E-Paper
Advertisement

Horror thriller OTT: అంతం లేని ఆత్మతో అల్లాడిపోయే అమ్మాయి… కలలో కూడా వెంటాడే హారర్ సీన్లు

Horror thriller OTT: అంతం లేని ఆత్మతో అల్లాడిపోయే అమ్మాయి… కలలో కూడా  వెంటాడే హారర్ సీన్లు
Advertisement

Horror thriller OTT : దేయ్యాల సినిమాలను చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు ఆడియన్స్. ఆత్మలు భయపెట్టే తీరు చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది కూడా. అందుకే ఈ సినిమాలను క్రేజీగా చూస్తుంటారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమాలో హారర్ కంటెంట్ బాగా పాపులర్ అయింది. వణుకు పుట్టించే సీన్లు ఉన్నాయి ఇందులో. ఈ సినిమాలో కంప్యూటర్ గ్రాఫిక్స్ కంటే ఎక్కువగా ప్రాక్టికల్ ఎఫెక్ట్స్, స్టాప్-మోషన్ యానిమేషన్‌ను వాడారు. దీనివల్ల దెయ్యం మరింత భయంకరంగా కనిపిస్తుంది.

ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్

ఈ ఆస్ట్రేలియన్ సైకలాజికల్ హారర్ సినిమా పేరు ‘ది బాబాడూక్’ (The Babadook). ఇది జెన్నిఫర్ కెంట్ దర్శకత్వం వహించిన తొలి చిత్రం. ఆమె ఈ సినిమాను 2005లో షార్ట్ ఫిల్మ్ మాన్స్టర్ ఆధారంగా రూపొందించింది. ఇందులో ఎస్సీ డేవిస్, నోహ్ వైజ్‌మన్, డేనియల్ హెన్‌షాల్, హేలీ మెక్‌ఎల్హిన్నీ, బార్బరా వెస్ట్, బెన్ విన్స్పియర్ వంటి నటులు నటించారు. ఇది 2014 జనవరి 17న సన్‌డాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రీమియర్‌గా ప్రదర్శించబడింది. 2014 మే 22న ఆస్ట్రేలియన్ సినిమాహాళ్లలో పరిమిత సంఖ్యలో విడుదలైంది. ఈ సినిమాను కేవలం $2 మిలియన్ల (సుమారు ₹16 కోట్లు) బడ్జెట్‌తో నిర్మించారు. కానీ ప్రపంచవ్యాప్తంగా $10 మిలియన్లకు పైగా వసూలు చేసింది. ఇది కమర్షియల్ గా అంతగా విజయం సాధించలేకపోయినా, అంతర్జాతీయంగా మంచి గుర్తింపును తెచ్చుకుంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

అమేలియా అనే మహిళ, తన మొగుడు యాక్సిడెంట్‌లో చనిపోయిన బాధలో ఉంటుంది. ఇక ఒంటరిగా తన కొడుకు శామ్యూల్‌ని పెంచుతుంటుంది. ఆ పిల్లాడు మహా అల్లరి, పైగా ఇంట్లో ఏదో దెయ్యం ఉందని తెగ భయపడిపోతుంటాడు. దాన్ని కొట్టడానికి తన సొంతంగా ఏవేవో గన్‌లు, ఆయుధాలు తయారు చేసుకుంటాడు కూడా. ఒక రోజు రాత్రి వాళ్లకి మిస్టర్ బాబాడూక్ అనే ఒక భయంకరమైన బొమ్మల పుస్తకం దొరుకుతుంది. అది చదివినప్పటి నుండి ఇంట్లో వింత వింత పనులు జరగడం, తలుపులు వాటంతట అవే కొట్టుకోవడం మొదలై వాళ్లకి చుక్కలు కనిపిస్తాయి.

ఆ రాక్షసుడి వల్ల అమేలియాకి మెల్లగా పిచ్చెక్కినట్టు అయిపోయి, తన కొడుకుని కూడా చంపేంత కోపం తెచ్చుకుంటుంది. కానీ అసలు విషయం ఏంటంటే.. తన భర్త చనిపోయాడన్న ఆ తీరని బాధే ఆ రాక్షసుడికి బలం అని ఆమెకి అర్థమవుతుంది. దాంతో ధైర్యం తెచ్చుకుని ఆ బాబాడూక్‌ని ఎదురించడానికి అడుగులు వేస్తుంది. చివరికి రాక్షసుడిని ఆమె ఎలా ఎదుర్కొంది ? దాని వల్ల వచ్చే ఇబ్బందులు ఏమిటి ? అనే విషయాలను, ఈ హారర్ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.

Advertisement

Read Also : జెన్నిఫర్ లోపెజ్ నటించిన మ్యూజికల్ డ్రామా ఓటీటీలోకి… ఎప్పుడు, ఎక్కడ చూడచ్చు అంటే ?

Related News

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

పిల్లల కోసం అండర్‌వరల్డ్‌ను షేక్ చేసిన తల్లి… క్షణక్షణం నెయిల్ బైటింగ్ థ్రిల్లర్

యానిమే ప్రేమికులకు పండగే పండగ… ఓటీటీలోకి అడుగు పెట్టిన భారీ మిలిటరీ సై-ఫై అడ్వెంచర్

Big Stories

Advertisement
×