E-Paper
Advertisement

ఐయండిబిలో 8.5 పైగా రేటింగ్ తో దడ పుట్టిస్తున్న హారర్ సిరీస్ లు… ఎక్కడ చూడచ్చో తెలుసా

ఐయండిబిలో 8.5 పైగా రేటింగ్ తో దడ పుట్టిస్తున్న హారర్ సిరీస్ లు… ఎక్కడ చూడచ్చో తెలుసా
Advertisement

Horror Series on OTT : హారర్ సినిమాలంటే ఇష్టపడే వాళ్ళకి ఓటీటీ ప్రపంచం ఒక పెద్ద వరం. సినిమాలు, సిరీస్ లతో ఇవి కళకళ లాడుతున్నాయి. అయితే కొన్ని సిరీస్‌లు కేవలం భయపెట్టడమే కాకుండా, మన మెదడుకు పనిపెడుతూ, వెన్నులో వణుకు పుట్టిస్తాయి. వీటిలో ఐయండిబిలో 8.5 కంటే ఎక్కువ రేటింగ్ సాధించిన ఈ 5 సిరీస్‌లు చూస్తున్నప్పుడు గుండె ధైర్యం చాలా అవసరం. అందుకే హార్ట్ వీక్ ఉన్నవాళ్లు వీటిని చూడకపోవడమే మంచిది.

1. స్ట్రేంజర్ థింగ్స్ (Stranger Things)

ఓటీటీ చరిత్రలోనే అత్యంత ప్రజాదరణ పొందిన సిరీస్‌లలో ఇది ఒకటి. 1980ల నాటి నేపథ్యంలో సాగే ఈ కథలో ఒక చిన్న బాలుడు అదృశ్యమవ్వడం, ఆ తర్వాత బయటపడే మరో ప్రపంచం (Upside Down), అందులోని వింత జీవులు ప్రేక్షకులను థ్రిల్‌కు గురిచేస్తాయి. ఇందులో హారర్‌తో పాటు సైన్స్ ఫిక్షన్, ఎమోషన్స్ అద్భుతంగా ఉంటాయి. ఐయండిబిలో దీనికి రేటింగ్ 8.7/10 రేటింగ్ కూడా ఉంది. నెట్‌ఫ్లిక్స్ (Netflix)లో దీనిని చూడచ్చు.

2. ది హాంటింగ్ ఆఫ్ హిల్ హౌస్ (The Haunting of Hill House)

Advertisement

మీరు నిజమైన దెయ్యాల కథను చూడాలనుకుంటే ఇది బెస్ట్ ఛాయిస్. ఒక పాత ఇంట్లో పెరిగిన ఐదుగురు తోబుట్టువుల కథ ఇది. చిన్నప్పుడు ఆ ఇంట్లో వాళ్ళు ఎదుర్కొన్న భయంకరమైన సంఘటనలు, పెద్దయ్యాక కూడా వాళ్ళని ఎలా వెంటాడాయనేది దర్శకుడు మైక్ ఫ్లానగన్ అద్భుతంగా తెరకెక్కించారు. ఐయండిబిలో దీనికి 8.6/10 రేటింగ్ ఉంది. నెట్‌ఫ్లిక్స్ (Netflix)లో దీనిని చూడచ్చు.

3. హన్నిబాల్ (Hannibal)

ఇది కేవలం దెయ్యాల కథ కాదు, ఒక సైకలాజికల్ హారర్ థ్రిల్లర్. ఒక డిటెక్టివ్, ఒక సైకోపాత్ డాక్టర్‌కి మధ్య సాగే మైండ్ గేమ్ ఇది. ఇందులోని విజువల్స్ చాలా భయంకరంగా, హింసాత్మకంగా ఉంటాయి. మనుషులను చంపి వంట చేసుకునే సన్నివేశాలు బలహీన మనుషులు అస్సలు చూడలేరు. ఐయండిబిలో దీనికి 8.5/10 రేటింగ్ తో ఇది అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో స్ట్రీమ్ అవుతోంది.

4. ది లాస్ట్ ఆఫ్ అస్ (The Last of Us)

Advertisement

ఒక వింత ఫంగస్ వల్ల మనుషులందరూ జాంబీస్ లాగా మారితే ప్రపంచం ఎలా ఉంటుందో ఈ సిరీస్ చూపిస్తుంది. ఇందులో జోయల్, ఎల్లీ అనే ఇద్దరు వ్యక్తులు ఈ ప్రమాదకరమైన ప్రపంచంలో ఎలా సర్వైవ్ అయ్యారనేది కథ. ఇందులోని ‘క్లిక్కర్స్’ అనే వింత జీవులు చేసే శబ్దాలు వింటేనే భయం వేస్తుంది. ఇది 8.7/10 రేటింగ్ తో జియో సినిమా (JioCinema)లో అందుబాటులో ఉంది.

5. Twin Peaks

డేవిడ్ లించ్, మార్క్ ఫ్రాస్ట్ సృష్టించిన ఒక సంచలనాత్మక అమెరికన్ మిస్టరీ థ్రిల్లర్ సిరీస్ ఇది. చరిత్రలోనే అత్యంత ప్రభావవంతమైన సిరీస్‌లలో ఒకటిగా నిలిచింది. వాషింగ్టన్‌లోని ‘ట్విన్ పీక్స్’ అనే చిన్న పట్టణంలో ఒక అమ్మాయి హత్యకు గురవుతుంది. ఈ కేసును దర్యాప్తు చేయడానికి వచ్చిన ఎఫ్‌బిఐ ఏజెంట్, కొన్ని అతీంద్రియ శక్తులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇది 8.7/10 రేటింగ్ తో ప్రైమ్ వీడియో, ముబి ఓటీటీలలో అందుబాటులో ఉంది. మీరు నిజంగా హారర్ జానర్‌ను ప్రేమిస్తే వీటిని అస్సలు మిస్ అవ్వకండి. అయితే ఒంటరిగా, చీకట్లో చూసేటప్పుడు మాత్రం కాస్త జాగ్రత్త.

Read Also : ఆ యాప్ క్లిక్ చేశావో నీ సమాధి నీవే తవ్వుకున్నట్లు.. ఓటీటీలోకి భయం పుట్టించే థ్రిల్లర్ సిరీస్

Tags

Related News

12 ఏళ్ల ప్రయాణానికి మైండ్ బ్లోయింగ్ ముగింపు… మోటార్ ప్రపంచంలో అడ్వెంచరస్ రోలర్‌కోస్టర్ రైడ్

కుటుంబం, ప్రేమ మధ్య నలిగిపోయే క్లాసికల్ మ్యూజిషియన్ కథ… కన్నీళ్లు పెట్టించే ఎమోషనల్ జర్నీ

హైదరాబాద్ కుర్రాడికి కొరియన్ దెయ్యంతో లవ్… కితకితలు పెట్టే ఇండో-కొరియన్ థ్రిల్లర్

సోమరిపోతులే ఓటీటీలో సినిమాలు చూస్తారా? శివాజీ షాకింగ్ కామెంట్స్!

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. ఏకంగా 14 స్ట్రీమింగ్…!

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

Big Stories

Advertisement
×