OTT Movie : ఎటుచూసినా థియేటర్లలో వస్తున్న సినిమాలు ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. వీటిలో హారర్ సినిమాలకు ఉండే ప్రత్యేకత వేరే లెవెల్ లో ఉంటుంది. ఈ సినిమాలకు అభిమానులు ఎక్కువగానే ఉన్నారు. అలాగే ఈ సినిమాలు చూస్తున్నప్పుడు వచ్చే కిక్కే వేరుగా ఉంటుంది. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా మరో లెవెల్ లో ఉంటుంది. ఊపిరి పీల్చుకోనీకుండా చేస్తుంది. ఒక దుష్ట శక్తి మనుషులను దారుణంగా చంపుతుంటుంది. ఒక అమ్మాయికి ఇవన్నీ కళ్ళముందే కనబడుతుంటాయి. ఈ సినిమాని ఒంటరిగా చూడటం కష్టమే. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..
స్టోరీలోకి వెళితే
మాడిసన్ అనే యువతి భయంకరమైన సంఘటనలతో బాధపడుతోంది, ఇందులో ఆమె దారుణమైన హత్యలను చూస్తుంది. కళ్ళముందే తనకు జరుగుతున్న విషయాలను చూసి హడలిపోతుంది. ఒక మాయలో ఇరుక్కుంటుంది. ఈ దృశ్యాలు కేవలం కలలు కాదని, అవి వాస్తవంలో జరుగుతున్న భయంకరమైన సంఘటనలు అని ఆమెకు తెలుస్తుంది. ఈ దృశ్యాలు ఆమె గతంతో ముడిపడి ఉన్నాయని, ఆమె చిన్నతనంలో స్నేహితుడైన గాబ్రియేల్ అనే వ్యక్తికి వీటితో సంబంధం ఉందని తెలుస్తుంది. మరోవైపు సిమియన్ రీసెర్చ్ హాస్పిటల్‌లో గాబ్రియేల్ అనే వ్యక్తిని డాక్టర్ ఫ్లోరెన్స్ వీవర్, ఆమె సహచరులు చికిత్స చేస్తుంటారు. గాబ్రియేల్ అసాధారణ శక్తులు కలిగి ఉంటాడు. విద్యుత్‌ను సైతం నియంత్రించగలడు.
తన ఆలోచనలను స్పీకర్‌ల ద్వారా కూడా ప్రసారం చేయగలడు. అతను హింసాత్మకంగా మారి, ఆసుపత్రి సిబ్బందిని చంపి తప్పించుకుంటాడు. మాడిసన్ తన గతంలోని చీకటి రహస్యాలను వెలికితీస్తూ, ఈ హత్యల వెనుక ఉన్న నిజాన్ని కనిపెట్టానికి ప్రయత్నిస్తుంది. ఒక అదృశ్య శక్తి ఇదంతా చేస్తుందని అర్థమౌతుంది. సినిమా మలుపులు, షాకింగ్ రివీల్స్‌తో ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తుంది. చివరికి మాడిసన్ కు గాబ్రియేల్ కు ఉన్న సంబంధం ఏమిటి ? ఈ హత్యలు ఎందుకు జరుగుతున్నాయి ? మాడిసన్ ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కుంటుంది ? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే, ఈ సినిమాను మిస్ కాకుండా చూడండి.
Read Also : పొరపాటున దారి తప్పే ఫ్యామిలీ… సైకో కిల్లర్స్ చేసే అరాచకం చూస్తే గుండెల్లో వణుకు పుట్టాల్సిందే
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో
ఈ హారర్-థ్రిల్లర్ మూవీ పేరు ‘మలిగ్నంట్’ (Malignant). 2021 లో వచ్చిన ఈ సినిమాకి జేమ్స్ వాన్ దర్శకత్వం వహించారు. ఇందులో అన్నాబెల్లె వాలిస్, మాడీ హాసన్, జార్జ్ యంగ్, మైఖోల్ బ్రియానా వైట్, జాక్వెలిన్ మెకెంజీ వంటి నటులు నటించారు. ఒక మూవీ తెలుగు, తమిళం, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో విడుదలైంది. అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో ఈ మూవీ అందుబాటులో ఉంది.