E-Paper
Advertisement

Horror Movie OTT : నరకం పేరు వింటేనే పారిపోయేలా చేసే హర్రర్ మూవీ… చూడాలంటే హనుమాన్ చాలీసా పక్కనుండాల్సిందే భయ్యా

Horror Movie OTT : నరకం పేరు వింటేనే పారిపోయేలా చేసే హర్రర్ మూవీ… చూడాలంటే హనుమాన్ చాలీసా పక్కనుండాల్సిందే భయ్యా
Advertisement

Horror Movie OTT : ఓటీటీ ప్రియుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. థియేటర్లకు వెళ్లే బదులు, ఇంట్లోనే హర్రర్ నుండి కామెడీ వరకు అన్ని రకాల సినిమాలు చూడటానికి ఇష్టపడుతున్నారు. ఇక డిజిటల్ ప్లాట్ ఫామ్స్ లో కంటెంట్‌లో పుష్కలంగా ఉన్నప్పటికీ, బెస్ట్ సినిమాలు, సిరీస్‌లను వెతకడం కొంచెం కష్టం కావచ్చు. ఈరోజు మనం ఒక భయంకరమైన హర్రర్ సినిమా గురించి మాట్లాడుకోబోతున్నాము. మరి మూవీ టైటిల్ ఏంటి? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.

నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్

2023లో విడుదలైన ఇండోనేషియన్ రిలిజియస్ హారర్ ఫిల్మ్ ‘సిక్సా నెరాకా (Siksa Neraka)’. దర్శకుడు అంగ్గా ద్విమాస్ ససోంగ్కో… MB Rahimsyah రాసిన ఇస్లామిక్ కామిక్ బుక్ ఆధారంగా ఈ సినిమాను తీసారు. నరకంలో శిక్షలు (Azab Neraka) అనే అంశం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో ఒక్కో సీన్ ఒళ్ళు గగుర్పొడిచేలా ఉంటుంది. కీఫ్లీ బావో (సలేహ్), రియాన్ ఆరిఫ్ రహ్మాన్ (ఫిరాస్), నఫీసా ఫిత్రియానీ (ఫాతిమా), రింటిక్ రిజ్కీ (తిర్మిజీ), ఆరియో బాయు, ఫెలిసియా టిస్సెన్, జోసెఫిన్ ఫిర్మస్టోన్, ఆస్త్రిద్ తిర్తహాడి ఈ సినిమాలో నటించారు. రన్‌టైమ్ 1 గంట 38 నిమిషాలు ఉన్న ఈ మూవీ ఇండోనేషియాలో సూపర్ హిట్, కానీ మిక్స్‌డ్ రివ్యూస్ అందుకుంది. IMDb లో 5.2 రేటింగ్ ఉన్న ఈ సినిమా రిలిజియస్ హారర్ సినిమాలను ఇష్టపడే వారిపై స్ట్రాంగ్ ఇంపాక్ట్ చూపిస్తుంది. ప్రస్తుతం Netflixలో స్ట్రీమింగ్ అందుబాటులో ఉంది.

Advertisement

Read Also : కళ్ళు పోగొట్టే పాడు రోగం… డబ్బు కోసం పాకులాడుతూ కన్నింగ్ ప్లాన్… లాస్ట్ ట్విస్ట్ హైలెట్

స్టోరీలోకి వెళ్తే

కథ సలేహ్, ఫిరాస్, ఫాతిమా, తిర్మిజీ అనే నలుగురు సోదరుల చుట్టూ తిరుగుతుంది. ఈ పిల్లల తల్లి చనిపోవడంతో తండ్రి మళ్లీ పెళ్లి చేసుకుంటాడు. సవతి తల్లి వారిని చాలా వేధిస్తుంది. శారీరకంగా, మానసికంగా టార్చర్ చేస్తుంది. పిల్లలు ఆ బాధలు తట్టుకోలేక చనిపోతారు. చచ్చిన తర్వాత నరకంలో కళ్ళు తెరుస్తారు. ఇక్కడి నుంచి అసలు కథ మొదలవుతుంది. ఇస్లామిక్ మత గ్రంథాల్లో వర్ణించిన నరక శిక్షలు (Azab) అక్కడ ఉంటాయి.

Advertisement

చనిపోయిన నలుగురిలో ఒక్కొక్కరు తమ జీవితంలో చేసిన పాపాలకు తగిన శిక్ష అనుభవిస్తారు. ఉదాహరణకు దొంగతనం చేస్తే చేతులు కాలుస్తారు. అబద్ధాలు చెప్పితే నాలుక కత్తిరిస్తారు. నరకంలో జహన్నం గార్డియన్స్ భయంకరమైన శిక్షలు… మంటల్లో కాలడం, రాళ్లు మింగేలా చేయడం, జీవచ్ఛవాలను తినడం లాంటి గ్రాఫిక్ సీన్స్ ఉంటాయి. పిల్లలు నరక శిక్షలను అనుభవిస్తూనే తమ జీవితంలో చేసిన తప్పుల గురించి రియలైజ్ అవుతారు. కథలో చేసిన పాపాలకు శిక్ష తప్పదు, మంచి పనులు చేయాలి అనే హెచ్చరికతో పాటు రిలిజియస్ మెసేజ్ బలంగా ఉంటుంది. డిస్టర్బింగ్ సీన్స్ ఉంటాయి కాబట్టి జాగ్రత్త. హార్ట్ వీక్ గా ఉన్నవాళ్ళు అస్సలు చూడొద్దు.

Tags

Related News

This week OTT Releases : ఈ వారం ఓటీటీ లవర్స్ కు పండగే.. ఏకంగా 18 సినిమాలు స్ట్రీమింగ్..!

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

Big Stories

Advertisement
×