E-Paper
Advertisement

14 రోజుల్లో 10 సినిమాలు – సిరీస్‌లు… జూన్ లో నెట్‌ఫ్లిక్స్‌లో మూవీస్ వెల్లువ

14 రోజుల్లో 10 సినిమాలు – సిరీస్‌లు… జూన్ లో నెట్‌ఫ్లిక్స్‌లో మూవీస్ వెల్లువ
Advertisement

Netflix Upcoming Movies : ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో రాబోతున్న కొత్త సినిమాలు, సిరీస్‌ల కోసం ఈగర్ గా ఎదురు చూస్తున్నారా ? మరికొన్ని గంటల్లో మొదలు కానున్న జూన్ నెలలో మొదటి రెండు వారాలు డబుల్ డోస్ ఎంటర్టైన్మెంట్ ఉండబోతోంది. నెట్‌ఫ్లిక్స్‌ లో అనేక సినిమాలు, సిరీస్‌లు రిలీజ్ కి సిద్ధం అవుతున్నాయి. కొరియన్ డ్రామాల అభిమానులకు కూడా నెక్స్ట్ వీక్ మంచి ట్రీట్ లా ఉండబోతోంది. రాబోయే 14 రోజులలో విడుదల కాబోతున్న సినిమాలు – సిరీస్‌లు ఏంటో ఒకసారి చూద్దాం పదండి.

హాట్ సీట్ (Hot Seat)

పాల్ డి సెయింట్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న కామెడీ రోస్ట్ షో “ది హాట్ సీట్”. ఫ్రాన్స్ 1998 – 2018 ప్రపంచ కప్ విజేతలు, ప్రముఖ హాస్యనటులు ఈ షోలో పాల్గొంటారు. నెట్‌ఫ్లిక్స్ లో ఈ షో జూన్ 3న రిలీజ్ కానుంది.

పోల్డి

Advertisement

జర్మన్ ఫుట్‌బాల్ ఆటగాడు లూకాస్ పోడోల్స్కీ లైఫ్ పై చిత్రీకరించిన డాక్యుమెంటరీ చిత్రం “పోల్డి”. ఈ సిరీస్ అతని జీవితం, కెరీర్‌పై ఆధారపడి ఉంటుంది. జూన్ 4న ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో ప్రసారం కానుంది.

నైట్ షిఫ్ట్ ఫర్ క్యూటీస్ (Night Shift for Cuties)

ఇదొక కామెడీ-డ్రామా సిరీస్. జూన్ 4న స్ట్రీమింగ్ కానుంది. తమ అభిమాన బ్యాండ్‌ ను కలవడానికి ఎంతకైనా తెగించే కె-పాప్ అభిమానుల చుట్టూ ఈ కథ సాగుతుంది.

మా బెహన్ (Maa Behan)

Advertisement

బ్లాక్ కామెడీ – క్రైమ్ థ్రిల్లర్ చిత్రం “మా బెహన్”. “తుమ్హారీ సులు” ఫేమ్ సురేష్ త్రివేణి దీనికి దర్శకత్వం వహించారు. ఇందులో మాధురీ దీక్షిత్, త్రిప్తి డిమ్రీ, ధర్నా దుర్గా, రవి కిషన్, గీతాంజలి కులకర్ణి తదితరులు నటించారు. జూన్ 4న ఈ మూవీ రిలీజ్ కానుంది.

మెక్సికో 86 ( Mexico 86)

నెట్‌ఫ్లిక్స్ సబ్స్క్రయిబర్లు అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న కామెడీ-డ్రామా “మెక్సికో 86”. 1986 ఫీఫా ప్రపంచ కప్‌ కు ఆతిథ్యం ఇవ్వడానికి ఆ దేశం చేసిన ప్రయత్నం వెనుక ఉన్న అన్ టోల్డ్ స్టోరీని ఇందులో చూడొచ్చు. ఈ చిత్రం జూన్ 5న విడుదల కానుంది.

