E-Paper
Advertisement

బ్రేకప్ తో హ్యాకర్ అయ్యే దేవదాసు… మెంటలెక్కించే మలయాళం మూవీ

బ్రేకప్ తో హ్యాకర్ అయ్యే దేవదాసు… మెంటలెక్కించే మలయాళం మూవీ
Advertisement

Cyber Thriller OTT : సైబర్ క్రైమ్ థ్రిల్లర్స్ సీను సీనుకో ట్విస్ట్ తో అదిరిపోతుంటాయి. ఊహించని మలుపులతో ఆసక్తికరంగా సాగుతుంటాయి. ఇక క్లైమాక్స్ లో కథ కేక పెట్టిస్తుంది. ఇలాంటి ఓ అద్భుతమైన సినిమానే ఈరోజు మన మూవీ సజెషన్. మరి ఆ మూవీ స్టోరీ ఏంటి ? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోంది ? అన్నది తెలుసుకుందాం.

రెండు ఓటీటీలలో స్ట్రీమింగ్

ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న మూవీ పేరు I Am Kathalan. 2024లో విడుదలైంది ఈ మూవీ. ‘ప్రేమలు’ ఫేమ్ దర్శకుడు గిరీష్ ఎ.డి,.యాక్టర్ నస్లెన్ కె. గఫూర్ కాంబినేషన్‌ లో వచ్చిన ఈ మూవీ మలయాళ సైబర్ టెక్నో-థ్రిల్లర్ డ్రామా. సాధారణ యువకుడు లవ్ ఫెయిల్యూర్ కావడంతో పూర్తిగా మారిపోతారు. అవమానం కారణంగా అతను డిజిటల్ ప్రపంచాన్ని ఆయుధంగా మార్చుకుని ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడనేది ఈ సినిమా ప్రధాన కథాంశం. చాలా పకడ్బందీగా తన ట్రాక్స్ మొత్తాన్ని తుడిచేసి క్లూస్ లేకుండా ఎస్కేప్ అవుతుంటాడు. పోలీసులకు మాత్రం దొరకడు. ఈ చిత్రం ప్రస్తుతం Amazon Prime Videoతో పాటు ManoramaMAX ఓటీటీలో కూడా స్ట్రీమింగ్ అవుతోంది.

కథలోకి వెళ్తే…

Advertisement

ఈ సినిమాలో మన హీరో విష్ణు (నస్లెన్). బ్యాక్‌లాగ్స్ ఉండడమే కాదు సరైన ఉద్యోగం లేక ఇబ్బంది పడే సాధారణ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అతను. తన క్లాస్‌మేట్ శిల్ప (అనిష్మా అనిల్ కుమార్)ను లవ్ చేస్తాడు. అయితే విష్ణు కెరీర్ లో సెటిల్ అవ్వలేదని, ఫినాన్షియల్ గా ఇంకా సెటిల్ అవ్వలేదనే కారణంతో శిల్ప అతనికి బాయ్ ఫ్రెండ్ చెబుతుంది. ఓరోజు శిల్ప తండ్రి, రాయల్ పెరియడన్ చిట్-ఫండ్ కంపెనీ అధినేత అయిన చాకో (దిలీష్ పోతన్). కలవడానికి వెళ్ళినప్పుడు విష్ణుని చాకో తీవ్రంగా అవమానిస్తాడు.

Also Read : రిలీజ్ అయిన ఒక్కరోజులోనే ఓటీటీ నుంచి అవుట్… పట్టపగలే చూసినా ప్యాంటు తడవాల్సిందే

Advertisement

ఆ అవమానాన్ని విష్ణు భరించలేకపోతాడు. కోడింగ్‌ లో తనకున్న నైపుణ్యాలను ఉపయోగించి చాకోపై ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకుంటాడు. తమిళంలో ప్రేమికుడు అనే అర్థం వచ్చేలా ‘కథలన్’ (Kathalan) అనే మారుపేరును వాడుకుంటాడు. అదే పేరుతో చాకో ఫైనాన్స్ కంపెనీ సర్వర్లను వరుసగా హ్యాక్ చేయడం స్టార్ట్ చేస్తాడు. విష్ణు సైబర్ దాడుల వల్ల ఆ సంస్థకు భారీగా ఆర్థిక నష్టాలు రావడంతో పాటు వాళ్ళ కస్టమర్ల డేటా గోప్యత డేంజర్ జోన్ లో ఉంటుంది. దీంతో ఆ మాస్క్‌డ్ హ్యాకర్‌ ను పట్టుకోవడానికి చాకో ప్లాన్ చేస్తాడు. సిమి (లిజోమోల్ జోస్) అనే ఒక టాలెంటెడ్ ఎథికల్ హ్యాకింగ్ ఎక్స్‌పర్ట్‌ను రంగంలోకి దించుతారు. ఇక్కడి నుంచే కథ ఊహించని మలుపు తిరుగుతుంది. మరి హీరోని మాజీ ప్రేయసి తండ్రి పట్టుకున్నాడా ? చివరికి ఏమైంది ? అన్నది స్టోరీ.

Related News

కార్గిల్‌ యుద్ధంలో పక్షవాతం… ఓటమిని ఒప్పుకోని నిజమైన యోధుడి కథ… గూస్ బంప్స్ స్టోరీ భయ్యా

మాఫియా గ్యాంగ్‌ చేతికి చిక్కిన పురాతన నిధి మ్యాప్‌… డేంజరస్ అడ్వెంచర్ లో కామెడీ కూడా

అత్తింట్లోనే దెయ్యాల వేట… ఒక్కొక్కరినీ రాక్షసులుగా మార్చే దుష్టశక్తి… తెలుగులోనూ హారర్ మూవీ

డెత్‌ లిస్ట్‌లో ఒకే కుటుంబం… ఒక్కొక్కరినీ మృత్యువు వేటాడే హారర్‌ ఫ్రాంచైజీ కొత్త అధ్యాయం స్ట్రీమింగ్

మోనాలిసా పెయింటింగ్‌ కొట్టేయడానికి మాస్టర్‌ప్లాన్‌… ఫ్యామిలీ ఫ్యామిలీకి ఇదే పనా ? క్రేజీ క్రైమ్ కామెడీ

కాలేజీ క్యాంపస్‌లో డ్రగ్స్‌ కలకలం… గ్యాంగ్‌స్టర్‌ ఎంట్రీతో అడ్డం తిరిగే కథ… క్రైమ్‌, కామెడీ కలిసిన మలయాళ మూవీ

జర్నలిస్ట్ మిస్సింగ్ తో తీవ్ర కలకలం… కట్ చేస్తే దిమ్మతిరిగే ట్విస్ట్… మలయాళ క్రైమ్ థ్రిల్లర్‌ ఓటీటీలోకి

జైలర్ 2 వచ్చేది ఆ ఓటీటీలోనే..స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!

Big Stories

Advertisement
×