Tirumala Srivari Darshan: తిరుమల శ్రీవారికి కోటి రూపాయల దర్శనం ఉందన్న విషయం మీకు తెలుసా..? కోటి రూపాయలతో దర్శనం చేసుకునే వారికి టీటీడీ బోర్డు కల్పించే వసతులు ఇచ్చే ప్రసాదాలు ఏంటో తెలుసా..? ఇవే కాకుండా మరిన్ని దర్శనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
కలియుగ వైకుంఠం తిరుమల. స్వామి వారి దర్శనానికి భక్తులు వేలల్లో వెళ్తుంటారు. అయితే శ్రీవారి దర్శనం చేసుకోవడానికి టీటీడీ బోర్డు వివిధ మార్గాలను అవలంభిస్తుంది. అందులో ఉచిత దర్శనం నుంచి కోటి రూపాయల దర్శనం వరకు ఉన్నాయి. కోటి రూపాయల దర్శనం అంటే ఏంటి..? ఈ దర్శనం చేసుకోవడానికి ఏం చేయాలి. ఆలయ బోర్డు ఎలాంటి దర్శనాన్ని కల్పిస్తుంది ఇదే కాకుండా మిగతా దర్శనాల గురించి తెలుసుకుందాం.
తిరుమలలో లక్ష రూపాయల నుంచి 5 లక్షల రూపాయల వరకు డొనేషన్ ఇచ్చిన వారికి ప్రతి సంవత్సరం ఒకరోజు 5 మందికి సుపథం నుంచి దర్శనం కల్పిస్తారు. 1 రోజు 100/- రూమ్ ఇస్తారు . 6 చిన్న లడ్డులు ఒక దుప్పట ఒక బ్లౌజ్ పీస్ శ్రీవారి కానుకగా ఇస్తారు.
తిరుమలలో ఐదు నుంచి 10 లక్షల రూపాయల డొనేషన్ ఇచ్చిన వారికి ప్రతి సంవత్సరం మూడు రోజులు 5 మందికి సుపథం నుంచి దర్శనం కల్పిస్తారు. 3 రోజులు 100/- రూమ్ ఇస్తారు . 10 చిన్న లడ్డులు, క మహా ప్రసాదం ఒక దుప్పట ఒక బ్లౌజ్ పీస్ కానుకగా ఇస్తారు.
తిరుమలలో 10 నుంచి 25 లక్షల రూపాయల డొనేషన్ ఇచ్చిన వారికి ప్రతి సంవత్సరం మూడు రోజులు 5 మందికి బ్రేక్ దర్శనం కల్పిస్తారు. 3 రోజులు 500/- రూమ్ ఇస్తారు . 20 చిన్న లడ్డులు మరియు 10 మహా ప్రసాదాలు ఒక దుప్పట ఒక బ్లౌజ్ పీస్, అలాగే ఒక సిల్వర్ కాయిన్ (50 గ్రాములు) కానుకగా ఇస్తారు.
తిరుమలలో 25 – 50 లక్షల రూపాయల డొనేషన్ ఇచ్చిన వారికి ప్రతి సంవత్సరం ఒక రోజు సుపథం దర్శనం మరియు మూడు రోజులు 5 మందికి బ్రేక్ దర్శనం కల్పిస్తారు. 3 రోజులు 1500/- రూమ్ ఇస్తారు . 4 పెద్ద లడ్డులు, 5 చిన్న లడ్డులు మరియు 10 మహా ప్రసాదాలు ఒక దుప్పట ఒక బ్లౌజ్ పీస్, 1 గోల్డ్ డాలర్ (5 గ్రాములు) ఒక సిల్వర్ కాయిన్ (50 గ్రాములు ) కానుగా ఇస్తారు.
తిరుమలలో 50 – 75 లక్షల రూపాయల డొనేషన్ ఇచ్చిన వారికి ప్రతి సంవత్సరం ఒక రోజు సుప్రభాత సేవ మరియు 2 రోజులు సుపథం దర్శనం మరియు మూడు రోజులు 5 మందికి బ్రేక్ దర్శనం కల్పిస్తారు. 3 రోజులు 2000/- రూమ్ ఇస్తారు . 6 పెద్ద లడ్డులు 10 చిన్న లడ్డులు మరియు 10 మహా ప్రసాదాలు ఒక దుప్పట ఒక బ్లౌజ్ పీస్ ఇస్తారు మరియు ఐదు గ్రాముల ఒక గోల్డ్ డాలర్, యాభై గ్రాముల ఒక సిల్వర్ కాయిన్ కానుకగా ఇస్తారు.
తిరుమలలో 75 లక్షల నుంచి కోటి రూపాయల డొనేషన్ ఇచ్చిన వారికి ప్రతి సంవత్సరం రెండు రోజులు సుప్రభాత సేవ మరియు 3 రోజులు సుపథం దర్శనం మరియు 3 రోజులు 5 మందికి బ్రేక్ దర్శనం కల్పిస్తారు. 3 రోజులు 2500/- రూమ్ ఇస్తారు . 8 పెద్ద లడ్డులు 15 చిన్న లడ్డులు మరియు 10 మహా ప్రసాదాలు ఒక దుప్పట ఒక బ్లౌజ్ పీస్, ఐదు గ్రాముల ఒక గోల్డ్ డాలర్, యాభై గ్రాముల ఒక సిల్వర్ కాయిన్ కానుకగా ఇస్తారు.
తిరుమలలో 1 కోటి రూపాయల పైన డొనేషన్ ఇచ్చిన వారికి ప్రతి సంవత్సరం 3 రోజులు సుప్రభాత సేవ మరియు 4 రోజులు సుపథం దర్శనం మరియు 3 రోజులు 5 మందికి బ్రేక్ దర్శనం కల్పిస్తారు. 3 రోజులు 3000/- రూమ్ ఇస్తారు . 10 పెద్ద లడ్డులు 20 చిన్న లడ్డులు మరియు 10 మహా ప్రసాదాలు ఒక దుప్పట ఒక బ్లౌజ్ పీస్, ఐదు గ్రాముల ఒక గోల్డ్ డాలర్, యాభై గ్రాముల ఒక సిల్వర్ కాయిన్ కానుకగా ఇస్తారు.
ఈ డొనేషన్లు ఇవ్వాలనుకున్న వాళ్లు టీటీడీ టోల్ ఫ్రీ నెంబర్ 155257 లేదా తిరుమల కొండ మీద ఆదిశేషు గెస్ట్ హౌస్ లోని డోనర్ సెల్ ఆఫీసులో సంప్రదించవచ్చు.