E-Paper
Advertisement

Moshin Naqvi: PCBలో పెను ప్ర‌కంప‌న‌లు..రూ.167 కోట్ల స్కాంలో మొహ్సీన్ న‌ఖ్వీ..గ‌డాఫీని చెరువులా మార్చి

Moshin Naqvi: PCBలో పెను ప్ర‌కంప‌న‌లు..రూ.167 కోట్ల స్కాంలో మొహ్సీన్ న‌ఖ్వీ..గ‌డాఫీని చెరువులా మార్చి
Advertisement

Moshin Naqvi:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంటుకు పోటీగా వచ్చిన పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Pakistan Super League 2026 ) అద్భుతంగానే సాగుతోంది. ఈ టోర్నమెంటులో నిన్నటి వరకు బాల్ టాంపరింగ్ ( Ball tampering) వ్యవహారం హాట్ టాపిక్ కాగా ఇప్పుడు మరో అంశం తెరపైకి వచ్చింది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ( PCB) చైర్మన్ పదవిలో ఉన్న మొహ్సీన్ న‌ఖ్వీ ( Moshin Naqvi ) 20 మిలియన్ డాలర్ల స్కాం ( $20 Million Scam by Moshin Naqvi ) చేసినట్లు నివేదికలు చెబుతున్నాయి. అంటే దాదాపు రూ.167 కోట్లు పందికొక్కులాగా తిన్నాడని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. గడాఫీ స్టేడియం (adaafi Stadium ) వర్షం పడితే, చెరువులా మారిపోయింది. ఈ క్రమంలోనే మొహ్సీన్ న‌ఖ్వీ స్కాం బయట పెట్టి సోషల్ మీడియాలో దారుణంగా ఆడుకుంటున్నారు పాక్ క్రికెట్ ఫ్యాన్స్‌.

Also Read: PSL 2026: PSLను అత‌లాకుత‌లం చేసిన తుఫాన్‌..గాల్లో ఎగిరిప‌డ్డ గ్రౌండ్ మెన్లు

PCBలో పెను ప్ర‌కంప‌న‌లు..రూ.167 కోట్ల స్కాంలో మొహ్సీన్ న‌ఖ్వీ

Advertisement

పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో ( Pakistan Super League 2026 )  భాగంగా మంగళవారం రోజున ఇస్లామాబాద్ యునైటెడ్ vs పెషావర్ జల్మీ ( Islamabad United vs Peshawar Zalmi ) జరగాల్సి ఉంది. లాహోర్ లోని గడాఫీ స్టేడియం వేదికగా ( Gaddafi Stadium, Lahore ) ఈ మ్యాచ్ నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేశారు. ఈ క్రమంలోనే లాహోర్ లో భారీ వర్షం పడింది. దీంతో మ్యాచ్ పూర్తిగా రద్దయింది. వాస్తవంగా ఏడు గంటలకు ప్రారంభమైన వర్షం 30 నిమిషాల పాటు దంచి కొట్టింది. అయితే ఆ తర్వాత చెరువులాగా మారిపోయింది గడాఫీ స్టేడియం. సరైన డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. మూడు గంటలైనా కూడా స్టేడియాన్ని రెడీ చేయలేకపోయారు. దీంతో మ్యాచ్, టాస్ పడకుండానే పూర్తిగా రద్దు అయింది. ఈ క్రమంలోనే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ మొహ్సీన్ న‌ఖ్వీ 167 కోట్ల రూపాయలు స్కామ్ చేశాడని ఆరోపణలు వస్తున్నాయి.

మొహ్సీన్ న‌ఖ్వీ రాజీనామా చేయాల్సిందే

2025 ఛాంపియన్స్ ట్రోఫీ కోసం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తరఫున కొన్ని నిధులు విడుదలయ్యాయి. గడాఫీ స్టేడియం రిపేర్ కోసం దాదాపు 46 మిలియన్ డాలర్లు విడుదల చేశారు. అంటే దాదాపు 400 కోట్ల వరకు రిలీజ్ చేశారన్నమాట. అయితే ఇందులో నాసిరకమైన పనులు మొహ్సీన్ న‌ఖ్వీ చేయించినట్లు చెబుతున్నారు. సగం ఖర్చుపెట్టి మిగిలిన 167 కోట్లు నొక్కేసాడని మొహ్సీన్ న‌ఖ్వీపై ఆరోపణలు వస్తున్నాయి. అతడు అప్పుడు చేసిన తప్పిదం కారణంగా ఇవాళ పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో మ్యాచ్ రద్దు అయిందని అభిమానులు సీరియస్ అవుతున్నారు. వెంటనే ఈ 167 కోట్లు కక్కించాలని.. చైర్మన్ పదవికి మొహ్సీన్ న‌ఖ్వీ రాజీనామా చేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు పాకిస్థాన్ అభిమానులు. మ‌రి ఈ ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో మొహ్సీన్ న‌ఖ్వీ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

Advertisement

 

Also Read: Shahid Afridi: నాకు ఛాన్స్ ఇవ్వండి..టీమిండియాకు 100 మంది బుమ్రాల‌ను త‌యారు చేస్తా

 

 

Related News

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 ఫైన‌ల్ మ్యాచ్ టైమింగ్స్ ఇవే..ఇండియాలో లైవ్ ఎప్పుడంటే ?

రెండు మ్యాచ్ ల‌కే గాయ‌ప‌డ్డ బుమ్రాతో వ‌ర‌ల్డ్ క‌ప్ గెలుస్తారా? గ‌వాస్క‌ర్ సీరియ‌స్‌

2027 వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్..త‌న డ్రీమ్ టీమిండియాను ప్ర‌క‌టించిన ర‌విశాస్త్రి

శ్రీలంక‌లో షాహీన్ అఫ్రిదికి ఘోర అవ‌మానం…ప్రీమియ‌ర్ బౌల‌ర్ కాస్త..మీడియం అయ్యాడు

టీమిండియా చాలా వీక్ గా ఉంది..పాకిస్తాన్ మ‌హిళ‌ల చేతిలో కూడా ఓడిపోవ‌డం ఖాయం!

రోహిత్ శ‌ర్మ‌ కూడా స్లాగ‌రే..గుడ్డిగా బ్యాట్ ఊపితే, వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వ‌లేరు

గంభీర్ ను వెధ‌వ‌ను చేసేందుకు రోహిత్ శ‌ర్మ PR స్టంట్..రిటైర్మెంట్, బొక్కా లేదు

దక్షిణాఫ్రికాలో వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వాలంటే, రోహిత్ శ‌ర్మ ఉండాల్సిందే

Big Stories

Advertisement
×