E-Paper
Advertisement

Barabar Premistha Movie Review ‘బరాబర్ ప్రేమిస్తా’ రివ్యూ

Barabar Premistha Movie Review ‘బరాబర్ ప్రేమిస్తా’ రివ్యూ
Advertisement

కథేంది.. లొల్లి ఏంది ? 

ముచ్చట అదిలాబాద్ జిల్లా రుద్రవరం అనే ఊరిది. అక్కడ ధర్మాన, కర్మాన అని రెండు బ్యాచ్‌లు ఉంటాయి. పొద్దున లేస్తే చాలు.. ఒకరి మీద ఒకరు కత్తులు నూరుకుంటూ ఉంటారు. కర్మాన బ్యాచ్ లీడర్ సర్పంచ్ (మురళీధర్ రావు) బిడ్డ బుజ్జమ్మ (మేఘన ముఖర్జీ), అటు సైడ్ ధర్మాన బ్యాచ్ పోరడు చందు (చంద్రహాస్) తో లవ్ లో పడతది. ఊరోళ్లు ఒప్పుకోరని గీ జంట గమ్మున కేరళకు జంప్ అవుతది. మరి అక్కడికి పోయినోళ్లు మళ్ళీ ఎందుకు రిటర్న్ వచ్చారు? వచ్చినక సర్పంచ్ గారు వీళ్ళని ఆరగిండ్రా లేక హారతి ఇచ్చిండ్రా? అనేదే అసలు ముచ్చట.

Read also-Yellamma: దేవీను ఢీ కొట్టడానికి సిద్ధమైన స్టార్ హీరో..వేణు ఆలోచనలు అదుర్స్!

విశ్లేషణ :

Advertisement

డైరెక్టర్ సంపత్ గారు పాత కాలం నాటి ‘వర్గ పోరు’ ముచ్చటనే తీసిండు కానీ, దానికి కొంచెం కేరళ టూరిజం అద్దినట్టున్నాడు. ఫస్ట్ హాఫ్ లో కాలేజ్ స్టూడెంట్స్ లొల్లి, రొమాన్స్ పేరుతో సాగదీసిండ్రు. సినిమా చూస్తుంటే “అరేయ్.. ఇట్లంటి బొమ్మలు మనం చిన్నప్పటి నుంచి మస్తు చూసినం కదా” అనిపిస్తది. సెకండాఫ్ లో విలేజ్ డ్రామా కొంచెం ఎమోషనల్ గా మార్చే ప్రయత్నం చేసినా.. క్లైమాక్స్ లో వచ్చే ఆ ట్విస్ట్ చూస్తే “ఇదా సార్ మీరు మాకు ఇచ్చే సర్ప్రైజ్?” అని తల గోక్కుంటారు జనాలు. చివర్లో ఏదో మెసేజ్ ఇచ్చిండ్రు కానీ.. అది అప్పటికే థియేటర్ నుంచి బయటికి పరుగెత్తే జనాలకి వినిపిస్తదో లేదో తెలవదు!

ప్లస్ పాయింట్స్ :

చంద్రహాస్ యాక్టింగ్: ఫస్ట్ సినిమాతో పోలిస్తే మనోడు డాన్స్, ఫైట్స్ లో కొంచెం మెరుగైనట్టే ఉన్నాడు. ఈసారి యాటిట్యూడ్ కొంచెం తగ్గించి యాక్టింగ్ మీద ఫోకస్ పెట్టినట్టున్నాడు.

Advertisement

మురళీధర్ రావు: సర్పంచ్ గా ఆయన నటన ఎప్పటిలాగే పక్కాగా ఉంది.

విజువల్స్: అదిలాబాద్ అందాలు, కేరళ లొకేషన్లు కెమెరాలో కిర్రాక్ కనిపిస్తున్నాయి. పాటలు కూడా వినడానికి, చూడడానికి బాగున్నాయి

మైనస్ పాయింట్స్ :

రొటీన్ కథ: అవే కక్షలు, అదే ప్రేమ, అదే పారిపోవడం.. కొత్త సీసాలో పాత సారా పోసినట్టు ఉంది భయ్యా.

సాగదీత: కొన్ని సీన్లు ఎందుకు వస్తున్నాయో, ఎందుకు పోతున్నాయో అర్థం కాదు.

వెటకారం: కమర్షియల్ బొమ్మ అంటున్నరు కానీ, యూత్ కి కనెక్ట్ అయ్యే కిక్కు ఎక్కడో మిస్ అయ్యింది.

 

అసలు ముచ్చటకు వస్తే :

చంద్రహాస్ కి ఇది రెండో ప్రయత్నం. మనోడు స్క్రీన్ మీద కష్టపడ్డది కనిపిస్తుంది కానీ, కథలో దమ్ లేకపోతే ఆ కష్టం బూడిదలో పోసిన పన్నీరే అయితది. గ్రామీణ నేపథ్యంలో వచ్చే మామూలు కమర్షియల్ సినిమాలను ఇష్టపడే వాళ్ళకి ఇది ఒకసారి చూడొచ్చు అనిపిస్తదేమో కానీ, కొత్తదనం కోరుకునే వాళ్ళకి మాత్రం “బరాబర్ తలనొప్పి” తెప్పిస్తది.

బాటమ్ లైన్  “బరాబర్ ప్రేమిస్తా.. కానీ థియేటర్ లో భరించడమే కొంచెం కష్టం భయ్యా!”

 

Barabar Premistha Movie Rating 1.75/5

Related News

Romanchakam Review : ‘రోమాంచకం’.. నవ్వుల ప్రయాణం..

సుమంత్ ప్రభాస్ ‘రోమాంచకం’ ట్విట్టర్ రివ్యూ..

‘కికు చిరంజీవి’ మూవీ రివ్యూ.. గుండె కుడివైపు ఉంటే.. రహస్యం ఎటువైపు దారితీసింది?

టాక్సిక్’ రివ్యూ.. గీత దాటలేదు, కానీ ఓపిక మాత్రం దాటింది!”

ది రెడ్ బ్యాగ్ మూవీ రివ్యూ.. క్రైమ్ థ్రిల్లర్ మెప్పించిందా?

అమీర్ లోగ్ మూవీ రివ్యూ.. పాతబస్తీ గల్లీ స్నేహం వర్కౌట్ అయ్యిందా?

రవితేజ ‘ఇరుముడి’ రివ్యూ.. అయ్యప్పమాల కలిసొచ్చిందా?

పళ్ళ బురుసు మూవీ రివ్యూ..చిన్న బ్రష్.. పెద్ద గొడవ.. అసలు కథ ఏంటంటే?

Big Stories

Advertisement
×