E-Paper
Advertisement

Baahubali: The Epic OTT : ఓటీటీలో ‘బాహుబలి: ది ఎపిక్’ స్ట్రీమింగ్… తెలుగులో చూడాలా ? ఈ ఆప్షన్ ట్రై చేయండి

Baahubali: The Epic OTT : ఓటీటీలో ‘బాహుబలి: ది ఎపిక్’ స్ట్రీమింగ్… తెలుగులో చూడాలా ? ఈ ఆప్షన్ ట్రై చేయండి
Advertisement

Baahubali: The Epic OTT : ప్రభాస్ ఫ్యాన్స్ ‘బాహుబలి: ది ఎపిక్’ను మరోసారి థియేటర్లలో చూసి ఎంజాయ్ చేశారు. ఇక ఇప్పుడు ఓటీటీలో కూడా ఈ మూవీ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. కాబట్టి చూడని వాళ్ళు సైతం ఓసారి లుక్కేద్దాం అనుకున్నారు. కానీ షాకింగ్ గా ఈ మూవీ ఓటీటీలో హిందీ, ఇంగ్షీషు వెర్షన్ లలో మాత్రమే ఉంది. దీంతో ఈ మూవీని తెలుగులో చూద్దాం అనుకున్న ఆడియన్స్ ను నిరాశ ఎదురైంది. అయితే మేకర్స్ మూవీని తెలుగులో రిలీజ్ చేసేలోగా, ఓ ట్రిక్ తో హిందీ వెర్షన్ ను తెలుగులో చూసే ఛాన్స్ ఉంది. మీకు కూడా ఆ ట్రిక్ ఏంటో తెలుసుకోవాలని ఉందా ? అయితే ఈ ఆర్టికల్ మీ కోసమే.

‘బాహుబలి: ది ఎపిక్’ తెలుగులో

ఎస్.ఎస్. రాజమౌళి డైరెక్ట్ చేసిన ఎపిక్ హిస్టారికల్ ఫిక్షన్ మూవీ ‘బాహుబలి: ది ఎపిక్’. ప్రభాస్, రానా దగ్గుబాటి, అనుష్కా షెట్టి, తమన్నా భాటియా లాంటి స్టార్స్ నటించారు. ఈ సినిమా తెలుగు సినిమా ఇండస్ట్రీ ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా మారుమ్రోగేలా చేసింది. ముందు రెండు భాగాలుగా తెరకెక్కిన ఈ సినిమాను రీసెంట్ గా జక్కన్న ‘బాహుబలి: ది ఎపిక్’ పేరుతో ఒకే మూవీగా రిలీజ్ చేశారు. ఈ ఎడిటెడ్ వెర్షన్ లో ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. కానీ హిందీ ఆడియోలో మాత్రమే అందుబాటులో ఉంది. తెలుగు ఆడియో కోసం వెతుకుతున్నవాళ్ల కోసమె ఈ ట్రిక్. Cinedubs అనే యాప్ ద్వారా మూవీని అఫిషియల్ గా తెలుగులో చూడవచ్చు.

Advertisement

Read Also :  ఒక్కరాత్రిలో 5 మంది హత్య… మర్డర్స్ తో పోలీస్ కే కనెక్షన్… మైండ్ బెండయ్యే ట్విస్టులున్న క్రైమ్ థ్రిల్లర్

ఇదే ప్రాసెస్

ఈ యాప్ ఇష్టమైన భాషలో సినిమాలను చూడటానికి సాయపడుతుంది. మూవీ మేకర్స్ అఫీషియల్‌గా ఆడియో ట్రాక్‌లు రిలీజ్ చేస్తే, మీరు ఆ ఆడియోను డౌన్‌లోడ్ చేసి, సినిమా ప్లే అవుతున్నప్పుడు సింక్ చేసుకోవచ్చు. ఉదాహరణకు, థియేటర్స్‌లో హిందీలో ప్లే అవుతున్న సినిమాకు తెలుగు ఆడియో అందుబాటులో ఉంటే, హెడ్‌ఫోన్స్ పెట్టుకుని సింక్ చేసుకుని ఎంజాయ్ చేయొచ్చు. ‘బాహుబలి: ది ఎపిక్’ నెట్‌ఫ్లిక్స్‌లో హిందీ వెర్షన్ మాత్రమే ఉంది. కానీ సినీ డబ్స్ యాప్‌లో తెలుగు ఆడియో ఫైల్ అందుబాటులో ఉంది. మేకర్స్ అఫీషియల్‌గా రిలీజ్ చేశారు కాబట్టి దీన్ని లీగల్‌గా యూజ్ చేయొచ్చు.

Advertisement

నెట్ ఫ్లిక్స్ యాప్ ఓపెన్ చేసి బాహుబలి: ది ఎపిక్ ప్లే చేయండి. ఫోన్‌లో యాప్ డౌన్‌లోడ్ చేసుకుని ఓపెన్ చేయండి. ‘బాహుబలి’ తెలుగు ఆడియో ట్రాక్ సెర్చ్ చేసి డౌన్‌లోడ్ చేయండి. సినిమా ప్లే అవుతున్నప్పుడు యాప్ లో ఆడియో ప్లే చేసి సింక్ చేసుకోండి. కాకపోతే కాస్త ఖర్చు అవుతుంది చూసుకోండి. నెట్‌ఫ్లిక్స్ మూవీ తెలుగు వెర్షన్ ను అఫీషియల్‌గా యాడ్ చేసేదాకా వెయిట్ చేయలేం అనుకుంటే ఈ ట్రిక్ ను ట్రై చేయండి లేదా ఎదురు చూడండి.

Tags

Related News

మనుషుల్ని చీమల్లా మార్చే వైరస్… వణుకు పుట్టించే కొరియన్‌ జాంబీ థ్రిల్లర్‌

సింగిల్‌ లైఫ్‌ ఎంజాయ్‌ చేద్దామనుకుంటే… ప్రేమ, పెళ్లి గోలతో కొత్త చిక్కులు… ఓటీటీలోకి రొమాంటిక్‌ కామెడీ

సామాన్యులపై జరిగే దోపిడీని కళ్లకు కట్టిన క్రైమ్‌ థ్రిల్లర్‌… పోలీస్ వ్యవస్థ బాగోతం బట్టబయలు

న్యాయంపై నమ్మకం పోయిన లాయర్‌… ఓ అనుమానాస్పద మరణంతో మారిన కథ… క్రైమ్‌ థ్రిల్లర్‌ స్ట్రీమింగ్

చిన్న వయసులోనే పెద్ద టార్గెట్‌… హాకీ కోసం ఇంత కష్టమా భయ్యా… ఓటీటీలోకి ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్‌ డాక్యుమెంటరీ

చిన్న స్థాయి నుంచి మ్యూజిక్‌ సెన్సేషన్‌గా… కోట్లాది హృదయాలను గెలిచిన సింగర్ స్టోరీ

జైలు నుంచి వచ్చి మాఫియా సామ్రాజ్యాన్ని నిర్మించే డాన్‌… నాలుగో సీజన్‌ రచ్చ రచ్చ

కొత్త ఇంట్లో అడుగుపెట్టిన ఫ్యామిలీ… గోడల వెనుక దాగిన భయంకరమైన రహస్యం… వెన్నులో వణుకు పుట్టించే హారర్‌ థ్రిల్లర్‌

Big Stories

Advertisement
×