E-Paper
Advertisement

Suspense Thriller OTT : గర్ల్ ఫ్రెండ్ నుంచి ఫోన్… అంతలోనే అన్నోన్ డెలివరీ… కట్ చేస్తే ఫింగర్ కట్టయ్యే షాకింగ్ ట్విస్ట్

Suspense Thriller OTT : గర్ల్ ఫ్రెండ్ నుంచి ఫోన్… అంతలోనే అన్నోన్ డెలివరీ… కట్ చేస్తే ఫింగర్ కట్టయ్యే షాకింగ్ ట్విస్ట్
Advertisement

Suspense Thriller OTT : తక్కువ బడ్జెట్‌లో టాలెంట్ ని చూపించుకునే మార్గం ఏదైనా ఉందంటే అది షార్ట్ ఫిల్మ్ మాత్రమే. కంటెంట్ బాగుంటే అంతర్జాతీయంగా కూడా మంచి గుర్తింపు వస్తుంది. ఈ నేపథ్యంలో కేవలం లైటింగ్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తో సస్పెన్స్‌ను క్రియేట్ చేయడంలో దర్శకుడు విజయం సాధించారు. దీని మేకింగ్ స్టైల్, మ్యూజిక్ సినిమాలోని సస్పెన్స్‌ను బాగా ఎలివేట్ చేశాయి. ఒక వేలు చుట్టూ తిరిగే ఈ కథ ఆడియన్స్ ని ఆకట్టుకుంటోంది. మరి దీని పేరు ? ఎక్కడ ఉంది ? అనే వివరాలను తెలుడుకుందాం పదండి.

యూట్యూబ్ లో స్ట్రీమింగ్

రవికుమార్ K. (K. Ravi Kumar) దర్శకత్వంలో ‘ఫింగర్’ (Finger) అనే సస్పెన్స్‌ థ్రిల్లర్ షార్ట్ ఫిలిం 2025లో విడుదలైంది. ఈ చిత్రంలో శ్రీప్రియ ప్రధాన పాత్రలో నటించారు, ఆమె నటనకు మంచి గుర్తింపు లభించింది. దర్శకుడు కే. రవికుమార్ కూడా ఇందులో నటించారు. కే. రవికుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించడమే కాకుండా కథను కూడా అందించారు. దీనికి సంబంధించిన ట్రైలర్ జూలై 2025లో విడుదలైంది. ఇది ఒక ఇండిపెండెంట్ షార్ట్ ఫిలిం. యూట్యూబ్ లో ఈ సినిమాను ఫ్రీ గానే చూడవచ్చు.

స్టోరీ ఏమిటంటే

Advertisement

ఒక ప్రదేశంలో శ్రీప్రియ అనే అమ్మాయికి ఒక వింతైన సమస్య ఎదురవుతుంది. సినిమా టైటిల్‌కు తగ్గట్టుగానే, ఒక మనిషి వేలు ఈ కథలో కీలక పాత్ర పోషిస్తుంది. ఆమెకు ఒక మనిషి వేలు కనిపిస్తుంది. ఆమెకు అది ఎలా దొరికింది? అది ఎవరిది? అనే ప్రశ్నలతో కథలో సస్పెన్స్ మొదలవుతుంది. ఆ వేలు దొరికిన తర్వాత, ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయాలా లేక దాని వెనుక ఉన్న రహస్యాన్ని తనే ఛేదించాలా అనే గందరగోళంలో పడుతుంది. ఈ క్రమంలో ఆమెకు కొన్ని భయంకరమైన నిజాలు తెలుస్తాయి. సాధారణంగా ఇలాంటి షార్ట్ ఫిలిమ్స్ చివరలో ఒక ఊహించని మలుపు ఉంటుంది. ‘ఫింగర్’ సినిమాలో కూడా ఆ వేలు ఎవరిది అనే నిజాన్ని బయటపెడుతూ దర్శకుడు దీనిని ఉత్కంఠంగా చూపించారు. అసలు ఆ వేలు సంగతి ఏమిటో తెలుసుకోవాలనుకుంటే ఈ సస్పెన్స్‌ థ్రిల్లర్ షార్ట్ ఫిల్మ్ ని చూసేయండి.

Read Also : మహిళల్ని మాత్రమే చంపే మాస్క్ మ్యాన్… ఆ పార్ట్స్ కట్ చేసి అరాచకం భయ్యా… లాస్ట్ ట్విస్టుకు మైండ్ పోవడం పక్కా

Tags

Related News

ఆకాశం నుంచి కురిసే యాసిడ్‌ వర్షం… ప్రాణాల కోసం పరుగులు…సైన్స్‌ ఫిక్షన్‌ డిజాస్టర్‌ థ్రిల్లర్‌

అర్ధరాత్రి పెట్రోల్‌ బంక్‌ దగ్గర మహిళ… స్నైపర్‌ గురితో గుండె గుభేల్… బెస్ట్ సర్వైవల్ థ్రిల్లర్‌

చనిపోయిన తల్లి ఆత్మ కూతురిని వెంటాడితే… ఆ కుటుంబాన్ని కాపాడేందుకు అఘోరీ రంగంలోకి! కన్నడ హారర్‌ థ్రిల్లర్‌

ఇంటి ముందు పడే ఉల్క… కుటుంబంలో క్రేజీ మార్పులు… దిగి వచ్చిన గ్రహాంతర శక్తితో కల్లోలం

సముద్రం అడుగున యుద్ధ నౌక శిథిలాల్లో చిక్కుకున్న ఫ్రెండ్స్‌… చుట్టూ ప్రాణాలు తీసే షార్క్స్‌! బయటపడే దారి ఉందా?

దేశాన్ని కుదిపేసే కుట్ర… సొంత టీమ్‌లోనే శత్రువు… కొరియన్ యాక్షన్ థ్రిల్లర్

కారులో కూర్చొని బ్యాంకుల్ని హ్యాక్‌ చేసే కుర్రాడు… ఒక్క పొరపాటుతో ప్రాణాల మీదకు…

చనిపోయినట్టు నటించి మార్చురీలోకి వెళ్ళే యువతి… చచ్చినా వదలకుండా దారుణం… ఓటీటీలోకి హారర్‌ థ్రిల్లర్‌

Big Stories

Advertisement
×