Road Accident: తూర్పుగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రంగంపేట మండలం వడిసలేరు వద్ద ట్యాంకర్, కారు ఢీ కొనడంతో ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. గమనించిన స్థానికులు వెంటనే క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితులు కాకినాడలో ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు. ప్రమాదం ఎలా జరిగిందని.. ఆరాతీస్తున్నారు. ఘోర రోడ్డు ప్రమాదం గురించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ALSO READ: BREAKING NEWS : ఇంట్లోకి దూసుకెళ్లిన కారు.. ఇద్దరు మృతి..