E-Paper
Advertisement

డెత్‌ లిస్ట్‌లో ఒకే కుటుంబం… ఒక్కొక్కరినీ మృత్యువు వేటాడే హారర్‌ ఫ్రాంచైజీ కొత్త అధ్యాయం స్ట్రీమింగ్

డెత్‌ లిస్ట్‌లో ఒకే కుటుంబం… ఒక్కొక్కరినీ మృత్యువు వేటాడే హారర్‌ ఫ్రాంచైజీ కొత్త అధ్యాయం స్ట్రీమింగ్
Advertisement

Supernatural Horror Thriller OTT : ఒక భయంకరమైన ప్రమాదం జరగబోతోందని ముందే తెలిసి, అందులో చనిపోవాల్సిన వారిని కాపాడితే ఎంతో అదృష్టంగా భావిస్తాము. కానీ అలా ప్రాణాలు దక్కించుకున్న వారి కుటుంబాలను మరణం తరతరాల పాటు వెంటాడితే… ప్రమాదం నుంచి బయటపడటం నిజంగా అదృష్టమా, లేక మరింత భయంకరమైన పరిణామాలకు ఆరంభమా… ఇలాంటి ఆలోచనను భయానక సంఘటనలతో చూపించే హారర్‌ చిత్రం ‘ఫైనల్‌ డెస్టినేషన్‌ బ్లడ్‌లైన్స్‌’ (Final Destination Bloodlines). మరి ఈ సినిమాను తెలుగులో ఎక్కడ చూడొచ్చు ? అసలు ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది ? అనే వివరాల్లోకి వెళ్తే…

కథలోకి వెళ్తే…

1969లో ఐరిస్‌ క్యాంప్‌బెల్‌ అనే యువతికి భయంకరమైన భవిష్యత్తు ముందే తెలుస్తుంది. స్కైవ్యూ రెస్టారెంట్‌ లో జరగబోయే ఘోర ప్రమాదాన్ని ఆమె ముందుగానే గుర్తిస్తుంది. అంతేకాదు దానివల్ల ఆ ప్రమాదం నుంచి కొంత మందిని కాపాడాలనే ఉద్దేశంతో ముందే హెచ్చరిస్తుంది కూడా. ఆ హెచ్చరిక కారణంగా అక్కడ ఘోరంగా చావాల్సిన పలువురి ప్రాణాలు దక్కుతాయి. అయితే అక్కడ మరణం నుంచి తప్పించుకున్న ఆ వ్యక్తుల జీవితాలు అక్కడితో ముగిసిపోవు. చావు వెంటాడుతూనే ఉంటుంది.

Advertisement

దశాబ్దాల తర్వాత కథ షిఫ్ట్ అవుతుంది. స్టెఫానీ అనే కాలేజీ విద్యార్థినికి భయంకరమైన కలలు పదేపదే వస్తుంటాయి. ఆ కలలకు అర్థం తెలుసుకోవాలని ఆమె తన కుటుంబం దగ్గరకు తిరిగి వస్తుంది. అక్కడ తన బామ్మ ఐరిస్‌ గతంలో చూసిన భవిష్యత్తు, దాని వల్ల జరిగిన సంఘటనల గురించి తెలుసుకుంటుంది. అప్పట్లో ప్రమాదం నుంచి బయటపడిన వారి వారసులే ఇప్పుడు మృత్యువు లక్ష్యంగా మారారని ఆమెకు అర్థమవుతుంది.

ఇక్కడి నుంచి కథ మరింత భయానకంగా మారుతుంది. కుటుంబ సభ్యులు ఒక్కొక్కరుగా అనూహ్యమైన ప్రమాదాల్లో చిక్కుకుంటారు. సాధారణంగా కనిపించే వస్తువులు, చిన్న చిన్న సంఘటనలు కూడా ప్రాణాంతకంగా మారుతాయి. ప్రమాదం ఎలా జరుగుతుందో ముందే ఊహించడం కష్టమవుతుంది. స్టెఫానీ తన కుటుంబాన్ని కాపాడాలంటే గతంలో ఏం జరిగిందో పూర్తిగా తెలుసుకోవాల్సి వస్తుంది.

Advertisement

ఐరిస్‌ చూసిన భవిష్యత్తు వెనుక ఉన్న అసలు విషయం ఏమిటి ? మరణం నుంచి తప్పించుకున్న వారి వారసులనే ఎందుకు లక్ష్యంగా చేసుకుంటోంది ? ఈ ప్రమాదాల క్రమాన్ని ఆపడానికి ఏదైనా మార్గం ఉందా ? చివరికి ఆ అమ్మాయి బతికిందా లేదా ? అన్నది తెలియాలంటే సినిమాను చూడాల్సిందే. ఊహించని ప్రమాదాలు, భయంకరమైన మలుపులు, మరణాన్ని తప్పించుకునే ప్రయత్నాలతో ఈ చిత్రం అనుక్షణం ఉత్కంఠకు గురిచేస్తుంది.

Also Read : బాబోయ్… రోడ్డుపై రచ్చ ఇంత డేంజరా ? మలయాళ సైకలాజికల్ థ్రిల్లర్ స్ట్రీమింగ్ తెలుగులో

ఓటీటీలో తెలుగులో చూడొచ్చా ?

‘ఫైనల్‌ డెస్టినేషన్‌ బ్లడ్‌ లైన్స్‌’ భారతదేశంలో జియోహాట్‌స్టార్‌ (Jio Hotstar)లో స్ట్రీమింగ్‌కు అందుబాటులో ఉంది. ఆపిల్‌ టీవీ (Apple TV)లోనూ అద్దెకు దొరుకుతుంది. ఆపిల్‌ టీవీలో తెలుగు ఆడియో కూడా ఉంది. కానీ జియో హాట్‌స్టార్‌లో మాత్రం ఇంగ్షీషులోనే స్ట్రీమింగ్ అవుతోంది. కైట్లిన్‌ శాంటా జువానా (Kaitlyn Santa Juana), టియో బ్రియోన్స్‌ (Teo Briones), బ్రెక్‌ బాసింజర్‌ (Brec Bassinger), టోనీ టాడ్‌ (Tony Todd) తదితరులు ఇందులో మెయిన్ లీడ్స్ గా నటించగా, జాక్‌ లిపోవ్‌స్కీ (Zach Lipovsky), ఆడమ్‌ స్టెయిన్‌ (Adam Stein) దర్శకత్వం వహించారు. ప్రమాదాల వెనుక దాగి ఉన్న కారణాలను, ట్విస్టులను ఊహిస్తూ చూసే హారర్‌ అభిమానులకు ఇది బెస్ట్ మూవీ.

Related News

అత్తింట్లోనే దెయ్యాల వేట… ఒక్కొక్కరినీ రాక్షసులుగా మార్చే దుష్టశక్తి… తెలుగులోనూ హారర్ మూవీ

మోనాలిసా పెయింటింగ్‌ కొట్టేయడానికి మాస్టర్‌ప్లాన్‌… ఫ్యామిలీ ఫ్యామిలీకి ఇదే పనా ? క్రేజీ క్రైమ్ కామెడీ

కాలేజీ క్యాంపస్‌లో డ్రగ్స్‌ కలకలం… గ్యాంగ్‌స్టర్‌ ఎంట్రీతో అడ్డం తిరిగే కథ… క్రైమ్‌, కామెడీ కలిసిన మలయాళ మూవీ

జర్నలిస్ట్ మిస్సింగ్ తో తీవ్ర కలకలం… కట్ చేస్తే దిమ్మతిరిగే ట్విస్ట్… మలయాళ క్రైమ్ థ్రిల్లర్‌ ఓటీటీలోకి

జైలర్ 2 వచ్చేది ఆ ఓటీటీలోనే..స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!

ప్రేమిస్తే పంచాయతీ పెట్టి పరువు తీసే ఊరు… నిజ ఘటనల ఆధారంగా తెరకెక్కిన తెలుగు ప్రేమకథ… క్లైమాక్స్ చూస్తే షాక్‌ అవ్వాల్సిందే

బాబోయ్… రోడ్డుపై రచ్చ ఇంత డేంజరా ? మలయాళ సైకలాజికల్ థ్రిల్లర్ స్ట్రీమింగ్ తెలుగులో

Big Stories

Advertisement
×