E-Paper
Advertisement

ఆకాశంలోనే మిస్సయిన భారీ విమానం… దిమ్మతిరిగే మిలిటరీ ఇన్వెస్టిగేషన్

ఆకాశంలోనే మిస్సయిన భారీ విమానం… దిమ్మతిరిగే మిలిటరీ ఇన్వెస్టిగేషన్
Advertisement

Aviation Mystery Documentary on OTT : ఒక భారీ విమానం గాల్లోకి ఎగిరింది.. కానీ కొద్దిసేపటికే రాడార్‌ నుంచి మాయమైపోతే ? అందులో ఉన్నవాళ్లకు ఏం జరిగింది ? అసలు ఆ విమానం ఎక్కడికి వెళ్లింది ? ప్రమాదమా, సాంకేతిక లోపమా ? లేక ఎవరో పక్కా ప్లాన్‌తో దాన్ని మాయం చేశారా ? ఇలాంటి ప్రశ్నల చుట్టూ సాగే ఏవియేషన్ మిస్టరీనే ‘ఇన్‌స్టాడాక్స్: ది డీకాయ్ ప్లేన్’ (Instadox: The Decoy Plane). ఓ విమానం అదృశ్యం కావడం, దాని వెనుక ఉన్న అనుమానాస్పద పరిణామాలు, ఆచూకీ కోసం సాగిన దర్యాప్తు… ఇవన్నీ కలిసి ఈ డాక్యుమెంటరీని ఆసక్తికరంగా మారుస్తాయి. తాజాగా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ ఇంగ్లీష్ డాక్యుమెంటరీ ఫిల్మ్, సాధారణ విమాన మిస్టరీని మిలిటరీ ఇన్వెస్టిగేషన్ కోణంలో చూపిస్తుంది. మరి అసలు విమానం ఏమైంది ? దాని స్థానంలో డీకాయ్ ప్లేన్‌ను ఎందుకు ఉపయోగించారు ? ఈ ఆపరేషన్ వెనుక ఉన్న ఉద్దేశం ఏంటి ? అనే వివరాలపై ఓ లుక్కేద్దాం పదండి.

కథలోకి వెళ్తే…

‘ఇన్‌స్టాడాక్స్: ది డీకాయ్ ప్లేన్’లో ఓ భారీ విమానం చుట్టూ ఏర్పడిన అనుమానాలే కథకు కేంద్రంగా ఉంటాయి. సాధారణంగా ప్రయాణిస్తున్న విమానం ఒక్కసారిగా రాడార్‌ నుంచి అదృశ్యమవడంతో దర్యాప్తు సంస్థల దృష్టి దానిపై పడుతుంది. మొదట ఇది ఓ సాధారణ విమాన ప్రమాదం కావచ్చనే అనుమానం కలిగినా… ఆ తర్వాత బయటపడే పరిణామాలు ఆ ఆలోచనను మార్చేస్తాయి. విమానం ప్రయాణించిన మార్గం, దాని కదలికలు, అందుబాటులోకి వచ్చిన ఆధారాలు.. ఒక్కొక్కటిగా ఇన్వెస్టిగేషన్ లో భాగం అవుతాయి. దర్యాప్తు ముందుకు సాగుతున్న కొద్దీ ఈ ఘటన వెనుక మరింత పెద్ద వ్యవహారం ఉండొచ్చనే అనుమానాలు బలపడతాయి.

Advertisement

ముఖ్యంగా అసలు విమానం స్థానంలో మరో విమానాన్ని డీకాయ్‌గా ఉపయోగించారా ? అనే ప్రశ్న ఈ మిస్టరీకి కొత్త కోణాన్ని తెస్తుంది. ఇక్కడే డాక్యుమెంటరీలో ఆసక్తి పెరుగుతుంది. ఒక విమానం అదృశ్యమైందనే విషయం కాస్తా… దాని స్థానంలో మరో విమానాన్ని చూపించేంత పెద్ద ప్లాన్‌గా మారితే ? ఆ మార్పు వెనుక ఎవరున్నారు ? ఎవరి ఆదేశాలతో ఈ మొత్తం ఆపరేషన్ జరిగిందనే అనుమానాలు ఎలా పుట్టాయి ? అనే అంశాలను దర్యాప్తు కోణంలో పరిశీలిస్తారు.

