E-Paper
Advertisement

ప్రమాదానికి గురైన ట్రావెల్ బస్సు.. ఏపీ వాసుల ముగ్గురు మృతి, మరో 15 మంది గాయాలు, బీహార్‌లో ఘటన

ప్రమాదానికి గురైన ట్రావెల్ బస్సు.. ఏపీ వాసుల ముగ్గురు మృతి, మరో 15 మంది గాయాలు, బీహార్‌లో ఘటన
Advertisement

Road Accident: బీహార్‌‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కాశీ నుంచి ఔరంగాబాద్ వెళ్తున్న ట్రావెల్ బస్సు అర్ధరాత్రి ఘోర ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. మరో 15 మంది గాయపడ్డారు. మృతులంతా ఏపీకి చెందినవారు. క్షతగ్రాతులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అసలు ఘటన ఎలా జరిగింది?

బీహార్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపీ వాసుల ముగ్గురు మృతి 

Advertisement

నెల్లూరు జిల్లా సంగం నుంచి కాశీకి ట్రావెల్ బస్సులో బయులుదేరారు యాత్రికులు. ఆదివారం అర్ధరాత్రి ఆ బస్సు బీహార్‌లో ప్రమాదానికి గురైంది. ట్రావెల్ బస్సు బీహార్‌లోని ఔరంగాబాద్‌ సమీపంలోకి రాగానే ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో బస్సులోని ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు.

మరో 15 మంది తీవ్రంగా గాయపడడంతో వెంటనే వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. జూన్ ఒకటిన 43 మందితో ట్రావెల్ బస్సు బయలుదేరింది. ఆదివారం రాత్రి బీహార్‌‌లోని గయా నుంచి వారణాసికి వెళ్తున్న సమయంలో జాతీయ రహదారి 2పై ఎదురుగా వస్తున్న మరొక వాహనం ఢీకొట్టింది ట్రావెల్ బస్సు.

Advertisement

బీహార్ నుంచి కాశికి వెళ్తుండగా ప్రమాదానికి గురైన ట్రావెల్ బస్సు

దీంతో బస్సులో ఎడమ వైపు కూర్చొన్నవారిలో ముగ్గురు స్పాట్‌లోనే మృత్యువాత పడ్డారు. ఈ ఘటనలో బస్సులోని ప్రయాణికులు ఒక్కసారిగా షాకయ్యారు. బస్సులోని ప్రయాణికులు సంగం, ఆత్మకూరు ప్రాంతాలకు చెందినవారు ఉన్నారు.  ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి వుంది.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×