడితే.. మరికొంతమంది చీదరించుకుంటూ ఉంటారు. ఆ తర్వాత సోషల్ మీడియాలో ట్రోల్స్ ఎదుర్కొన్న వారు కూడా లేకపోలేదు..అయితే ఇక్కడ సీనియర్ స్టార్ హీరో రాజేంద్రప్రసాద్(Rajendraprasad ) కూడా తాజాగా చిన్నారిపై విరుచుకుపడుతూ ఆ బాలుడిని పక్కకు తోసేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేయడంతో రాజేంద్రప్రసాద్ పై సోషల్ మీడియాలో భారీగా ట్రోల్స్ వైరల్ అవుతున్నాయి.

సెల్ఫీ అడిగిన బాలుడు.. కోపంతో తోసేసిన రాజేంద్రప్రసాద్..

చిత్ర పరిశ్రమలో సీనియర్ స్టార్ హీరో రాజేంద్రప్రసాద్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ముఖ్యంగా ఇండస్ట్రీలో ఎంతోమంది నటులు ఉన్నప్పటికీ దశాబ్దాల తరబడి తనదైన నటనతో ప్రేక్షకులను మెప్పిస్తూ ఇండస్ట్రీలో స్టార్ గా కొనసాగుతున్న అతి కొద్ది మందిలో ఈయన కూడా ఒకరు. చిన్న చిన్న పాత్రలు చేస్తూనే ఇండస్ట్రీలో స్టార్ స్టేటస్ సొంతం చేసుకున్న రాజేంద్రప్రసాద్.. ఇప్పటికీ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. ఒకప్పుడు కామెడీ, ఫ్యామిలీ హీరోగా పేరు దక్కించుకున్న ఈయన ఇప్పుడు హీరో , హీరోయిన్ కి తండ్రి పాత్రలో నటిస్తూ దూసుకుపోతున్నారు. అలాంటి ఒక గొప్ప నటుడు రాజేంద్రప్రసాద్ బయట కనిపిస్తే ఆయనతో ఫోటో తీసుకోవాలనే కోరిక అందరిలో ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఒక ఫోటో అడిగిన ఒక బాలుడిని తోసేసి ఆయన అడ్డంగా దొరికిపోయారు.

వీడియో వైరల్.. రాజేంద్రప్రసాద్ పై ట్రోల్స్..

Advertisement

వివరాలలోకి వెళితే.. తెలంగాణ డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కొడుకు వివాహం తాజాగా జరిగిన సంగతి తెలిసిందే.. ఈ సందర్భంగా చాలా మంది సినీ, రాజకీయ ప్రముఖులు, వ్యాపారవేత్తలు, దిగ్గజాలు ఈ పెళ్లి కార్యక్రమానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ నేపథ్యంలోనే సినీ ఇండస్ట్రీ నుండి నటుడు రాజేంద్రప్రసాద్ కూడా ఈ వేడుకకు హాజరయ్యారు. ఈ నేపథ్యంలోనే సెల్ఫీ అడిగిన ఒక పిల్లాడిని చిరాకుగా పక్కకు తోసేశారు. ఇక ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు ఆయనపై తమదైన స్టైల్ లో రియాక్ట్ అవుతున్నారు. ఒక చిన్న పిల్లవాడు సెల్ఫీ అడిగితే ఇవ్వాలి లేదా కుదరదని చెప్పాలి.. అలా తోసేయడం ఏంటి? కొంచమైనా ఆలోచన లేదా? అంటూ ఆయనపై సీరియస్ అవుతున్నారు. ఇక ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్..

ఇకపోతే రాజేంద్రప్రసాద్ ఇలా చిక్కుల్లో ఇరుక్కోవడం ఇదేమి మొదటిసారి కాదు.. మొన్నా మధ్య ఒక సినిమా వేదిక పైన రాజేంద్రప్రసాద్ నోరు జారుతూ.. బ్రహ్మానందం లాంటి నటులను టార్గెట్ చేసి వేదికలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో చాలామంది ఆయనపై విమర్శలు గుప్పించారు. ఇక అలాంటి సంఘటనలు మరువకముందే ఇప్పుడు మరో వివాదంలో చిక్కుకోవడంతో చాలామంది ఆశ్చర్యపోతున్నారు. ముఖ్యంగా రాజేంద్రప్రసాద్ ఆ కుర్రాడికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ ఉండడం గమనార్హం. మరి రాజేంద్రప్రసాద్ ఈ వైరల్ వీడియోపై ఏదైనా స్పందిస్తారో చూడాలి.

Advertisement

also read: Allu Sirish -Nayanika Reddy: పెళ్లి చేసుకున్న అల్లు శిరీష్.. సీఎం రేవంత్ రెడ్డి మొదలుకొని మెగాస్టార్ వరకు.. ఫోటోలు వైరల్!

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×