PBKS vs RCB final : ప్రస్తుతం ఐపీఎల్ 2025 సీజన్ ముగింపు దశకు చేరుకున్న విషయం తెలిసిందే. జూన్ 03న అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగే ఫైనల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ పంజాబ్ కింగ్స్ తలపడనున్నాయి. అయితే ఈ రెండు జట్లు ఇప్పటి వరకు ఒక్క టైటిల్ కూడా గెలవలేదు. ఇక ఈ సారి కొత్త ఛాంపియన్స్ ను చూడబోతున్నామని స్పష్టంగా అర్థమవుతోంది. ఇదిలా ఉంటే.. ఆదివారం రాత్రి అహ్మదాబాద్ వేదిక గా ముంబై ఇండియన్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య క్వాలిఫయర్ 2 మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. వాస్తవానికి వర్షం కారణంగా రెండు గంటల పాటు ఆలస్యంగా ప్రారంభమైంది. ఈ మ్యాచ్ లో తొలుత ముంబై బ్యాటింగ్ చేసింది. 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది.
Also Read : PBKS vs RCB final : ఫైనల్ మ్యాచ్‌లో వర్షం పడితే ఎలా… విజేత ఎవరు… అసలు రిజర్వ్ డే ఉంటుందా?
లక్ష్య ఛేదనలో పంజాబ్ కింగ్స్ జట్టు అదరగొట్టింది. మరో ఓవర్ మిగిలి ఉండగానే 5 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. దీంతో ముంబై ఇంటి ముఖం పట్టింది. శ్రేయాస్ అయ్యర్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడని.. తమ బౌలర్లు అనుకున్న మేరకు రాణించలేకపోయారని.. ముంబై ఇండియన్స్ ఆటగాళ్లు పేర్కొన్నారు. మరోవైపు శ్రేయాస్ అయ్యర్ వర్సెస్ బుమ్రా మధ్య 10 సంవత్సరాల ఛాలెంజ్. బుమ్రా యార్కర్లకి శ్రేయస్ అయ్యర్ అదిరిపోయే ఆన్సర్ చెప్పాడు. నిన్న జరిగిన మ్యాచ్ లో అయ్యర్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తో కలిసి ప్రీతి జింతా మైదానంలో సంబురాలు జరుపుకుంటున్నారు. ప్రీతి జింటా తొలుత పంజాబ్ కింగ్స్ మద్దతు దారులతో కలిసి హర్షద్వానాలు చేశారు. ఆ తరువాత ఆమె మైదానంలోకి వచ్చి పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, కోచ్ రికీ పాంటింగ్ ను హగ్ చేసుకున్నారు. నేహాల్ వధేరా ను కూడా ఆమె అభినందించారు. కీలకమైన మ్యాచ్ లో శ్రేయస్ అయ్యర్ మ్యాచ్ విన్నింగ్ ఆడాడు. 41 బంతుల్లో 87 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు.
మరోవైపు నేహాల్ వధేరా 29 బంతుల్లో 48 పరుగులు చేశాడు. 2023 సీజన్ ఫైనల్ కి అహ్మదాబాద్ ఆతిథ్యమిచ్చింది. అప్పుడు గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు ఫైనల్స్ ఆడాయి. ఈ మ్యాచ్ కి వరణుడు తీవ్ర ఆటంకం కలిగించాడు. షెడ్యూల్ ప్రకారమే మే 28న మ్యాచ్ జరగాల్సింది. కానీ భారీ వర్షం కురవడంతో ఒక్క బంతి పడకుండా ఆటను రద్దు చేసారు. దీంతో మ్యాచ్ రిజర్వ్ డే కి వెళ్లింది. అప్పుడు కూడా పలుమార్లు ఆటకు వర్షం అంతరాయం కలిగించింది. తొలుత గుజరాత్ జట్టు 214 పరుగులు చేసింది. తరువాత భారీ వర్షం కురవడంతో చెన్నై ఇన్నింగ్స్ ను 15 ఓవర్లకు కుదించారు. డక్ వర్త్ లూయిస్ ప్రకారం.. 171 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు. ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది. అయితే ఈ సారి వరణుడు కరుణించి.. మ్యాచ్ రిజర్వ్ డే కి వెళ్లొద్దని ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్ అభిమానులు కోరుకుంటున్నారు.
Shreyas iyer vs bumrah
10 yrs challenge 🥶 pic.twitter.com/LWdbR8RGaB
— CURRY (@chef_curryyy) June 2, 2025