BigTV English

OTT Movie : పిల్లల్ని తినేసే నల్ల పిశాచి… మోస్ట్ స్కేరీయెస్ట్ హర్రర్ మూవీ… రాత్రిపూట ఒంటరిగా చూడకూడని మూవీ

OTT Movie : పిల్లల్ని తినేసే నల్ల పిశాచి… మోస్ట్ స్కేరీయెస్ట్ హర్రర్ మూవీ… రాత్రిపూట ఒంటరిగా చూడకూడని మూవీ

OTT Movie : ఇండోనేషియన్ హారర్ సినిమాలలో రిచ్యువల్‌ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అక్కడి వాళ్ళకు చేతబడి లాంటి సంఘటనలపై ఎక్కువ నమ్మకం ఉండవచ్చు. అందుకే అలాంటి సినిమాలు ఎక్కువగా వస్తుంటాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమాలో కూడా రిచ్యువల్‌ కంటెంట్ తో నడుస్తుంది. ఒక వెకేషన్‌కి వెళ్లిన ఫ్యామిలీ దీని బారిన పడతారు. ఆతరువాత స్టోరీ రసవత్తరంగా ఉంటుంది. స్పైన్ చిల్లింగ్ సీన్స్ తో గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఈ సినిమా ఓటీటీలో కూడా దూసుకుపోతోంది. ఈ సినిమా స్టోరీ ఏమిటి ? ఎందులో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే ..


జియో హాట్ స్టార్ లో

‘జైలాంగ్‌కంగ్: సాండేకాలా’ (Jailangkung sandekala)ఇండోనేషియన్-సౌత్ కొరియన్ సూపర్‌నాచురల్ హారర్ సినిమా. కిమో స్టాంబోయల్ దీనికి దర్శకత్వం వహించారు. ఇందులో టిటి కమల్ (సాండ్రా), డ్వి సాసోనో (అడ్రియన్), సైఫా హడ్జు (నికి), ముజక్కి రామ్‌ధన్ (కినన్), జూలియో పరెంగ్‌కువాన్ (ఫైసల్), మైక్ లూకాక్ (మజీద్) ప్రధాన పాత్రల్లో నటించారు. ఈసినిమా 2022 సెప్టెంబర్ 22న థియేటర్‌లలో రిలీజ్ అయ్యింది. 2024లో జియో హాట్ స్టార్ లో అందుబాటులోకి వచ్చింది. 92 నిమిషాల నిడివి ఉన్న ఈ హారర్ సినిమా IMDbలో 5.7/10 రేటింగ్ ని పొందింది.


కథలోకి వెళ్తే

అడ్రియన్, సాండ్రా, వాళ్ల పిల్లలు నికి, కినన్‌లతో కలిసి ఒక లేక్‌కి వెకేషన్‌కి వెళ్తారు. సాయంత్రం సమయంలో కినన్ లేక్ వద్ద ఆడుకుంటూ హఠాత్తుగా మాయమైపోతాడు. సాండేకాలా అనే మిస్టికల్ జీవి, సూర్యాస్తమయంలో పిల్లలను కిడ్నాప్ చేస్తుందనే విషయం అక్కడే ఉండే ఒక స్థానిక కుటుంబం నుంచి వీళ్ళు తెలుసుకుంటారు. కినన్‌ని వెతకడానికి అడ్రియన్, సాండ్రా, నికి స్థానికులైన ఫైసల్, మజీద్ తో కలిసి అడవిలోకి వెళ్తారు. కానీ ఎటువంటి ఆధారాలూ దొరకవు. ఈ సమయంలో నికి ఆ అడవిలో జైలాంగ్‌కంగ్ అనే ఒక రిచ్యువల్ డాల్ ని కనిపెడుతుంది. దాని ద్వారా కినన్ ఆచూకీ తెలుసుకోవాలని ప్రయత్నిస్తుంది. అయితే ఆ బొమ్మ వల్ల వింత శబ్దాలు, భయంకరమైన దృశ్యాలు కనిపిస్తాయి. సాండేకాలా వాళ్లను వెంటాడుతుందని తెలుస్తుంది. అడ్రియన్ గతంలో చేసిన ఒక తప్పు ఈ శాపానికి కారణమనే సూచనలు వస్తాయి. ఒక స్థానికుడు సాండేకాలాని శాంతపరచడానికి ఒక రిచ్యువల్ చేయాలని చెప్తాడు.

కానీ ఆ రిచ్యువల్ విఫలమవుతుంది. మజీద్ కూడా కనిపించకుండా పోతాడు. నికి ఆ బొమ్మ ద్వారా కినన్‌ని కనుగొనేందుకు మళ్లీ ప్రయత్నిస్తుంది. కానీ సాండేకాలా ఆమెను లేక్‌లోకి లాగడానికి చూస్తుంది. అడ్రియన్, సాండ్రా కినన్‌ని కాపాడడానికి తమ ప్రాణాలను రిస్క్ చేస్తారు. ఈ క్రమంలో అడ్రియన్ గతంలో ఒక స్థానిక కుటుంబాన్ని హర్ట్ చేసిన సంఘటన సాండేకాలా శాపానికి కారణమని తెలుస్తుంది. క్లైమాక్స్‌లో, నికి, సాండ్రా కలిసి ఒక రిచ్యువల్‌ చేసి, కినన్‌ని ఒక గుహలో కనిపెడతారు. ఇక క్లైమాక్స్ ఊహించని మలుపు తీసుకుంటుంది. సాండేకాలా నుంచి వీళ్లంతా బయటపడతారా ? దాని చేతిలో బలవుతారా ? అడ్రియన్ గతానికి, ఈ దుష్ట శక్తికి ఉన్న లింక్ ఏమిటి ? అనే విషయాలను ఈ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.

Read Also : కళ్ళకు గంతలు… అతని కన్ను పడితే అంతే సంగతులు… క్రేజీ కొరియన్ క్రైమ్ డ్రామా

Related News

OTT Movie : బాబోయ్… అమాయకురాలు అనుకుంటే అడ్డంగా నరికేసే ఆడ సైకో… ఈ పిల్ల పిశాచి వేషాలకు మెంటలెక్కాల్సిందే

OTT Movie : రోబోతో ఇదేం పాడు పనిరా అయ్యా… అది రివేంజ్ మోడ్ లో చేసే అరాచకం రచ్చ రచ్చే

OTT Movie : స్కూల్లో మిస్టీరియస్ మరణాలు… ఆ పని చేసే స్టూడెంట్సే ఈ దెయ్యం టార్గెట్… దడ పుట్టించే తమిళ హర్రర్ మూవీ

OTT Movie : భార్య చర్మం వలిచి ఇదెక్కడి దిక్కుమాలిన పనిరా అయ్యా… చేతబడిని నమ్మనోళ్లు చూడాల్సిన మూవీ

OTT Movie : మనుషుల్ని వెంటాడి చంపే నీడ… పిచ్చెక్కించే ట్విస్టులు… మతిపోయే మిస్టరీ థ్రిల్లర్

Big Stories

×