Heavy Rains: హైదరాబాద్ మహానగరంలోని భారీ వర్షం కురుస్తోంది. ఈ వర్షం కారణంగా.. అనేక ప్రాంతాల్లో రహదారులపైకి భారీగా నీరు వచ్చి చేరింది. దీంతో అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలు ఏర్పడ్డాయి. అదివారం సెలవు దినం అయినా.. రహదారులపై భారీగా ట్రాఫిక్ జామ్అవ్వడంతో వాహనాలు మెల్లగా సాగుతున్నాయి. ట్రాపిక్‌ను తొలగించడానికి పోలీసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోంటున్నారు.
సికింద్రాబాద్‌లో దంచికొట్టిన భారీ వర్షం
రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి సికింద్రాబాద్‌లోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలుచోట్ల ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్రఅవస్థలు పడుతున్నారు. బేగంపేట్ ప్రకాష్ నగర్‌లో మోకాళ్ల లోతు నీరు చేరింది. వర్షం పడిన ప్రతీసారి తమకు ఈ బాధలు తప్పడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి దీనికి శాశ్వత పరిష్కారం చూపించాలని ప్రజలు కోరుతున్నారు.
పలు ప్రాంతాలు జలమయం..
అంతేకాకుండా.. ఫిలింనగర్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట తదితర ప్రాంతాలు జలమయమైనాయి. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ, ఎస్‌డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి.. సహాయక చర్యలు చేపట్టాయి.
విద్యుత్ లేక ప్రజల కష్టాలు..
మరోవైపు.. భారీ వర్షాలు కారణంగా.. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. నగరంలోని ప్రధాన రహదారుల్లోని వీధి దీపాలు సైతం వెలగడం లేదు. ఇక భారీ వర్షానికి ఈదురు గాలులు సైతం తొడయ్యాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
మరో మూడు రోజులు భారీ వర్షాలు..
అయితే.. తెలంగాణలో ఇంకా మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో అధికార యంత్రాంగాన్ని ప్రభుత్వం అప్రమత్తం చేసింది. సహాయక చర్యలు చేపట్టేందుకు వీలుగా కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసింది. రాష్ట్ర స్థాయిలో ఈఎన్‌సీ కార్యాలయంలో ప్రత్యేకంగా ఫ్లడ్ కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు.