Best Korean Horror Series on OTT : కొరియన్ డ్రామాలకు మనవాళ్లు పిచ్చెక్కిపోతున్నారు. లవ్ స్టోరీలే కాదు, వాళ్లు తీసే క్రైమ్, హారర్, సస్పెన్స్ థ్రిల్లర్లు చూస్తే దిమ్మతిరిగి బొమ్మ కనిపిస్తుంది. ఒంటరిగా పగలు చూసినా సరే వెన్నులో వణుకు పుట్టించే ఆరు బెస్ట్ కొరియన్ సిరీస్‌ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. గుండె ధైర్యం ఉన్నవాళ్లే వీటి జోలికి వెళ్తే మంచిది.
జీవితం మీద విరక్తి చెంది ఆత్మహత్య చేసుకున్న ఒక యువకుడికి మృత్యు దేవత స్వయంగా ఎదురైతే ఎలా ఉంటుంది? అతను చేసిన తప్పుకి శిక్షగా 12 సార్లు వేర్వేరు బాడీలలో పుట్టి, చావాల్సి వస్తుంది ఇందులో. ప్రతి చావు ఒక నరకం. ఇందులో వచ్చే ట్విస్టులు, యాక్షన్ సీన్లు మైండ్ బ్లాక్ చేస్తాయి. అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో దీనిని చూడచ్చు.
ఇది 1945 కాలం నాటి పీరియడ్ యాక్షన్ హారర్ డ్రామా. హాస్పిటల్‌లో మనుషుల మీద క్రూరమైన ప్రయోగాలు చేసి ఒక వింత జంతువును తయారు చేస్తారు. ఆ రాక్షస మృగం చేసే నరమేధం, దాని వెనుక ఉన్న సస్పెన్స్ మిమ్మల్ని సీటు అంచున కూర్చోబెడతాయి. గ్రాఫిక్స్, మేకప్ చూస్తేనే ఒంట్లో వణుకు పుడుతుంది. నెట్‌ఫ్లిక్స్ (Netflix)లో ఇది అందుబాటులో ఉంది.
ఒక పల్లెటూరి అబ్బాయి తక్కువ రేటుకు దొరికిందని ఒక హాస్టల్‌లో రూమ్ తీసుకుంటాడు. అయితే ఆ హాస్టల్‌లో ఉండేవాళ్లంతా మామూలు మనుషులు కాదు సైకో లు. వాళ్ల మధ్య ఆ కుర్రాడు ఎలా నలిగిపోయాడు, సైకోగా ఎలా మారాడు అనేది కథ. ఈ సిరీస్ చూస్తుంటే మన చుట్టూ ఉన్నవాళ్లని చూసి కూడా భయమేస్తుంది. ఇది నెట్‌ఫ్లిక్స్ (Netflix)లో అందుబాటులో ఉంది.
ఇది ప్యూర్ జాంబీ హారర్ థ్రిల్లర్. ఒక హైస్కూల్‌లో వైరస్ వల్ల స్టూడెంట్స్ అందరూ జాంబీలుగా మారిపోతారు. మిగిలిన కొద్దిమంది పిల్లలు ఆ నరకం నుండి ఎలా తప్పించుకున్నారనేది రక్తం చిందే యాక్షన్ సీన్లతో చూపించారు. ఇందులో జాంబీలు పరిగెత్తే స్పీడ్ చూస్తేనే గుండె ఆగిపోతుంది. దీనిని కూడా నెట్‌ఫ్లిక్స్ (Netflix)లో చూడచ్చు.
ఇదొక మైండ్ బెండింగ్ సైకో థ్రిల్లర్. పుట్టకముందే ఒక వ్యక్తి సైకో కిల్లర్ అవుతాడా అని కనిపెట్టే టెక్నాలజీ వస్తే ఏం జరుగుతుంది? ఊహించని మలుపులు, సీరియల్ కిలింగ్స్‌తో కథ నడుస్తుంది. క్లైమాక్స్ చూసేసరికి బుర్ర పాడైపోవడం గ్యారెంటీ. కొరియన్ థ్రిల్లర్స్‌లో ఇదొక మాస్టర్ పీస్. విక్కీ (Viki), నెట్‌ఫ్లిక్స్ (Netflix)లో ఇది అందుబాటులో ఉంది.
దెయ్యం పట్టిన ఒక అమ్మాయి, ఆ దెయ్యాన్ని చూడగలిగే ఒక ప్రొఫెసర్ కలిసి ఊరిలో జరుగుతున్న వింత చావుల వెనుక రహస్యాన్ని ఎలా కనిపెట్టారు అనేది కథ. ఇందులో గ్రాఫిక్స్ కంటే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, నటీనటుల ఎక్స్‌ప్రెషన్స్ చూస్తేనే ఒంటిమీద వెంట్రుకలు నిక్కబొడుచుకుంటాయి. దీనిని రాత్రిపూట అస్సలు చూడకండి. జియో హాట్‌స్టార్ (Jio Hotstar)లో దీనిని చూడచ్చు.
Read Also : అప్పుల ఊబి నుండి బయటపడటానికి మాజీ పోలీస్ డేంజరస్ ప్లాన్… ఓటీటీలో పర్ఫెక్ట్ మైండ్ బ్లోయింగ్ వెబ్ సిరీస్