E-Paper
Advertisement

బ్రూస్ లీ కథ ఆధారంగా వచ్చిన మార్షల్ ఆర్ట్స్ సిరీస్… స్ట్రీమింగ్ ఎక్కడంటే ?

బ్రూస్ లీ కథ ఆధారంగా వచ్చిన మార్షల్ ఆర్ట్స్ సిరీస్… స్ట్రీమింగ్ ఎక్కడంటే ?
Advertisement

Action Thriller OTT : మార్షల్ అనగానే యాక్షన్ ప్రియులకు ఠక్కుమని గుర్తొచ్చేది బ్రూస్ లీ పేరే. అయితే ఆయన సినిమాలను ఇప్పటిదాకా చూసి ఎంజాయ్ చేసి ఉంటారు. కానీ ఆయన ఆలోచనలు ఎలా ఉండేవో ఎప్పుడైనా తెలుసుకోవాలి అనిపించిందా ? అలా అనిపించినా అది జరిగే పని కాదని చాలామంది అనుకుని ఉంటారు. కానీ ఓ సినిమాను చూస్తే ఆ విషయాన్ని మనం కూడా తెలుసుకోవచ్చు అన్న విషయాన్ని చాలా మందికి తెలియదు. మరి ఆ మూవీ పేరేంటి ? ఆ సినిమాకు, బ్రూస్ లీకి సంబంధం ఏంటి ? అనేది వివరంగా తెలుసుకుందాం పదండి.

రెండు ఓటీటీలలో స్ట్రీమింగ్

మార్షల్ ఆర్ట్స్ లెజెండ్ బ్రూస్ లీ రాసుకున్న అసలు ఆలోచనలు, నోట్స్ ఆధారంగా తెరకెక్కిన సిరీస్ Warrior (2019). ఇదొక పాపులర్ అమెరికన్ మార్షల్ ఆర్ట్స్ క్రైమ్ డ్రామా వెబ్ సిరీస్. 19వ శతాబ్దం చివరలో జరిగిన భయంకరమైన గ్యాంగ్ వార్స్ (Tong Wars) నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. సాన్ ఫ్రాన్సిస్కోలోని చైనాటౌన్‌లో ఆ ఫైట్స్ జరిగాయి. మొత్తం మూడు సీజన్లతో విజయవంతంగా నడిచి సూపర్ హిట్ అనిపించుకుంది ఈ సిరీస్. ప్రస్తుతం మన దగ్గర రెండు ఓటీటీలలో ఈ సిరీస్ అందుబాటులో ఉంది. Netflix, JioHotstar లలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సిరీస్ మరో స్పెషాలిటీ ఏంటంటే… బ్రూస్ లీ కుమార్తె ‘శానన్ లీ’ దీనికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌ గా వ్యవహరించడం. ఇందులో ఉండే హై-వోల్టేజ్ మార్షల్ ఆర్ట్స్ ఫైట్ సీన్లు, అద్భుతమైన స్టంట్స్, పాత కాలపు సాన్ ఫ్రాన్సిస్కో సెట్టింగ్స్ అద్భుతమైన విజువల్ ఎక్స్‌పీరియన్స్ తో ఆడియన్స్ ను అలరిస్తాయి. కాబట్టి బ్రూస్ లీ లవర్స్ డోంట్ మిస్.

కథలోకి వెళ్తే…

Advertisement

మార్షల్ ఆర్ట్స్ వీరుడు అహ్ సాహ్మ్ (ఆండ్రూ కోజి) చైనాకు చెందిన వ్యక్తి. అతను 1878లో సాన్ ఫ్రాన్సిస్కో నగరానికి వెళ్తాడు. కొన్ని సంవత్సరాల క్రితం చైనా నుండి అదృశ్యమైన తన అక్క జియావో జింగ్‌ ను వెతకడం కోసం ఇక్కడికి వస్తాడు. కానీ అమెరికా గడ్డపై అలా అడుగు పెట్టాడో లేదో ఇలా గొడవ మొదలవుతుంది. అడుగు పెట్టగానే తన వారిని రక్షించడానికి తన ఫైటింగ్ స్కిల్స్ తో కొందరు తెల్లవాళ్ళ తుక్కు రేగ్గొడతాడు. అదే సమయంలో అతని ట్యాలెంట్ ను చైనా టౌన్‌ లోని అత్యంత శక్తివంతమైన గ్యాంగ్ అధిపతి ఫాదర్ జున్ చూస్తాడు. దీంతో అతన్ని తన గ్యాంగ్‌ లో ఒక ప్రధాన హంతకుడిగా చేరమని ఆహ్వానిస్తాడు.

