E-Paper
Advertisement

రౌడీలు, లవర్స్ మధ్య ఒక్క రాత్రిలో జరిగే గందరగోళం… కట్టిపడేస్తున్న మలయాళ కామెడీ డ్రామా

రౌడీలు, లవర్స్ మధ్య ఒక్క రాత్రిలో జరిగే గందరగోళం… కట్టిపడేస్తున్న మలయాళ కామెడీ డ్రామా
Advertisement

Romantic Comedy Thriller : ఒకే ఒక్క రాత్రిలో లైఫ్ ఊహించని మలుపు తిరిగితే ఎలా ఉంటుంది ? ఓ సాధారణ వ్యక్తి ప్రేమికుల బాధ్యతను తన భుజాలపై వేసుకోవాల్సి వస్తే ? ఈ ప్రమాదకరమైన పరిస్థితుల్లో జరిగే గందరగోళం ఎలా ఉంటుంది ? అనే అంశాలతో ఫుల్ అండ్ ఫుల్ ఎంటర్టైనింగ్ గా తెరకెక్కిన మలయాళం మూవీనే ‘భీష్మర్’. మరి ఈ మూవీని ఏ ఓటీటీలో చూడొచ్చు ? దాని వివరాలు ఏంటి ? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.

సన్ నెక్స్ట్ ఓటీటీలో అందుబాటులో

మలయాళ రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్ ‘భీష్మర్ (Bhishmar)’. రౌడీ చేజింగ్, ఎమోషనల్ లవ్ స్టోరీ, ఫ్యామిలీ డ్రామా అన్నీ కలిపి ఒకే రాత్రిలో జరిగే కథగా ఈ సినిమాను రూపొందించారు దర్శకుడు ఈస్ట్ కోస్ట్ విజయన్. ఈ మూవీ Sun NXT ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. కొన్ని ప్రాంతాల్లో Amazon Prime Video లో కూడా అందుబాటులో ఉంది. ఈ ఏడాది మార్చి 20న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం మే 22 నుంచి అధికారికంగా ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం ఈ మూవీ ఒరిజినల్ మలయాళ ఆడియోతో పాటు ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌లో 4K డాల్బీ క్వాలిటీతో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగులో అందుబాటులో లేకపోవడం నిరాశ కలిగించే విషయమే. అయితే భాష అడ్డుగోడ కాదు అనుకునే వారికి మాత్రం ఈ సినిమా ఒక మంచి వీకెండ్ ఎంటర్‌టైనర్‌ అయ్యే అవకాశం ఉంది. ఇందులో మలయాళ యంగ్ హీరోలు ధ్యాన్ శ్రీనివాసన్, విష్ణు ఉన్నికృష్ణన్ తొలిసారి కలిసి నటించడం విశేషం.

కథలోకి వెళ్తే…

Advertisement

కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను నవ్వించే ధ్యాన్ శ్రీనివాసన్ ఈ సినిమాలో మురుగన్ అనే కూరగాయల వ్యాపారిగా కనిపిస్తాడు. ఊళ్ళో అందరితో సరదాగా నవ్వుతూ మాట్లాడే అతను లోలోపల మాత్రం ఓల్డ్ లవ్ స్టోరీ కారణంగా బాధ పడుతూ ఉంటాడు. తన మాజీ ప్రేయసి గౌరి జీవితం విషాదాంతం కావడం అతన్ని కలచివేస్తుంది. అదంతా చూసి బయటకు నవ్వుతుంటాడే తప్ప, మనసులో మాత్రం బాధతో అల్లాడిపోతాడు. .

ఈ నేపథ్యంలోనే ఓరోజు రాత్రి అతని జీవితంలోకి లవ్ కపుల్ అకస్మాత్తుగా ఎంట్రీ ఇస్తారు. అరవిందన్, రసియా అనే ఆ జంట పారిపోతుంటే, ప్రమాదకరమైన రౌడీ ముఠా వాళ్ళను పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంది. దీంతో కథ ఒక్కసారిగా థ్రిల్లింగ్ మోడ్‌లోకి వెళ్ళిపోతుంది. మొదట్లో మురుగన్ దీన్ని చూసి చూడనట్టు వదిలేయాలి అనుకుంటాడు. కానీ పరిస్థితుల కారణంగా ఆ ప్రేమికులను కాపాడాల్సిన బాధ్యతను తన భుజాలపై వేసుకుంటాడు. మరి ఆ తరువాత మురుగన్ ఆ జంటను ఎలా కాపాడాడు ? అసలు ఆ జంట వెనుక పడుతున్న ఆ రౌడీ మూక ఎవరు ? మూవీ క్లైమాక్స్ ఏంటి ? అన్నది తెరపై చూసి తెలుసుకోవాల్సిందే.

Advertisement

Read Also : నడుము – మోకాళ్ళ నొప్పులు… 50 ఏళ్ల వయసులో విలన్ల గుండెల్లో వణుకు పుట్టించే ముగ్గురు మొనగాళ్ళు

Tags

Related News

వీళ్ళకు చావులేదు… తెలుగులో స్ట్రీమింగ్ అవుతున్న హై-వోల్టేజ్ ఫాంటసీ యాక్షన్ సీక్వెల్

సముద్రం ఎడారిగా మారితే ? మనిషి మాంసం కోసం అగాధపు జీవుల అరాచకం… థ్రిల్లింగ్ సర్వైవల్ అడ్వెంచర్

ZEE5లో సెప్టెంబర్ సినిమాల జాతర… మైండ్ బ్లాక్ చేసే మల్టీ-లాంగ్వేజ్ మూవీస్ సిరీస్ల లిస్ట్

1300 కోట్ల థ్రిల్లర్ తెలుగులో… కేక పుట్టిస్తున్న మైండ్ బ్లాక్ క్రైమ్ కామెడీ

2600 కోట్ల కలెక్షన్లు… 7.9 IMDb రేటింగ్… తెలుగులో అందుబాటులో ఉన్న ఆల్ టైమ్ క్లాసిక్ మిస్టరీ థ్రిల్లర్

ఈ వారం ఓటీటీలో పండగే పండగ… తెలుగులో ఏకంగా 6 సూపర్ హిట్ సినిమాలు

ఫ్రెండ్స్‌తో చూస్తే పొట్టచేక్కలవ్వాల్సిందే… పిచ్చి పిచ్చి గొడవలతో నవ్వించే కామెడీ డ్రామా

ఎఫైర్ ను అడ్డం పెట్టుకుని ఇదేం పాడుపని ? ప్రతీ నిమిషం నెయిల్ బైటింగ్ సస్పెన్స్

Big Stories

Advertisement
×