E-Paper
Advertisement

OTT Movie : ఒక్క నైట్ లో వణుకు పుట్టించే సీన్లు… 10 మందికి అదే గతి… మెంటలెక్కించే క్లైమాక్స్ ట్విస్ట్

OTT Movie : ఒక్క నైట్ లో వణుకు పుట్టించే సీన్లు… 10 మందికి అదే గతి… మెంటలెక్కించే క్లైమాక్స్ ట్విస్ట్
Advertisement

OTT Movie : ప్రేక్షకులను చివరి వరకు ఊహించని మలుపులతో ఉత్కంఠభరితంగా ఓ సినిమా కూర్చో బెడుతోంది. ఈ అమెరికన్ సైకలాజికల్ థ్రిల్లర్ చివరి వరకు ఆడియన్స్ ని కన్ఫ్యూజ్ చేస్తూ బుర్రను హీటెక్కిస్తుంది. భారీ వర్షంతో ట్రాప్ అయిన 10 మంది స్ట్రేంజర్స్‌ను, ఒక్కొక్కరుగా మర్డర్ చేసే సీరియల్ కిల్లర్ మిస్టరీని ట్విస్ట్ ఫుల్ స్టోరీతో ఈ సినిమా చూపిస్తుంది. క్లైమాక్స్ మాత్రం మరో లెవెల్ లో ఉంటుంది. డిఫరెంట్ స్టోరీ కోసం ఆకలిగా ఉన్న వాళ్ళు, ఈ సినిమాను మిస్ కాకుండా చూడండి. దీని పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.

మూడు ఓటీటీలలో స్ట్రీమింగ్

‘ఐడెంటిటీ’ (Identity) 2003లో విడుదలైన అమెరికన్ సైకలాజికల్ థ్రిల్లర్ చిత్రం. జేమ్స్ మాంగోల్డ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జాన్ క్యూసాక్, రే లియోట్టా, అమండా పీట్, ఆల్ఫ్రెడ్ మోలినా లీడ్ రోల్స్ లో నటించారు. ఇది 2003 ఏప్రిల్ 25న థియేటర్లలో రిలీజ్ అయింది. ప్రస్తుతం  అమెజాన్ ప్రైమ్ వీడియో, హాట్‌స్టార్‌లలో అందుబాటులో ఉంది. ఐ యండిబిలో 7.3/10 రేటింగ్ ని పొందింది.

స్టోరీలోకి వెళ్తే

Advertisement

ఈ సినిమా రెండు కథాంశాలతో మొదలవుతుంది. మొదటి కథలో ఎడారిలోని ఒక మారుమూల ప్రాంతంలో కుండపోత వర్షం కారణంగా పది మంది అపరిచితులు చిక్కుకుపోతారు. వీళ్ళంతా అక్కడ ఉండే ఒక హోటల్ లో ఉండిపోతారు. వీరిలో ఒక డ్రైవర్, ఒక వేశ్య, ఒక టీవీ నటి, ఒక పోలీస్ అధికారి, అతని ఖైదీ, ఒక కుటుంబం (తల్లి, తండ్రి, కొడుకు) ఉంటారు. అక్కడ రోడ్లు మూసుకుపోవడం, కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతినడంతో వారు బయటి ప్రపంచానికి దూరంగా ఉండిపోవాల్సి వస్తుంది. అయితే త్వరలోనే వారిలో ఒకరి తర్వాత ఒకరు హత్యకు గురవుతారు. ప్రతి మృతదేహం వద్ద హోటల్ గది తాళం చెవులు (గది నంబర్లు 10 నుండి 1 వరకు) లభిస్తాయి. దీంతో మిగిలిన వాళ్ళు ఒకరినొకరు అనుమానించుకుంటూ భయపడుతుంటారు.

రెండో కథలో మాల్కం అనే ఒక సీరియల్ కిల్లర్ తన నేరాలకు గాను ఉరిశిక్షను ఎదుర్కొంటూ ఉంటాడు. అతని మానసిక డాక్టర్ మాల్కంకు “డిస్సోసియేటివ్ ఐడెంటిటీ డిజార్డర్” ఉందని, అందువల్ల అతనికి శిక్ష పడకూడదని న్యాయమూర్తిని ఒప్పించే ప్రయత్నం చేస్తుంటాడు. ఇక సినిమా చివరిలో ఒక భారీ ట్విస్ట్ ఉంటుంది. హోటల్ జరిగే సంఘటనలు అన్నీ నిజం కాదు. అవి వాస్తవానికి మాల్కం మనస్సులో జరుగుతున్న డ్రామాలు. ఆ హోటల్ లోని పది మంది వ్యక్తులు మాల్కం వివిధ వ్యక్తిత్వాలను చూపిస్తుంది.

Advertisement

Read Also : తల్లికొడుకులపై పగ తీర్చుకునే దుప్పి… జంతువులకు కూడా ఎమోషన్స్ ఉంటాయి మావా

మాల్కం మనస్సులో ఉన్న హింసాత్మక వ్యక్తిత్వాన్ని నిర్మూలించడానికి డాక్టర్ మాలిక్ చేసిన చికిత్సలో భాగంగా ఈ హత్యలు జరుగుతుంటాయి. చివరి క్షణంలో మరొక షాకింగ్ ట్విస్ట్ ఉంటుంది. దీంతో ఆడియన్స్ కి మైండ్ మరింత బ్లాక్ అవుతుంది. ఆ ట్విస్ట్ ఏమిటి ? మాల్కంకి శిక్ష పడుతుందా ? ఈ కథ ఎలాంటి ముగింపు ఇస్తుంది ? అనే ప్రశ్నలకు సమాధానాలను, ఈ అమెరికన్ సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.

 

Related News

కుటుంబం, ప్రేమ మధ్య నలిగిపోయే క్లాసికల్ మ్యూజిషియన్ కథ… కన్నీళ్లు పెట్టించే ఎమోషనల్ జర్నీ

హైదరాబాద్ కుర్రాడికి కొరియన్ దెయ్యంతో లవ్… కితకితలు పెట్టే ఇండో-కొరియన్ థ్రిల్లర్

సోమరిపోతులే ఓటీటీలో సినిమాలు చూస్తారా? శివాజీ షాకింగ్ కామెంట్స్!

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. ఏకంగా 14 స్ట్రీమింగ్…!

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

Big Stories

Advertisement
×