టీచ్ యు ఎ లెసన్ (Teach You a Lesson)

వెబ్‌టూన్ ఆధారంగా నెట్‌ఫ్లిక్స్ రూపొందిస్తున్న మోస్ట్ అవైటింగ్ యాక్షన్ డ్రామా సిరీస్ ‘టీచ్ యు ఎ లెసన్’. జూన్ 5 నుండి నెట్ ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ కానుంది. డైరెక్టర్ హాంగ్ జోంగ్-చాన్ దీనికి దర్శకత్వం వహించారు.

Also Read : తోక చుక్క తెచ్చిన తంట.. ఫిజిక్స్ కాన్సెప్ట్ తో మైండ్ బెండ్ చేస్తున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్

ఆఫీస్ రొమాన్స్ (Office Romance)

అమెరికన్ రొమాంటిక్ – కామెడీ మూవీ “ఆఫీస్ రొమాన్స్”. నెట్‌ఫ్లిక్స్‌ ఫ్యాన్స్ అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాలలో ఇది కూడా ఒకటి. ఓల్ పార్కర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జూన్ 5న రిలీజ్ కానుంది. జెన్నిఫర్ లోపెజ్, బ్రెట్ గోల్డ్‌స్టీన్ ఇందులో నటించారు.

ది ఫ్యామిలీ సీజన్ 2 (The Family Season 2)

నెట్‌ఫ్లిక్స్ లో ఆడియన్స్ ఆదరాభిమానాలు అందుకున్న ఇటాలియన్ డ్రామా “మై ఫ్యామిలీ”. జూన్ 10న ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో ప్రీమియర్ కానుంది. ఫౌస్టో అనే వ్యక్తి కథ ఇది. అతని మరణం తర్వాత ఆ కుటుంబం పరిస్థితి ఏమైంది అన్నది చూడొచ్చు.

వైరల్ హిట్ (Viral Hit)

జపనీస్ సిరీస్ “వైరల్ హిట్”. కోటా షిమురా అనే ఒక నిస్సహాయ, పేద బాలుడి కథను చెబుతుంది. లైవ్-స్ట్రీమ్డ్ ఫైట్స్ చూసే ఈ అబ్బాయి తరువాత ఎలా మారాడు అన్నది స్టోరీ. జూన్ 11న ఓటీటీలో విడుదల కానుంది.

Tags

Related News

కార్గిల్‌ యుద్ధంలో పక్షవాతం… ఓటమిని ఒప్పుకోని నిజమైన యోధుడి కథ… గూస్ బంప్స్ స్టోరీ భయ్యా

మాఫియా గ్యాంగ్‌ చేతికి చిక్కిన పురాతన నిధి మ్యాప్‌… డేంజరస్ అడ్వెంచర్ లో కామెడీ కూడా

అత్తింట్లోనే దెయ్యాల వేట… ఒక్కొక్కరినీ రాక్షసులుగా మార్చే దుష్టశక్తి… తెలుగులోనూ హారర్ మూవీ

డెత్‌ లిస్ట్‌లో ఒకే కుటుంబం… ఒక్కొక్కరినీ మృత్యువు వేటాడే హారర్‌ ఫ్రాంచైజీ కొత్త అధ్యాయం స్ట్రీమింగ్

మోనాలిసా పెయింటింగ్‌ కొట్టేయడానికి మాస్టర్‌ప్లాన్‌… ఫ్యామిలీ ఫ్యామిలీకి ఇదే పనా ? క్రేజీ క్రైమ్ కామెడీ

కాలేజీ క్యాంపస్‌లో డ్రగ్స్‌ కలకలం… గ్యాంగ్‌స్టర్‌ ఎంట్రీతో అడ్డం తిరిగే కథ… క్రైమ్‌, కామెడీ కలిసిన మలయాళ మూవీ

జర్నలిస్ట్ మిస్సింగ్ తో తీవ్ర కలకలం… కట్ చేస్తే దిమ్మతిరిగే ట్విస్ట్… మలయాళ క్రైమ్ థ్రిల్లర్‌ ఓటీటీలోకి

జైలర్ 2 వచ్చేది ఆ ఓటీటీలోనే..స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!

Big Stories

Advertisement
×