E-Paper
Advertisement

iQOO 15R Discount: ఐకూ కొత్త ఫోన్‌పై రూ.4000 డిస్కౌంట్.. లాంచ్ ఆఫర్ త్వరపడండి

iQOO 15R Discount: ఐకూ కొత్త ఫోన్‌పై రూ.4000 డిస్కౌంట్.. లాంచ్ ఆఫర్ త్వరపడండి
Advertisement

iQOO 15R Discount| వివో సబ్-బ్రాండ్ ఐకూ ఇండియాలో కొత్త స్మార్ట్‌ఫోన్ iQOO 15R లాంచ్ చేసింది. ఫిబ్రవరి 24న లాంచ్ అయిన ఈ ఫోన్ మార్చి 3 నుంచి ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ చానెల్స్‌లో సేల్స్ ప్రారంభమయ్యాయి. రూ.45,000 కంటే తక్కువ ధరలో ఫ్లాగ్‌షిప్ లెవల్ పెర్ఫామెన్స్ ఇస్తోంది. కంపెనీ దీన్ని “పవర్‌ఫుల్ ఫోన్ విత్ పర్ఫెక్ట్ ఫిట్” అని ప్రమోట్ చేస్తోంది. కాంపాక్ట్ డిజైన్, బలమైన హార్డ్‌వేర్ ఈ ఫోన్ హైలైట్ ఫీచర్స్.

డిస్‌ప్లే, విజువల్ ఎక్స్‌పీరియన్స్

ఐకూ 15Rలో 6.59 ఇంచ్ 1.5K AMOLED డిస్‌ప్లే ఉంది. 144Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. స్క్రోలింగ్, గేమింగ్ సమయంలో స్మూత్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. పీక్ బ్రైట్‌నెస్ 5,000 నిట్స్ వరకు ఉంటుంది. ఎండలో కూడా స్పష్టంగా కనిపిస్తుంది. AMOLED ప్యానెల్ వైబ్రెంట్ కలర్స్, షార్ప్ కాంట్రాస్ట్ ఇస్తుంది.

పవర్‌ఫుల్ పెర్ఫామెన్స్

Advertisement

క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 చిప్‌సెట్‌తో రన్ అవుతుంది. హెవీ గేమింగ్ సులభంగా హ్యాండిల్ చేస్తుంది. మల్టీటాస్కింగ్, AI ఫీచర్లు స్మూత్‌గా రన్ అవుతాయి. 12GB వరకు LPDDR5x RAM, 512GB వరకు స్టోరేజ్ ఆప్షన్లు ఉన్నాయి. ఫాస్ట్ పెర్ఫామెన్స్, ఎక్కువ స్టోరేజ్ స్పేస్ ఇస్తుంది.

కెమెరా సెటప్

డ్యూయల్ రియర్ కెమెరా సిస్టమ్ ఉంది. ప్రైమరీ కెమెరా 50MP సోనీ LYT-700V సెన్సార్. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ చేస్తుంది. 8MP అల్ట్రా-వైడ్ కెమెరా వైడ్ యాంగిల్ ఫోటోలు తీసుకోవడానికి సహాయపడుతుంది. ఫోన్ ముందుభాగంలో 32MP కెమెరా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ స్పష్టంగా వస్తాయి.

పెద్ద 7600mAh బ్యాటరీ

Advertisement

7600mAh పెద్ద బ్యాటరీ ఉంది. హెవీ యూజర్లకు ఎక్కువ బ్యాకప్ ఇస్తుంది. 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. త్వరగా ఛార్జ్ అవుతుంది. బైపాస్ ఛార్జింగ్ ఫీచర్ గేమింగ్ సమయంలో హీటింగ్ తగ్గిస్తుంది.

సాఫ్ట్‌వేర్, డిజైన్

ఆండ్రాయిడ్ 16తో OriginOS 6 ఇంటర్‌ఫేస్ ఉంది. నాలుగు మేజర్ OS అప్‌డేట్స్, ఆరు సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్స్ ఇస్తుంది. చెకర్డ్ బ్యాక్ ప్యానెల్ డిజైన్ ప్రీమియం లుక్ ఇస్తుంది. IP68, IP69 సర్టిఫికేషన్ ఉంది. దుమ్ము, నీటి నుంచి రక్షణ లభిస్తుంది. ట్రయంఫ్ సిల్వర్, డార్క్ నైట్.. రెండు కలర్ వేరియంట్స్‌లో లభిస్తుంది.

Also Read: మీ ఫోన్‌లో ఫోటోలు సెర్చ్ చేయడం కష్టంగా ఉందా? ఇలా చేస్తే సెకన్లలో పని పూర్తి

ధర, లాంచ్ ఆఫర్లు

బేస్ 8GB + 256GB వేరియంట్ ధర రూ.44,999. 12GB ర్యామ్ + 256GB స్టోరేజ్ వేరియంట్ రూ.47,999. టాప్ 12GB ర్యామ్ + 512GB స్టోరేజ్ వేరియంట్ రూ.52,999. HDFC, యాక్సిస్ బ్యాంక్ కార్డ్‌లతో రూ.4,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ ఉంది. iQOO లేదా వివో TWS ఇయర్‌బడ్స్ రూ.1,899కి కొనవచ్చు. అమెజాన్, iQOO ఈ-స్టోర్, వివో ఎక్స్‌క్లూసివ్ స్టోర్లు, రిలయన్స్ డిజిటల్‌లో దొరుకుతుంది.

గేమింగ్ ఇష్టపడేవారు, పెర్ఫామెన్స్ ఫోకస్ చేసేవారికి ఐకూ 15R గొప్ప ఆప్షన్. ఫ్లాగ్‌షిప్ ఫీచర్లు తక్కువ ధరలో దొరుకుతున్నాయి. మొదటి సేల్ ఆఫర్‌తో మరింత ఆకర్షణీయంగా ఉంది.

Related News

అదే జరిగితే.. ఈ నగరాలన్నీ కనుమరుగు? వరద ఎన్ని ‘అంతస్తుల ఎత్తు’లో దూసుకెళ్తుందంటే?

స్టైలిష్ లుక్..అల్టిమేట్ సౌండ్,యూత్‌ను ఫిదా చేస్తున్న సౌండ్ బార్

పాకెట్ సైజ్ బడ్జెట్ పవర్ బ్యాంక్..రూ.898కే బెస్ట్ మోడల్

నీళ్లు, చెత్తను ఒకేసారి శుభ్రం చేసే..అద్భుతమైన టూల్!

రూ.10వేలకే.. శామ్‌సంగ్ వాషింగ్ మెషీన్,ఆఫర్ కొన్ని రోజులే!

రూ.5,290 ధరకే 30W బేస్ స్మార్ట్ టీవీ..ఇక ఇల్లు దద్దరిల్లిపోవాల్సిందే !

రూ.7,490 కే 7.5 కేజీల కెపాసిటీనా? ఇంతమంచి వాషింగ్ మెషీన్ అస్సలు మిస్సవ్వొద్దు

చార్జింగ్ టెన్షన్ లేదు, లుక్ అద్దిరిపోతుంది.. ఈ ట్రెండింగ్ స్మార్ట్‌వాచ్ మీకోసమే!

Big Stories

Advertisement
×