అసలు ఈ ఘటన ప్రమాదమా, సాంకేతిక లోపమా, లేక కావాలనే రూపొందించిన ఆపరేషనా ? అనే ప్రశ్నలకు సమాధానం వెతికే క్రమంలో మిలిటరీకి సంబంధించిన అంశాలు కూడా తెరపైకి వస్తాయి. విమానం కదలికలు, దాని ఆచూకీ, దర్యాప్తులో బయటపడిన ఆధారాలు.. ఇవన్నీ కలిసి మిస్టరీని మరింత ఉత్కంఠభరితంగా మారుస్తాయి. చివరికి అసలు విమానం ఏమైంది? దాని స్థానంలో డీకాయ్ ప్లేన్‌ను ఎందుకు ఉపయోగించారు? ఈ మొత్తం వ్యవహారం వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏంటి? అనే ప్రశ్నలకు సమాధానమే ఈ డాక్యుమెంటరీ.

Advertisement

Read Also : కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

 

ఓటీటీలో ఎక్కడ చూడచ్చు?

‘ఇన్‌స్టాడాక్స్: ది డీకాయ్ ప్లేన్’ ఇంగ్లీష్ డాక్యుమెంటరీ ఫిల్మ్. సెప్టెంబర్ 4 నుంచి ‘నెట్‌ఫ్లిక్స్’ (Netflix)లో స్ట్రీమింగ్ అవుతోంది. ఏవియేషన్ మిస్టరీలు, మిలిటరీ ఇన్వెస్టిగేషన్స్, కాన్స్పిరసీ థియరీలు, నిజ జీవితంలో జరిగిన అనుమానాస్పద ఘటనలపై ఆసక్తి ఉన్నవారికి ఈ డాక్యుమెంటరీ ఆసక్తికరంగా అనిపించొచ్చు. ఆకాశంలో జరిగిన ఓ మిస్టరీ వెనుక దాగి ఉన్న అసలు నిజాన్ని తెలుసుకోవాలనుకునే వారికి ఇది ఆసక్తికరమైన ఇన్వెస్టిగేటివ్ వాచ్. అస్సలు మిస్ అవ్వొద్దు.

Tags

Related News

అల్లరి నరేష్ రంభ ఊర్వశి మేనక ఓటీటీ పార్టనర్ లాక్..స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

కోర్టు రూమ్‌లోనే జడ్జ్‌కి మైండ్ బ్లాకింగ్ ఛాలెంజ్… క్షణక్షణం సీట్ ఎడ్జ్ మైండ్ గేమ్‌లున్న ఈ లీగల్ డ్రామా తెలుగులోనే

చిన్నతనంలోనే ప్రపంచాన్ని చుట్టేసిన కుర్రాడి అడ్వెంచర్స్… కళ్ళు ఆర్పకుండా చూసే రియల్ డాక్యుమెంటరీ

నిధి వేట… దెయ్యాలతో ఆట… హారర్ ట్విస్ట్‌తో వస్తున్న వందల కోట్ల నవ్వుల ఫ్రాంచైజీ

పేదరికం నుంచి సామ్రాజ్యం దిశగా విజనరీ ప్రయాణం… కళ్లు చెమర్చేలా చేసే రియల్ లైఫ్ లయన్ స్టోరీ

12 ఏళ్ల ప్రయాణానికి మైండ్ బ్లోయింగ్ ముగింపు… మోటార్ ప్రపంచంలో అడ్వెంచరస్ రోలర్‌కోస్టర్ రైడ్

కుటుంబం, ప్రేమ మధ్య నలిగిపోయే క్లాసికల్ మ్యూజిషియన్ కథ… కన్నీళ్లు పెట్టించే ఎమోషనల్ జర్నీ

Big Stories

Advertisement
×