తన సోదరిని వెతకడానికి ఇది మంచి ఛాన్స్ అని భావించిన హీరో అహ్ సాహ్మ్ గ్యాంగ్‌ లో చేరతాడు. అక్కడికి వెళ్ళాక అతనికి పెద్ద షాక్ తగులుతుంది. మై లింగ్ అనే ఆవిడగా చెలామణి అవుతోంది తన అక్క జియావోజింగ్ అని తెలుసుకుంటాడు. అంతేనా ప్రత్యర్థి గ్యాంగ్ ‘లాంగ్ జీ’ (Long Zii) కి కాబోయే లీడర్‌ గా చైనాటౌన్‌ ను శాసిస్తోందనే నిజం బయట పడుతుంది. దీంతో హీరో తనతో ఇంటికి వచ్చేయమని అక్కను కోరతాడు. కానీ ఆమె మాత్రం అందుకు ఒప్పుకోదు.

Advertisement

Also Read : ఈత నేర్పిస్తూ అమ్మాయిని బుట్టలో వేసే కుర్రాడు… లవర్స్ చూడాల్సిన చూడచక్కని సినిమా

మరోవైపు ఈ గొడవ రెండు గ్యాంగుల మధ్య ఫైట్ మాత్రమే కాదు, చైనా నుంచి వలస వెళ్లిన కూలీలపై ఐరిష్ కార్మికులు దాడి చేయడంతో మరో టర్న్ తీసుకుంటుంది. ఈ చైనీయుల తమకు జాబ్ దొరకట్లేదు అనేది వీళ్ళ బాధ. వాళ్లకు నాయకత్వం వహించేది డీలన్ లియరీ. మరోవైపు అక్కడి రాజకీయ నాయకులు ఓట్ల కోసం స్వార్థంగా ఆలోచించి, అక్కడి చైనీయులను వెళ్లగొట్టాలని ప్లాన్ చేస్తారు. ఇంకోవైపు ఈ ఫైట్స్ ను అణచడానికి పోలీసులు ‘చైనాటౌన్ స్క్వాడ్’ను పంపుతారు. మరి చివరికి ఈ సిరీస్ లో ఎలాంటి మలుపులు చోటు చేసుకున్నాయి ? హీరో తన అక్కను తీసుకెళ్లాడా ? అన్నది చూసి తెలుసుకోవాల్సిన కథ.

Tags

Related News

వచ్చేవారం నెట్ ఫ్లిక్స్ లో 3 సినిమాలు.. ఆ 2 మస్ట్ వాచ్!

అందరూ తక్కువ అంచనా వేసే లాయర్‌… కోర్టులో ఆమె వాదనలు వింటే మైండ్‌ బ్లాక్‌… మెంటలెక్కించే లీగల్‌ డ్రామా

థెరపీ కోసం వచ్చిన పేషెంట్‌తోనే సైకాలజిస్ట్‌కి తలనొప్పులు… నవ్వించే డార్క్ కామెడీ డ్రామా

కార్గిల్‌ యుద్ధంలో పక్షవాతం… ఓటమిని ఒప్పుకోని నిజమైన యోధుడి కథ… గూస్ బంప్స్ స్టోరీ భయ్యా

మాఫియా గ్యాంగ్‌ చేతికి చిక్కిన పురాతన నిధి మ్యాప్‌… డేంజరస్ అడ్వెంచర్ లో కామెడీ కూడా

అత్తింట్లోనే దెయ్యాల వేట… ఒక్కొక్కరినీ రాక్షసులుగా మార్చే దుష్టశక్తి… తెలుగులోనూ హారర్ మూవీ

డెత్‌ లిస్ట్‌లో ఒకే కుటుంబం… ఒక్కొక్కరినీ మృత్యువు వేటాడే హారర్‌ ఫ్రాంచైజీ కొత్త అధ్యాయం స్ట్రీమింగ్

మోనాలిసా పెయింటింగ్‌ కొట్టేయడానికి మాస్టర్‌ప్లాన్‌… ఫ్యామిలీ ఫ్యామిలీకి ఇదే పనా ? క్రేజీ క్రైమ్ కామెడీ

Big Stories

Advertisement
×