E-Paper
Advertisement

గతంలోని పాపాలు శాపాలుగా… ఆరుగురు వారసుల మరణం చుట్టూ తిరిగే మిస్టరీ థ్రిల్లర్

గతంలోని పాపాలు శాపాలుగా… ఆరుగురు వారసుల మరణం చుట్టూ తిరిగే మిస్టరీ థ్రిల్లర్
Advertisement

Horror Thriller OTT: ఓటీటీలో ఒక క్రేజీ హారర్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ హాలీవుడ్ సిరీస్ కు ఐయండిబిలో 8.0 రేటింగ్ కూడా ఉంది. కంటెంట్ కూడా అంతే రేంజ్ లో ఉంటుంది. ఈ సిరీస్‌లో ఒక ఫార్మాస్యూటికల్ కంపెనీని ఒక ఫ్యామిలీ అడ్డదారిలో చేజిక్కించుకుంటుంది. ఆ తరువాత ఆ ఫ్యామిలీ కోట్లకు పడగలెత్తి, అంతే దారుణంగా పాతాళానికి పడిపోతుంది. ఈ సిరీస్ హారర్ ఎలిమెంట్స్ తో ఒక్కో ఎపిసోడ్ ఓ రేంజ్ లో ఉంటుంది.

నెట్ ఫ్లిక్స్ (Netflix)లో స్ట్రీమింగ్ 

2023లో వచ్చిన ఈ అమెరికన్ హర్రర్ మిస్టరీ సిరీస్ పేరు ‘ది ఫాల్ ఆఫ్ ది హౌస్ ఆఫ్ అషర్’ (The Fall of the House of Usher). ఇందులో బ్రూస్ గ్రీన్వుడ్ (రోడ్రిక్ అషర్), మేరీ మెక్‌డొన్నెల్ (మెడిలిన్ అషర్) ప్రధాన పాత్రల్లో నటించారు. ‘ది హాంటింగ్ ఆఫ్ హిల్ హౌస్’, ‘మిడ్నైట్ మాస్’ వంటి సూపర్ హిట్ హర్రర్ సిరీస్‌లు తీసిన మైక్ ఫ్లానాగన్, నెట్‌ఫ్లిక్స్ కోసం చేసిన చివరి సిరీస్ ఇది. అందుకే ఆయన తన పాత సిరీస్‌లలో నటించిన దాదాపు అందరు నటీనటులను ఇందులో తీసుకున్నారు. ఈ సిరీస్‌లో మొత్తం 8 ఎపిసోడ్లు ఉన్నాయి. ప్రతి ఎపిసోడ్‌లో ఒక చావును భయంకరంగా చూపిస్తారు. ఇది నెట్ ఫ్లిక్స్ (Netflix)లో ఇంగ్లీష్‌తో పాటు హిందీలో కూడా అందుబాటులో ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

రోడ్రిక్ అషర్, అతని సోదరి మెడిలిన్ అషర్ ఒకప్పుడు పేదరికంలో ఉండేవారు. కానీ అడ్డదారులు తొక్కి ఒక భారీ ఫార్మాస్యూటికల్ కంపెనీని హస్తగతం చేసుకుంటారు. ఆ క్రమంలో వాళ్ళు ఎంతోమంది ప్రాణాలతో ఆడుకుని కోట్లు సంపాదిస్తారు. అయితే ఒకరోజు రాత్రి వెర్నా అనే ఒక వింత శక్తులు ఉన్న మహిళతో వాళ్ళు ఒక ఒప్పందం చేసుకుంటారు. తమకు తిరుగులేని సంపద, అధికారం కావాలని, అందుకు ప్రతిఫలంగా తమ వంశం అంతం కావడానికి సిద్ధమని డీల్ కుదుర్చుకుంటారు. అనుకున్నట్లు గానే వాళ్ళు శక్తివంతులు అవుతారు.

ఇక కథ నలభై ఏళ్ల తర్వాత మొదలవుతుంది. ఆ ఒప్పందం ప్రకారం అషర్ కుటుంబంపై విధి పగ తీర్చుకోవడం మొదలవుతుంది. రోడ్రిక్ అషర్‌కు ఉన్న ఆరుగురు సంతానం ఒక్కొక్కరుగా, భయంకరమైన పరిస్థితుల్లో ప్రాణాలు కోల్పోతారు. తన కళ్ల ముందే తన వారసులందరూ అంతమైపోతుంటే, రోడ్రిక్ ఏమీ చేయలేక నిస్సహాయుడిగా మిగిలిపోతాడు. చివరికి అషర్ వంశంలో ఎవరూ మిగలరు. రోడ్రిక్, మెడిలిన్ కూడా ఒకరినొకరు చంపుకునే స్థాయికి చేరుకుంటారు. వాళ్ళకు చెందిన ఆ పాత భవనం కుప్పకూలిపోవడంతో వాళ్ళ సామ్రాజ్యం, వంశం పూర్తిగా మట్టిలో కలిసిపోతాయి. తప్పుడు మార్గంలో సంపాదించిన సంపద ఏనాటికైనా సర్వనాశనానికి దారి తీస్తుందనేది ఈ కథ సారాంశం.

Advertisement

Read Also :  పిచ్చోడు అనుకున్నారు.. కానీ ప్రపంచాన్నే గెలిచాడు… క్లైమాక్స్ వరకు చూపు కూడా తిప్పలేరు

Tags

Related News

ఏం సిరీస్ రా అయ్యా… రక్తం ఏరులై పారే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్

అమాయకపు దొంగను అడ్డం పెట్టుకుని ఇవేం పాడు పనులు… ఈ తమిళ మిస్టరీ థ్రిల్లర్ క్లైమాక్స్ హైలెట్

40 ఏళ్ల వయసులో పట్టే పిచ్చి… ఫ్యామిలీ ఫ్యామిలీకి నెంబర్ల శాపం… కట్ చేస్తే గజగజా వణికిపోయే ట్విస్ట్

సైనికుడిని సొంత ప్రభుత్వమే ఉగ్రవాదిగా ముద్రవేస్తే… మెంటల్ మాస్ యాక్షన్ థ్రిల్లర్

శబరిమల కొండల్లో కొడుకు మిస్సింగ్… ఎమోషనల్ తమిళ ఫ్యామిలీ డ్రామా

పెళ్ళయిన వ్యక్తితో ప్రేమ… ఓటీటీలోకి వచ్చేసిన ట్రయాంగిల్ రొమాంటిక్ డ్రామా

కోమాలో ఉన్న భార్యను కాపాడుకోవడానికి కిరాక్ ప్లాన్, కానీ… ఒక్కసారి చూస్తే మర్చిపోలేరు భయ్యా

ఘనంగా నెక్సా ఓటీటీ అకాడమీ అవార్డ్స్ వేడుక.. సత్తా చాటిన తెలుగు కుర్రాడు!

Big Stories

Advertisement
×