E-Paper
Advertisement

బ్రిటీష్ అహంకారాన్ని మట్టి కరిపించిన అడవి బిడ్డ… ఓటీటీలోకి క్రేజీ రివేంజ్ థ్రిల్లర్

బ్రిటీష్ అహంకారాన్ని మట్టి కరిపించిన అడవి బిడ్డ… ఓటీటీలోకి క్రేజీ రివేంజ్ థ్రిల్లర్
Advertisement

Horror Thriller Movie on OTT : రీసెంట్ గా ఓటీటీలోకి ఒక రివేంజ్ హారర్ థ్రిల్లర్ అందుబాటులోకి వచ్చింది. ఇది మనసును కలచివేసే ఒక బలమైన ప్రతీకార కథ. ఒక వైపు హారర్ సినిమాగా భయపెడుతూనే, మరోవైపు చారిత్రక అంశాలను కూడా చూపిస్తుంది. 1850ల కాలంలో బ్రిటీష్ వాళ్లు స్థానిక మావోరీ ప్రజలపై చేసిన అన్యాయాలను, వాళ్ళ సంస్కృతిని ఎలా దోచుకున్నారనే కథాంశాన్ని ఈ సినిమా చూపిస్తుంది. కేవలం హారర్ ఎలిమెంట్స్ కోసమే కాకుండా, ఒక అమ్మాయి తన పూర్వీకుల కోసం చేసే పోరాటాన్ని నొక్కి చెప్పే ఒక సీరియస్ ఇంటెన్స్ సినిమా ఇది. దీని పేరు ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే..

స్టోరీలోకి వెళ్తే

‘మారమ’ (Mārama) 2025లో విడుదలైన ఒక ప్రశంసలు పొందిన రివెంజ్ హారర్ మూవీ. ఈ చిత్రానికి తారతోవా స్టాప్పార్డ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా 1 గంట 29 నిమిషాల నిడివితో ఇంగ్లీష్, మావోరీ భాషల్లో రూపొందింది. ఈ చిత్రాన్ని న్యూజిలాండ్ ఫిల్మ్ కమిషన్ చాలా ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. దర్శకుడు తారతోవా స్టాప్పార్డ్ ఈ కథను కేవలం ఒక హారర్ సినిమాగా మాత్రమే కాకుండా, బ్రిటీష్ వలసపాలనలో స్థానిక మావోరీ ప్రజలు ఎదుర్కొన్న అన్యాయాలను, వారి సంస్కృతిని ప్రపంచానికి చూపేలా తెరకెక్కించారు. 2025 టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రీమియర్ అయినప్పటి నుండి, ఈ చిత్రం విమర్శకుల నుండి మంచి ప్రశంసలు అందుకుంది. ముఖ్యంగా కథలో చూపించిన చారిత్రక అంశాలు, నటీనటుల నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఇది 2026 ఫిబ్రవరి 12,న థియేటర్లలో విడుదలైంది. మే 12 నుండి డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం ప్రైమ్ వీడియో (Prime Video), యాపిల్ టీవీ (Apple TV), గూగుల్ ప్లే (Google Play) ప్లాట్‌ఫామ్‌లలో అద్దెకు అందుబాటులో ఉంది

స్టోరీలోకి వెళ్తే

Advertisement

1859వ సంవత్సరంలో మేరీ స్టీవెన్స్ అనే ఒక మావోరీ అమ్మాయి తన కన్నవాళ్ల గురించిన నిజాలు తెలుసుకోవాలని డిసైడ్ అవుతుంది. అందుకోసం న్యూజిలాండ్ నుండి ఇంగ్లాండ్‌లోని ఒక పాత కోట లాంటి పెద్ద ఇంటికి వెళ్తుంది. అక్కడ సర్ నథానియల్ కోల్ అనే ఒక ధనవంతుడి మనవరాలికి చదువు చెప్పే టీచర్‌గా చేరుతుంది. అయితే ఆ ఇంట్లో అడుగుపెట్టగానే ఆమెకు బ్రిటీష్ వాళ్లు దోచుకొచ్చిన తమ మావోరీ జాతి పాత వస్తువులు కనిపిస్తాయి. దాంతో పాటు ఆమెకు కొన్ని వింతైన, భయంకరమైన దృశ్యాలు ఎదురవుతాయి.

ఆ భయంకరమైన దృశ్యాల ద్వారా మేరీకి ఒక నిజం తెలుస్తుంది. తన కుటుంబాన్ని, తన పూర్వీకులను దారుణంగా నాశనం చేసింది వేరెవరో కాదు, ఇప్పుడు తను ఉంటున్న ఇంటి యజమాని సర్ నథానియల్ కోలే అని ఆమెకు అర్థమవుతుంది. అంతే, అప్పటివరకు తన తల్లిదండ్రుల కోసం వెతుకుతూ వచ్చిన ఆ అమ్మాయి, తన వాళ్లను చంపిన ఆ ఇంగ్లీష్ ప్రభువుపై ఎలాగైనా సరే పగ తీర్చుకోవాలని డిసైడ్ అవుతుంది. అలా తన వారిని నాశనం చేసిన వాళ్లపై ఆమె చేసిన ఒక రక్తపాత ప్రతీకార పోరాటమే ఈ సినిమా కథ.

Advertisement

Read Also : వాంపైర్ల మధ్య సాగే ఇంటెన్స్ లవ్ స్టోరీ… ఓటీటీలో టాప్ ట్రెండింగ్ అవుతున్న నెక్స్ట్ లెవెల్ హారర్

Related News

కొండల మధ్య అనుమానాస్పద హత్యలు… సీట్ ఎడ్జ్ మిస్టరీ థ్రిల్లర్

19వ శతాబ్దపు ఘాటు ప్రేమ… దారుణమైన పగ… సస్పెన్స్ అండ్ ఎమోషన్‌తో నిండిన పీరియడ్ డ్రామా

9/11 దాడి వెనుక ఉన్న షాకింగ్ నిజాలు బయట పెట్టిన మైండ్ బ్లోయింగ్ సిరీస్

3500 కోట్ల కలెక్షన్లు సాధించిన విజువల్ వండర్… జియోహాట్‌స్టార్‌లో ల్యాండ్ అయిన బిగ్గెస్ట్ సై-ఫై విజువల్ వండర్

ప్రాణాలు దక్కాలంటే పరుగెత్తాల్సిందే… ట్విస్టులతో ఊపిరాడకుండా చేస్తున్న ఇంగ్లీష్ సైకలాజికల్ థ్రిల్లర్

అడవి నేపథ్యంలో ఊపిరి బిగబట్టించే వేట… రక్తం ఉడికించే మలయాళం సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్

ఒలింపిక్స్ వివాదం వెనుక అసలు కథ… 6.2 రేటింగ్ ఉన్న మైండ్ బెండింగ్ స్పోర్ట్స్ డాక్యుమెంటరీ

20 రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేసిన పళ్లబురుసు .. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Big Stories

Advertisement
×