E-Paper
Advertisement

Romantic Comedy OTT : లవ్ అంటే ఇదేరా బుల్లోడా… పెళ్లి చూపుల్లో మొదలై పీటల దాకా… ఐయండిబిలో 8.2 రేటింగ్

Romantic Comedy OTT : లవ్ అంటే ఇదేరా బుల్లోడా… పెళ్లి చూపుల్లో మొదలై పీటల దాకా… ఐయండిబిలో 8.2 రేటింగ్
Advertisement

Romantic Comedy OTT : ఫ్యామిలీతో కలిసి ఓ చూడ చక్కని సినిమా చూడాలనుకుంటే, ఇప్పుడు చెప్పుకోబోయే మరాఠీ సినిమాపై ఓ లుక్ వేయండి. పెళ్లిచూపులతో మొదలయ్యే ఈ కథ క్లైమాక్స్ ముగింపు వరకు ఆసక్తికరంగా ఉంటుంది. ఎక్కడా బోర్ కొట్టకుండా దర్శకుడు తనదైన స్టైల్ లో రూపొందించారు ఈ సినిమాను. దీనికి ఐయండిబిలో 8.2 రేటింగ్ కూడా ఉంది. సినిమాను చూస్తే మాత్రం, ఓ మంచి స్టోరీని చూశామన్న ఫీలింగ్ కలుగుతుంది.

ఏ ఓటీటీలో చూడచ్చు అంటే

ఈ మరాఠీ రొమాంటిక్ కామెడీ సినిమా పేరు ‘శ్రీదేవి ప్రసన్న’ (Sridevi Prasanna). ఇందులో సాయి తమ్హంకర్ (శ్రీదేవిగా), సిద్ధార్థ్ చాందేకర్ (ప్రసన్నగా) నటించారు. హీరోయిన్ సాయి తమ్హంకర్ నటనకు మంచి గుర్తింపు లభించింది. ఆమె గతంలో తెలుగులో ‘మిమీ’ (Mimi) వంటి సినిమాల్లో నటించి గుర్తింపు పొందింది. హీరో సిద్ధార్థ్ చాందేకర్ కూడా తన నటనతో మెప్పించాడు. వీరిద్దరి మధ్య ఉండే కామెడీ టైమింగ్ సినిమాకు హైలైట్. ప్రముఖ మ్యూజిక్ కంపెనీ Tips Films మరాఠీ చిత్ర పరిశ్రమలోకి ఈ సినిమాతోనే మొదటిసారి అడుగుపెట్టింది. ఇది ఫిబ్రవరి 2, 2024న థియేటర్లలో విడుదలైంది. ప్రస్తుతం plex, tubi, apple tvలలో ఈ సినిమా అందుబాటులో ఉంది.

స్టోరీలోకి వెళ్తే

Advertisement

ప్రసన్న, శ్రీదేవి ఇద్దరూ పెళ్లి చూపుల్లో కలుస్తారు. ప్రసన్న చాలా పద్ధతిగా, అమాయకంగా కనిపిస్తే, శ్రీదేవి మాత్రం చాలా ప్రాక్టికల్‌గా, బోల్డ్‌గా ఉంటుంది. మొదటి పరిచయంలోనే వీళ్ళకు ఒకరిపై ఒకరికి పెద్దగా ఇంప్రెషన్ కలగదు. అసలు తమ మధ్య కెమిస్ట్రీ లేదని, ఒకరికొకరు సెట్ అవ్వమని ఫిక్స్ అయిపోయి, ఇంట్లో వాళ్లకు నో చెప్పేస్తారు. కానీ గొడవలు పడకుండా హుందాగా విడిపోవాలని నిర్ణయించుకుని కేవలం స్నేహితులుగా ఉండాలనుకుంటారు.

ఆ తర్వాత ఒకరి పెళ్లి సంబంధాల విషయంలో ఒకరు సాయం చేసుకోవడం మొదలుపెడతారు. శ్రీదేవికి నచ్చిన అబ్బాయిని వెతకడంలో ప్రసన్న, ప్రసన్నకు తగ్గ అమ్మాయిని చూడటంలో శ్రీదేవి సాయం చేసుకుంటారు. ఈ క్రమంలోనే ఒకరి గురించి ఒకరు పూర్తిగా తెలుసుకుంటారు. సినిమాల్లో చూపించే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ లాంటి మెరుపులు రాకపోయినా, ఒకరినొకరు అర్థం చేసుకోవడమే నిజమైన ప్రేమ అని గ్రహిస్తారు.

Advertisement

చివరికి తమకు కావాల్సిన భాగస్వామి తమ పక్కనే ఉన్నారనే విషయాన్ని తెలుసుకునే లోపు కొన్ని చిన్న చిన్న పొరపాట్లు, మనస్పర్థలు ఎదురవుతాయి. కానీ అవన్నీ దాటుకుని శ్రీదేవి, ప్రసన్న ఎలా ఒక్కటయ్యారు? వాళ్ళ కుటుంబ సభ్యులను ఎలా ఒప్పించారు? అనేదే ఈ సినిమా ముగింపు. ఇది కేవలం ఒక ప్రేమకథ మాత్రమే కాదు, పెళ్లి విషయంలో నేటి యువత పడే డైలమాను, కుటుంబ బంధాలను చాలా సరదాగా చూపిస్తుంది.

Read Also : మనవళ్లకు కథలు చెప్పాల్సిన వయసులో ప్రేమ పాఠాలు… డెబ్బై ఏళ్ల వయసులో డ్యాన్స్ స్టెప్పులు

Tags

Related News

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

ఫ్రెండ్ లైఫ్ లోకి అమ్మాయి వచ్చిందనే ద్వేషంతో ఇదేం పని ? నిబ్బా నిబ్బీలు డోంట్ మిస్

Big Stories

Advertisement
×