E-Paper
Advertisement

ఆంటీ మనసు దోచిన కుర్రాడు… ఓ సారి చూడాల్సిన చూడచక్కని కథ

ఆంటీ మనసు దోచిన కుర్రాడు… ఓ సారి చూడాల్సిన చూడచక్కని కథ

Romantic Movie OTT: ఓటీటీలో రొమాంటిక్ సినిమాలకు కొదవలేదు. అయితే కొన్ని సినిమాలు మెమరబుల్ గా నిలిచిపోతుంటాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా హాలీవుడ్ నుంచే వచ్చింది. అయితే ఇది హాలీవుడ్ రొమాంటిక్ సినిమానే అయినా, ఎక్కడా రొమాంటిక్ సీన్స్ హద్దులు దాటావు. ఇది ఒక ఫీల్ గుడ్ రొమాంటిక్ ల ఉంటుంది. దీని రైట్స్ కోసం ఓటీటీ సంస్థలు కూడా తెగ పోటీ పడ్డాయి. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం పదండి.

ఆపిల్ టివిలో స్ట్రీమింగ్

2022లో వచ్చిన ఈ అమెరికన్ రొమాంటిక్ కామెడీ సినిమా పేరు ‘చా చా రియల్ స్మూత్’ (Cha Cha Real Smooth). కూపర్ రైఫ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించడమే కాకుండా, కథానాయకుడిగా కూడా నటించారు. కూపర్ తన 21వ ఏట ఒక చిన్న సినిమా తీసి, దాని లింక్‌ను ప్రముఖ దర్శకుడు జే డూప్లాస్‌కు ట్విట్టర్‌లో పంపాడు. అలా మొదలైన అతని ప్రయాణం, ఈ సినిమాతో హాలీవుడ్‌లో హాట్ టాపిక్ అయ్యేలా చేసింది. ఇక ఇందులో డకోటా జాన్సన్ హీరోయిన్‌గా నటించడమే కాకుండా, ఈ సినిమాకు ఆమె వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ కూడా. అంతేకాకుండా ఈ సినిమాలో ఆటిజం ఉన్న అమ్మాయిగా నటించిన వెనెస్సా బర్గార్డ్కు నిజ జీవితంలో కూడా ఆటిజం ఉంది. ఆ పాత్రకు న్యాయం చేయాలని మేకర్స్ ఆమెనే ఎంచుకున్నారు. ఈ సినిమాను 2022 సన్‌డాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించినప్పుడు, అందరికీ బాగా నచ్చేసింది. దాంతో Apple TV ఈ సినిమా గ్లోబల్ రైట్స్‌ను దాదాపు $15 మిలియన్లకు (సుమారు ₹115 కోట్లు) కొనుగోలు చేసింది. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ వంటి పెద్ద కంపెనీలతో పోటీ పడి మరీ ఆపిల్ ఈ డీల్‌ను దక్కించుకుంది.

స్టోరీలోకి వెళ్తే

డిగ్రీ పూర్తి చేసి, చేతిలో పనిలేక ఖాళీగా ఉంటూ ఇబ్బంది పడుతున్న ఒక కుర్రాడి కథ ఇది. ఇంట్లో వాళ్ళ పోరు పడలేక, ఏదో ఒక పని చేయాలని ఫిక్స్ అయ్యి.. చివరకు బర్త్ డే ఫంక్షన్లు, పార్టీల్లో అందరినీ డ్యాన్సులతో ఉత్సాహపరిచే ‘పార్టీ స్టార్టర్’ అవతారం ఎత్తుతాడు. అలా ఒక ఫంక్షన్‌లో డొమినో అనే ఒక అందమైన పెళ్ళైన ఆమె, ఆమె కూతురు లోలా పరిచయమవుతారు. డొమినోకి ఆల్రెడీ పెళ్లయ్యి ఒక కూతురు ఉన్నా, ఆమె జీవితంలో ఏదో వెలితి ఉంటుంది. ఆండ్రూ తన సరదాతో, మాటలతో ఆమెను, ఆమె కూతురిని ఇట్టే బుట్టలో పడేస్తాడు. వాళ్ళిద్దరి మధ్య తెలియని ఒక స్నేహం, ఆ పైన ఒక చిన్నపాటి క్రష్ మొదలవుతాయి.

డొమినోకి కాబోయే భర్త ఉన్నా కూడా, ఆండ్రూ ఇచ్చే తోడు ఆమెకు నచ్చుతుంది. కానీ ఎక్కడా లైన్ దాటకుండా వాళ్ళ రిలేషన్ చాలా డీసెంట్‌గా సాగుతుంది. చివరికి ఏమవుతుందంటే.. ఆండ్రూకి లైఫ్ అంటే ఏంటో అర్థమవుతుంది. ప్రేమ అంటే కేవలం కలిసి ఉండటమే కాదు, ఎదుటివారి పరిస్థితిని అర్థం చేసుకోవడం కూడా అని తెలుసుకుంటాడు. డొమినో కూడా వయసులో తనకన్నా చిన్నవాడితో రిలేషన్ పెట్టుకుంటే, అతని లైఫ్ ఇబ్బందుల్లో పడుతుందని, పాత వ్యక్తితోనే సెటిల్ అయిపోతుంది. ఆండ్రూ తన సొంత కాళ్ళ మీద నిలబడి లైఫ్‌లో ముందుకు వెళ్తాడు. మొత్తం మీద ఇది ఒక మంచి ఫీల్ గుడ్ సినిమా.

Read Also : ప్రశాంత జీవితాన్ని తలకిందులు చేసిన హత్య… ప్రతి ఎపిసోడ్ లో ఒక కొత్త మలుపు… ఊహకు అందని క్లైమాక్స్

Tags

Related News

తెలుగు నుంచి హిందీ వరకు… ఈ వీకెండ్ మిస్ అవ్వకుండా చూడాల్సిన 11 సినిమాలు

థియేటర్లలో డిజాస్టర్ ఈ తెలుగు మూవీ… ఓటీటీలో ట్రెండింగ్ లోకి ఎలాగబ్బా ?

ఎట్టకేలకు హాట్ స్టార్ మోస్ట్ అవైటింగ్ క్రైమ్ సిరీస్‌ రిలీజ్ డేట్ ఫిక్స్

ఈ వారం OTTలో చూడాల్సిన మలయాళ తమిళ సినిమాల లిస్ట్

ఈ వీకెండ్ ఓటీటీలో మిస్ అవ్వకుండా చూడాల్సిన తెలుగు కన్నడ సినిమాలు ఇవే

ట్రంకు పెట్టెలో శవం… భోజనానికి ఆహ్వానిస్తే బుర్రపాడు ట్విస్ట్

17 ఏళ్ల అమ్మాయి హత్య… ఓటీటీని ఊపేస్తున్న 6 ఎపిసోడ్‌ల మిస్టరీ థ్రిల్లర్

IMDbలో 7.5 రేటింగ్… మలయాళం మర్డర్ మిస్టరీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫ్లిక్స్

Big Stories

×