E-Paper
Advertisement

Mindiyum Paranjum OTT : ఓటీటీలోకి వచ్చేస్తున్న అపర్ణ బాలమురళి మలయాళం రొమాంటిక్ మూవీ.. థియేటర్లలో విడుదలైన నెలలోపే..

Mindiyum Paranjum OTT : ఓటీటీలోకి వచ్చేస్తున్న అపర్ణ బాలమురళి మలయాళం రొమాంటిక్ మూవీ.. థియేటర్లలో విడుదలైన నెలలోపే..
Advertisement

Mindiyum Paranjum OTT : క్రిస్మస్ కానుకగా విడుదల అయిన ‘సర్వం మాయ’ ఇప్పుడు ఓటీటీలో కూడా మంచి రెస్పాన్స్ తో స్ట్రీమింగ్ అవుతోంది. నివిన్ పాలీ నటించిన ఈ హారర్ కామెడీని జియో హాట్ స్టార్ లో ప్రేక్షకులు తెగ చూస్తున్నారు. అయితే ఇప్పుడు అపర్ణ బాలమురళి ప్రధాన పాత్రలో నటించిన మరో మలయాళ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ కి సిద్దంగా ఉంది. గతేడాది క్రిస్మస్ కు రిలీజైన ఈ మూవీ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ నేపథ్యం లో వచ్చింది. థియేటర్లలో విడుదలైన సుమారు 40 రోజుల తర్వాత ఈ సినిమా ఓటీటీలో అడుగు పెట్టబోతోంది. మరి ఇది ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ కి వస్తోంది ? దీని పేరు ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే

ఎందులో స్ట్రీమింగ్ అంటే

ఉన్ని ముకుందన్, అపర్ణ బాలమురళి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా పేరు ‘మిండియుమ్ పరంజుమ్’ Mindiyum Paranjum). ఈ చిత్రం ఫిబ్రవరి 6 నుంచి Sun NXT స్ట్రీమ్ కానుంది. లూకా-ఫేమ్ అరుణ్ బోస్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. ఇందులో జూడ్ ఆంథని, మాలా పార్వతి, గీతి సంగీత, సోహన్ శీనులాల్, RJ మురుగన్, జాఫర్ ఇడుక్కి కూడా నటించారు. ఐఎండీబీలో దీనికి 8/10 రేటింగ్ ఉండటం విశేషం. ఫ్యామిలీతో కలసి ఈ వీకెండ్ ఎంచక్కా చూసేయచ్చు ఈ సినిమాని.

స్టోరీ ఏమిటంటే

Advertisement

సనల్ (ఉన్ని ముకుందన్), లీనా (అపర్ణ బాలమురళి) ఇద్దరూ భార్యాభర్తలు. సనల్ గల్ఫ్‌లో ఉద్యోగం చేస్తుంటే, లీనా కేరళలో ఉంటుంది. వీళ్లిద్దరూ దూరంగా ఉన్నా కూడా రోజూ ఫోన్ కాల్స్, వీడియో కాల్స్‌తోనే కాలం గడిపేస్తుంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే, ఇది ఒక లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌షిప్ కథ. గల్ఫ్ నుంచి సనల్ వర్షాకాలంలో తిరిగి తన ఇంటికి వచ్చే ఆ ప్రయాణంలో, వాళ్లిద్దరి మధ్య జరిగే సంభాషణలు, పాత జ్ఞాపకాలు, వాళ్ళ మధ్య ఉన్న గాఢమైన ప్రేమని చూస్తున్నంత సేపు మైమరచిపోతాం.

ఈ సినిమా అంతా ఒక వర్షం పడే రోజున జరుగుతుంది. ఒకరి కోసం ఒకరు సర్ప్రైజ్ గిఫ్ట్స్ ఇవ్వాలని ప్లాన్ చేసుకుంటారు. ఆ గిఫ్ట్స్ కొనే క్రమంలో వాళ్ళు ఏం కోల్పోయారు ? అసలు ఆ గిఫ్ట్స్ వెనుక ఉన్న ఎమోషన్ ఏంటి అనేది కథలో అసలైన ట్విస్ట్. ఇది పాత కాలపు ప్రేమను ఫీల్ అయ్యేటట్లు చేస్తుంది. ముఖ్యంగా ప్రేమికులు చూడాల్సిన సినిమా ఇది.

Advertisement

Read Also :  ముసుగు సుందరిని ప్రేమించే కోటీశ్వరుడు… ఓటీటీలో ఆకట్టుకుంటున్న సరికొత్త ప్రేమ కథ

Tags

Related News

సముద్రం అడుగున యుద్ధ నౌక శిథిలాల్లో చిక్కుకున్న ఫ్రెండ్స్‌… చుట్టూ ప్రాణాలు తీసే షార్క్స్‌! బయటపడే దారి ఉందా?

దేశాన్ని కుదిపేసే కుట్ర… సొంత టీమ్‌లోనే శత్రువు… కొరియన్ యాక్షన్ థ్రిల్లర్

కారులో కూర్చొని బ్యాంకుల్ని హ్యాక్‌ చేసే కుర్రాడు… ఒక్క పొరపాటుతో ప్రాణాల మీదకు…

చనిపోయినట్టు నటించి మార్చురీలోకి వెళ్ళే యువతి… చచ్చినా వదలకుండా దారుణం… ఓటీటీలోకి హారర్‌ థ్రిల్లర్‌

బాడీ షేమింగ్‌ చేస్తూ వేధించిన అమ్మాయిలు… వాళ్లను కిడ్నాప్‌ చేసిన వ్యక్తిని చూసి కూడా నోరు మెదపని బాధితురాలు! స్పానిష్‌ రివెంజ్‌ థ్రిల్లర్‌

గేమ్‌ ఆడితే మెదడునే కంట్రోల్‌ చేసే డేంజరస్ టెక్నాలజీ… సైకలాజికల్‌ సైఫై థ్రిల్లర్‌ ఓటీటీలోకి

మనుషుల్ని చీమల్లా మార్చే వైరస్… వణుకు పుట్టించే కొరియన్‌ జాంబీ థ్రిల్లర్‌

సింగిల్‌ లైఫ్‌ ఎంజాయ్‌ చేద్దామనుకుంటే… ప్రేమ, పెళ్లి గోలతో కొత్త చిక్కులు… ఓటీటీలోకి రొమాంటిక్‌ కామెడీ

Big Stories

Advertisement
×