E-Paper
Advertisement

OTT Movie : భర్త ఉండగానే మరొకరితో… దిమ్మతిరిగే ట్విస్టులున్న లవ్ స్టోరీ

OTT Movie : భర్త ఉండగానే మరొకరితో… దిమ్మతిరిగే ట్విస్టులున్న లవ్ స్టోరీ
Advertisement

OTT Movie : ప్రస్తుత తరం యూత్ ప్రేమ పెళ్లిళ్లకు ఎంతగా అట్రాక్ట్ అవుతున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కొంతమంది జీవితం మీద మంచి అవగాహనతో ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకున్నప్పటికీ లైఫ్ సాఫీగానే సాగిపోతుంది. కానీ మరికొంత మంది ఎంత మెచ్యూర్ గా బిహేవ్ చేసినా ప్రేమ పెళ్లి విడాకులకు దారి తీస్తోంది. ఇదంతా ఒక ఎత్తైతే నిబ్బా నిబ్బీల లవ్ స్టోరీలు మరో ఎత్తు. ఎలాంటి ఆలోచన లేకుండా పెళ్లి చేసుకుని, ఆ తరువాత వచ్చే సమస్యలతో జీవితాన్ని నరకం చేసుకుంటారు. అలాంటి వారికోసమే ఈ షార్ట్ ఫిల్మ్. పైగా ఈ మూవీ తెలుగులోనే స్ట్రీమింగ్ అవుతోంది. ఇంతకీ ఈ షార్ట్ ఫిల్మ్ ఏ ఓటీటీలో ఉంది? స్టోరీ ఏంటి? అనే వివరాలపై ఓ లుక్కేద్దాం పదండి.

కథలోకి వెళ్తే…

Advertisement

ఇందులో హీరో, హీరోయిన్ ఇద్దరూ ప్రేమ పెళ్లి చేసుకుంటారు. తీరా పెళ్లి చేసుకున్నాక ఇద్దరి మధ్య గొడవలు, అసంతృప్తి చెలరేగుతాయి. ముఖ్యంగా అతను సంపాదించే డబ్బు దేనికీ సరిపోకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతాయి. ఈ క్రమంలోనే హీరోయిన్ ఏకంగా మరొకడితో ఉంటుంది. అతనికి బాగా డబ్బు ఉండటంతో భర్తను తేలిగ్గా తీసుకుంటుంది. భర్తకు తెలియకుండా ఇలాంటి పాడు పని చేస్తుంది ఆ అమ్మాయి. ఓ వైపు ఇలాంటి పని చేస్తూనే, మరొవైపు భర్తతో తరచుగా గొడవ పడుతుంది. తన ఫ్రెండ్స్ అంతా ఫారిన్ కు వెళ్తున్నారని, తాను మాత్రం ఇక్కడే ఉండాల్సి వచ్చిందని చెప్పి దెప్పి పొడుస్తుంది. డబ్బులు సంపాదించమని ఫోర్స్ చేస్తుంది. భర్త మాత్రం తనకు చేతనైనంత సంపాదిస్తాడు. కాని ఆమెకున్న పెద్ద పెద్ద కోరికల్ని తీర్చలేకపోతాడు. మరి చివరికి భర్తకు భార్యకు సంబంధించిన సీక్రెట్ తెలిసిందా ? ఇద్దరి మధ్య సమస్యలు తగ్గే దారి కనిపెట్టారా? లేదంటే విడిపోయారా? చివరికి ఏం జరిగింది? అన్నది స్టోరీ.

ఏ ఓటీటీలో ఉందంటే?

Advertisement

ఈ సినిమాను ఫ్రీగానే చూడవచ్చు. ఎందుకంటే ఇదొక షార్ట్ ఫిల్మ్, యూట్యూబ్ (Youtube) లో అందుబాటులో ఉంది. ఈ షార్ట్ ఫిల్మ్ పేరు ‘ఇంపర్ఫెక్ట్ 2’ (Imperfect 2). అయితే ఈ టైటిల్ తో సాధారణంగా వెతికితే ఇది దొరకకపోవచ్చు. కానీ ఇంపర్ఫెక్ట్ చిత్రలోకం ఒరిజినల్ షార్ట్ ఫిల్మ్ అని టైపు చేస్తే దొరుకుతుంది. ప్రేమలో ఉన్నవాళ్ళు మిస్ అవ్వకుండా చూడాల్సిన షార్ట్ ఫిల్మ్ ఇది. సెటిల్ కాకుండా పెళ్లి చేసుకుంటే లైఫ్ ఎంత దారుణంగా ఉంటుందో చూపించి, కళ్ళు తెరిపిస్తుంది. ఇటువంటి సినిమాలు అప్పుడప్పుడూ వస్తుంటాయి. వీటిని చూస్తే రియల్ లైఫ్ లో కళ్ళముందు జరిగే కొన్ని సన్నివేశాలు గుర్తుకు వస్తుంటాయి.

Read Also : ఈ అమ్మాయి అరాచకం చూడడానికి రెండు కళ్ళూ చాలవు… గూస్ బంప్స్ తెప్పించే సైకలాజికల్ హర్రర్ థ్రిల్లర్

Related News

Weekend OTT Releases : ఈ వీకెండ్ ఓటీటీ వినోదం.. డోంట్ మిస్ ఇట్..

3024 కోట్లు కొల్లగొట్టిన హర్రర్ థ్రిల్లర్… ఓటీటీలోకి తెలుగులో వచ్చేసిన వణికించే వైరల్ హిట్

అండర్‌వరల్డ్‌ని షేక్ చేసిన గ్యాంగ్‌స్టర్ కథ… సీట్-ఎడ్జ్‌లో కూర్చోబెట్టే కన్నడ యాక్షన్ ధమాకా

26 మంది పిల్లలు మిస్సింగ్… ఓటీటీని షేక్ చేస్తున్న మలయాళం మిస్టరీ థ్రిల్లర్

మనుషుల నిజస్వరూపాలను కళ్లకు కట్టే కథ… హృదయాలను తాకే డాక్యుమెంటరీ స్టైల్ ఎమోషనల్ ఫిల్మ్

క్షణం కూడా కన్ను మూయనివ్వని ఫైట్లు… ఓటీటీలో సందడి చేస్తున్న ఇంటెన్స్ యాక్షన్ డ్రామా

అడవిలో చిక్కుకున్న పైలట్ సాహసం… నవ్వులతో పాటు మైండ్ బ్లోయింగ్ యాక్షన్ ట్రీట్

వీరభద్రుని రహస్యం’ క్లైమాక్స్ ప్రశ్నలకు సమాధానం… ఒళ్ళు గగుర్పొడిచే మలుపులతో వస్తున్న మైండ్ బెండింగ్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×