E-Paper
Advertisement

Horror thriller OTT : దెయ్యాల కొంపలో యూట్యూబర్లు… సీను సీనుకి చుక్కలు చూపిస్తూ… క్రేజీ హర్రర్ మూవీ

Horror thriller OTT : దెయ్యాల కొంపలో యూట్యూబర్లు… సీను సీనుకి చుక్కలు చూపిస్తూ… క్రేజీ హర్రర్ మూవీ
Advertisement

Horror thriller OTT : దెయ్యాల సినిమాలకు ఫ్యాన్స్ ఎక్కువే. అయితే వీటిని ఎక్కువగా తోడు పెట్టుకునే చూస్తుంటారు. నిజానికి ఈ సినిమాలకి భాషను కూడా పట్టించుకోరు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమాలో కావాలనే దెయ్యంతో కయ్యం పెట్టుకుంటారు ఇద్దరు స్నేహితులు. యూట్యూబ్ వీడియోల కోసం వీళ్ళు భయాంకరమైన ప్రమాదంలో పడతారు. యూత్ కి ఈ సినిమా భలే ఉంటుంది. వణుకు పుట్టించే సీన్లు కూడా ఉన్నాయి. మరి ఈ వీకెండ్ ఓ లుక్ వేయండి ఈ సినిమాపై. దీని పేరు, ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే…

ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే

సూపర్‌నాచురల్ హారర్ థ్రిల్లర్ మూవీ పేరు ‘డు నాట్ ఎంటర్’ (Do Not Enter). 2024లో వచ్చిన ఈ సినిమా ఫౌండ్ ఫుటేజ్ స్టైల్‌లో ఉంటుంది. దీని స్పానిష్ ఒరిజినల్ టైటిల్ ‘No Entres’. దీన్ని హ్యూగో కార్డోజో దర్శకత్వం వహించాడు. ఇది 2024 మే 15న 77వ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రీమియర్ అయింది, అగస్ట్ 15న థియేటర్స్‌లో రిలీజ్ అయింది. ప్రస్తుతం ఈ సినిమా భారతదేశంలో JioHotstar మరియు Airtel Xstream Playలో అందుబాటులో ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

ఆల్డో, క్రిస్టియన్ అనే ఇద్దరు స్నేహితులు యూట్యూబర్లుగా కాలం వెళ్లదీస్తూ ఉంటారు. తక్కువ కాలంలో ఎక్కువ ఫేమస్ అవ్వాలని కలలు కంటుంటారు. మొదట్లో వాళ్ళూ చిన్నా చితకా వీడియోలను చేసేవాళ్ళు. అయితే వాటికి పెద్దగా వ్యూస్ వచ్చేవి కావు. ఒకసారి ఒక పాత పాడుబడిన భవనంలోకి వీడియో కోసం వెళతారు. అక్కడ ఫేక్ దెయ్యం పెట్టి ఒక వీడియో చేస్తారు. ప్రజల దృష్టిలో పడటానికి, ఆ ఇంట్లో దెయ్యం ఉన్నట్లు కొన్ని నకిలీ వీడియోలను అప్‌లోడ్ చేస్తారు. ఆ వీడియో వైరల్ అవ్వడంతో, వాళ్ళ ఫాలోవర్స్ ఒక ఛాలెంజ్ విసురుతారు: మీకు నిజంగా ధైర్యముంటే అదే ఇంటికి రాత్రి పూట ఒంటరిగా వెళ్లి లైవ్ చేయండని చెప్తారు. ఎక్కువ లైక్స్, సబ్‌స్క్రైబర్స్ కోసం వాళ్ళు ఆ ప్రమాదకరమైన ఛాలెంజ్‌కు ఒప్పుకుంటారు.

రాత్రి పూట ఆ బిల్డింగ్ లోకి వెళ్ళాక అసలు కథ మొదలవుతుంది. మొదట సరదాగా అనిపించినా, నెమ్మదిగా అక్కడ వింత శబ్దాలు, ఆశ్చర్య పరిచే సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఆ ఇల్లు కేవలం పాడుబడిన భవనం మాత్రమే కాదు. గతంలో అక్కడ ఖైదీలను బంధించి చిత్రహింసలకు గురిచేసేవారని తెలుసుకుంటారు. అక్కడ చనిపోయిన ఆత్మలు, ఒక శక్తివంతమైన దుష్టశక్తి రూపంలో వీళ్ళ భరతం పడుతుంది. వాళ్ళు ఆ ఇంటి నుండి ప్రాణాలతో బయటపడ్డారా ? లేదా ఆ దుష్టశక్తికి బలియ్యారా అనే ఉత్కంఠతో క్లైమాక్స్ సాగుతుంది.

Advertisement

Read Also :  దృశ్యం సినిమాను తలపించే తమిళ మూవీ… కూతురు లాంటి అమ్మాయితోనే ఆ పని… మతిపోగోట్టే సస్పెన్స్

Tags

Related News

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

ఫ్రెండ్ లైఫ్ లోకి అమ్మాయి వచ్చిందనే ద్వేషంతో ఇదేం పని ? నిబ్బా నిబ్బీలు డోంట్ మిస్

Big Stories

Advertisement
×