E-Paper
Advertisement

కుటుంబం, ప్రేమ మధ్య నలిగిపోయే క్లాసికల్ మ్యూజిషియన్ కథ… కన్నీళ్లు పెట్టించే ఎమోషనల్ జర్నీ

కుటుంబం, ప్రేమ మధ్య నలిగిపోయే క్లాసికల్ మ్యూజిషియన్ కథ… కన్నీళ్లు పెట్టించే ఎమోషనల్ జర్నీ
Advertisement

Jagamae Sangeetham OTT : సంగీతం అంటే కేవలం ఓ కళ కాదు… కొందరికి అదే జీవితం. కానీ ఆ జీవితంలోకి ప్రేమ వస్తే ? కుటుంబం ఒకవైపు, మనసు మరోవైపు నిలబడితే ? తాను నమ్మిన వ్యక్తి కోసం తీసుకునే నిర్ణయం, తనను ప్రేమించే వాళ్ల జీవితాలను కూడా మార్చేస్తే ? ఇలాంటి భావోద్వేగ సంఘర్షణలతో సాగే కథే ‘జగమే సంగీతం’ (Jagamae Sangeetham). క్లాసికల్ మ్యూజిక్ బ్యాక్‌డ్రాప్‌లో ప్రేమ, కుటుంబ బంధాలు, వ్యక్తిగత కలల మధ్య జరిగే ప్రయాణాన్ని చూపించే ఈ తెలుగు వెబ్ సిరీస్, సంగీతాన్ని ఇష్టపడేవారితో పాటు ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాలను చూసేవారికి కూడా ఆసక్తి కలిగించేలా ఉంటుంది. మరి తనకు ప్రాణమైన సంగీతం, తనను ప్రేమించే కుటుంబం, తన మనసుకు దగ్గరైన వ్యక్తి… ఈ మూడింటి మధ్య ఓ కళాకారుడు ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు ? ఆ నిర్ణయం అతని జీవితాన్ని ఎలా మార్చింది ? అనేది కథలోకి వెళ్తే తెలుస్తుంది.

కథలోకి వెళ్తే…

కథలో ప్రధాన పాత్ర ఓ ప్రతిభావంతమైన క్లాసికల్ మ్యూజిషియన్. చిన్నప్పటి నుంచే సంగీతంపై అతనికి ఉన్న అభిమానం, కాలం గడిచే కొద్దీ మరింత బలపడుతుంది. కుటుంబం కూడా అతని ప్రతిభను గుర్తించి ప్రోత్సహిస్తుంది. సంగీత సాధన, ప్రదర్శనలు, తన కళను మరింత మెరుగుపరుచుకోవాలనే తపన… ఇవే అతని ప్రపంచంగా మారతాయి. అయితే జీవితంలోకి ప్రేమ ప్రవేశించిన తర్వాత అతని ప్రాధాన్యతలు ఒక్కసారిగా మారడం మొదలవుతుంది.

Advertisement

తన మనసుకు నచ్చిన వ్యక్తితో కలిసి భవిష్యత్తును ఊహించుకోవడం మొదలుపెట్టిన అతనికి, కుటుంబ సభ్యుల ఆశలు మరోవైపు గుర్తుకొస్తుంటాయి. వాళ్ల ప్రేమను నిర్లక్ష్యం చేయలేడు. అదే సమయంలో తన మనసు చెప్పిన దారిని కూడా పూర్తిగా వదులుకోలేడు. తన జీవితాన్ని తాను కోరుకున్న విధంగా జీవించే హక్కు, తనను నమ్మిన వాళ్ల పట్ల ఉన్న బాధ్యత… ఈ రెండింటి మధ్య చిక్కుకుంటాడు. ఇక ఈ సంఘర్షణే కథను ఆసక్తికరంగా మారుస్తుంది. ప్రేమించిన వ్యక్తితో కొత్త జీవితం మొదలుపెట్టాలని అనుకున్న ప్రతిసారీ కుటుంబ పరిస్థితులు అడ్డు వస్తాయి.

