Time Loop Horror Movie OTT : టైం లూప్ కాన్సెప్ట్ తో రూపొందే సినిమాలు సాధారణంగానే మిగతా సినిమాల కంటే కాస్త భిన్నంగా ఉంటాయి. అందుకే అలాంటి సినిమాలు చూడడానికి ఇంట్రస్టింగ్ గా ఉంటాయి. అంతేనా ఈ సినిమాలలో రిపీటెడ్ సీన్లు ఉన్నా కూడా నెక్స్ట్ వచ్చే ట్విస్ట్ ఏంటో కనిపెట్టలేము. ఇక ఇలాంటి ఆసక్తికరమైన టైం లూప్ అంశానికి హర్రర్ తోడైతే ఎలా ఉంటుందో తెలియాలంటే ఈ రోజు మన మూవీ సజెషన్ లోకి వెళ్ళిపోదాం పదండి.
ఇప్పుడు మనం చెప్పుకుంటున్న సినిమా పేరు ‘Haunter (2013)’. ఇదొక వెరైటీ సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్. మామూలుగా అయితే దయ్యాల సినిమాల్లో మనుషులకి దయ్యాలు కనిపిస్తాయి. కానీ ఇందులో మాత్రం దయ్యానికే మనుషులు కనిపిస్తే ఎలా ఉంటుంది ? అనే కోణంలో కొత్తగా చూపించే ప్రయత్నం చేశారు. ఈ సినిమా ప్రస్తుతం ఇండియాలోని ప్రముఖ ఓటీటీలైన నెట్‌ఫ్లిక్స్, హాట్‌స్టార్‌లలో అందుబాటులో లేదు. అలాగే Amazon Prime Videoలో కొన్ని రీజియన్లలో మాత్రమే చూడడానికి అవకాశం ఉంది. ఒకవేళ ఈ మూవీని చూడాలంటే థర్డ్ పార్టీ స్ట్రీమింగ్ సైట్లలో వెతకాల్సిందే. ఈ చిత్రానికి ‘లిటిల్ మిస్ సన్‌షైన్’ ఫేమ్ అబిగైల్ బ్రెస్లిన్ ప్రాణం పోసిందని చెప్పాలి. మూవీ భయపెట్టడమే కాకుండా, ఒక మంచి సస్పెన్స్ మిస్టరీలా నడుస్తుంది. ‘టైమ్ లూప్’ కాన్సెప్ట్ ని హారర్ కి ముడిపెట్టడంతో ఒక ఫ్రెష్ హర్రర్ మూవీని చూసిన ఫీలింగ్ వస్తుంది.
మూవీ మొత్తం లిసా అనే అమ్మాయి చుట్టూ తిరుగుతుంది. ఆమె తన తల్లిదండ్రులు, తమ్ముడితో కలిసి నివసిస్తుంది. ఇక్కడే కథలో ట్విస్ట్ షురూ అవుతుంది. అదేంటంటే లిసాకి ప్రతిరోజూ ఒకేలా మొదలవుతుంది. ఆమె పుట్టిన రోజుకి ముందు రోజే అంటే 1985 సంవత్సరంలోనే ఆమె మళ్ళీ మళ్ళీ మేల్కొంటుంది. ఇంట్లో వాళ్ళందరూ బర్త్ డే హడావిడీలోనే ఉంటారు. రోజూ అదే తిండి తింటారు. తన ఫ్యామిలీ అంతా ఒకే రోజులో బందీ అయిపోయారని లిసా అనుకుంటుంది. అలాగే వారంతా నిజానికి చనిపోయి దయ్యాలుగా మారారని ఆ అమ్మాయి కనిపెడుతుంది. కానీ ఆ విషయం లిసాకి తప్ప ఇంట్లో ఎవరికీ గుర్తుండకపోవడం మరో ట్విస్ట్.
Also Read : స్టూడెంట్‌తో టీచర్ రిలేషన్… బాబోయ్ అంత ఓపెన్ గా ఎలా తీశారు ?
తనని, తనతో పాటు కుటుంబాన్ని ఈ ‘టైమ్ లూప్’లో బంధించింది ఎవరా ? అని లిసా ఆరా తీయడం మొదలు పెడుతుంది. ఆ క్రమంలో ఆమెకు అదే ఇంట్లో ప్రస్తుత కాలంలో నివసిస్తున్న ఒక అమ్మాయి కన్పిస్తుంది. అంటే లిసా 1985 టైం నుండి ప్రస్తుతం ఆ ఇంట్లో ఉంటున్న మనుషులతో కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆ ఇంట్లో గతంలో నివసించిన ఒక సీరియల్ కిల్లర్ (The Pale Man) గురించి తెలుసుకుంటుంది.
వాడు బతికున్నప్పుడు అమ్మాయిలను చంపేవాడు. చనిపోయాక కూడా దయ్యంలా మారి ఆ ఇంట్లోకి వచ్చిన వాళ్ళ ఆత్మలను బంధిస్తున్నాడని అర్థమవుతుంది. ఆ దుష్టాత్మ (Pale Man) నుండి తన కుటుంబాన్ని, ఇప్పుడు ఆ ఇంట్లో ఉన్న కొత్త ఫ్యామిలీని కాపాడాలని నిర్ణయించుకుని, ఓ ప్లాన్ వేస్తుంది లిసా. మరి ఆ అమ్మాయి వేసిన ప్లాన్ ఏంటి? ఆ సైకో దెయ్యం నుంచి ఎలా తప్పించుకున్నారు ? అనేది సినిమాలో చూడాల్సిన క్లైమాక్స్.