మరోవైపు కుటుంబం కోసం తన కలలను పక్కన పెట్టాలని భావించినప్పుడు, సంగీతం లేకుండా తన జీవితం ఎలా ఉంటుందనే ఆలోచన అతన్ని వెంటాడుతుంది. తనకు ఎంతో ఇష్టమైన కళను వదులుకోవడం అంత సులభం కాదని అతనికి అర్థమవుతుంది. ఈ క్రమంలో అతను తీసుకునే నిర్ణయాలు కేవలం అతని జీవితాన్నే కాదు… కుటుంబ సభ్యుల మధ్య ఉన్న సంబంధాలను కూడా దెబ్బతీస్తుంది. ఒకరి మనసును గెలుచుకోవడానికి ప్రయత్నిస్తే, మరొకరి మనసు నొచ్చుకునే పరిస్థితులు ఎదురవుతాయి. ప్రేమలోని ఆనందం, కుటుంబ బంధాల్లోని ఆప్యాయత, తన కలలపై ఉన్న పట్టుదల… ఇవన్నీ కలిసి అతని ప్రయాణాన్ని మరింత భావోద్వేగంగా మారుస్తాయి. చివరికి ప్రేమ కోసం తీసుకున్న నిర్ణయం అతని కుటుంబాన్ని ఎటు తీసుకెళ్లింది ? తన కలలను కాపాడుకోవడానికి అతను ఏం చేశాడు ? కుటుంబాన్ని వదులుకోకుండా తన మనసుకు నచ్చిన జీవితాన్ని గడపడానికి అతనికి ఏదైనా మార్గం దొరికిందా ? అనే ప్రశ్నలకు సమాధానమే ఈ సిరీస్‌లోని అసలు ఎమోషన్.

Advertisement

Also Read : ఆ ఒక్క రహస్యం బయటపడితే జీవితం నాశనమే… 7.7 రేటింగ్ ఉన్న గ్రిప్పింగ్ సైకలాజికల్ థ్రిల్లర్

తెలుగులోనే స్ట్రీమింగ్

‘జగమే సంగీతం’ తెలుగు క్లాసికల్ మ్యూజికల్ రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామా వెబ్ సిరీస్. తమిళంలోనూ స్ట్రీమింగ్ అవుతోంది. సెప్టెంబర్ 4 నుంచి ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’ (Amazon Prime Video)లో స్ట్రీమింగ్ అవుతోంది. హడావుడి లేని ఎమోషనల్ కథలు, కుటుంబ సంబంధాలకు ప్రాధాన్యత ఇచ్చే డ్రామాలు, సంగీతం నేపథ్యంగా సాగే ప్రేమకథలు ఇష్టపడేవారు దీన్ని ఒకసారి ట్రై చేయొచ్చు. హిందీలో సూపర్ హిట్ అయిన ‘బందిష్ బండిట్స్’ సిరీస్‌కు అధికారిక రీమేక్‌గా వచ్చిన ఈ సిరీస్‌ కు ‘కుమారి 21ఎఫ్’ ఫేమ్ పాలనాటి సూర్య ప్రతాప్ దర్శకత్వం వహించారు. ఈ సిరీస్‌లో అక్షయ్ లగుసాని సాంప్రదాయ సంగీత వారసుడు ‘బాలు’ పాత్రలో నటించగా, సుష్మిత శెట్టి, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, మధుబాల ప్రధాన పాత్రల్లో నటించారు.

Related News

కూతురిని కాపాడాలంటే భార్యను పంపమనే మాఫియా డాన్… 8.8 రేటింగ్‌తో దూసుకెళ్తున్న తెలుగు థ్రిల్లర్

పూజారి అంటే పూజలే అనుకుంటున్నారా ? విలన్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించే ఫైటర్… కొరియన్ యాక్షన్ థ్రిల్లర్

దుల్కర్‌ సినిమా స్ట్రీమింగ్ విషయంలో గందరగోళం… స్ట్రీమింగ్ ఏ ఓటీటీలో ? ఎప్పటి నుంచి ?

అపార్ట్‌మెంట్‌లో వరుస మిస్సింగ్స్.. ఆ బిల్డింగ్ కేర్‌టేకర్‌ వెనుక దాగిన భయంకర నిజం… హాలీవుడ్ హారర్ థ్రిల్లర్

ఆ పాత పెట్టె తెరిస్తే పాతాళానికే… ఇంట్లోనే నరకం చూపించిన దుష్టశక్తి… తెలుగులోనే ఈ హారర్ థ్రిల్లర్

అడవిలో ఆపద తెచ్చిన ప్రయాణం… ఆ దారిలో వెళ్తే ప్రాణాలే గాల్లో… టెర్రిఫిక్ తెలుగు థ్రిల్లర్

పూరీ పుణ్యక్షేత్రం రహస్యం… దివ్యశక్తి కోసం విలన్ల ఊచకోత… ఒక్కో సీన్ చూస్తుంటే మతిపోతోంది

ఈజీ మనీ కోసం ఎన్నికల్లో మోసం.. చివరికి ఊరంతా శత్రువులైతే… తెలుగు సినిమానే

Big Stories

Advertisement
×