BigTV English

OTT Movie : కళ్ళకు గంతలు… అతని కన్ను పడితే అంతే సంగతులు… క్రేజీ కొరియన్ క్రైమ్ డ్రామా

OTT Movie : కళ్ళకు గంతలు… అతని కన్ను పడితే అంతే సంగతులు… క్రేజీ కొరియన్ క్రైమ్ డ్రామా

OTT Movie : కొరియన్ స్టోరీలకు ఫిదా అయిపోతున్నారు మన ప్రేక్షకులు. ఈ సినిమాలు, సిరీస్ లు సరికొత్త స్టోరీలతో కేక పెట్టిస్తున్నాయి. ఇక్కడి నుంచి వచ్చే రొమాంటిక్ స్టోరీలకు ఫాలోయింగ్ ఎక్కువగా ఉంటుంది. ఆతరువాత యాక్షన్ స్టోరీలు కూడా చిల్లింగ్ థ్రిల్ ని ఇస్తున్నాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా సైన్స్ ఫిక్షన్-యాక్షన్ థ్రిల్లర్ జానర్ లో వచ్చింది. ఈ సినిమా మొదలు పెడితే చివరిదాకా చూపు తిప్పుకోరు. సస్పెన్స్, యాక్షన్, ట్విస్ట్ లతో ఈ స్టోరీ ఉత్కంఠంగా నడుస్తుంది. ఇందులో సియోల్ నగరంలో ఒక వ్యక్తికి తన చూపుతో ఇతరుల మనసును నియంత్రించగల శక్తి ఉంటుంది. ఆ శక్తి తో అతడు చేసే ఘోరాల చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళ్తే …


కథలోకి వెళ్తే

ఈ స్టోరీ చో-ఇన్ అనే బాలుడితో మొదలవుతుంది. అతను తన చూపుతో ఇతరుల మనసును నియంత్రించగల సైకిక్ శక్తి కలిగి ఉంటాడు. చిన్నప్పుడు అతని తల్లి అతని కళ్లకు కట్టు కట్టి, ఈ శక్తిని అదుపులో ఉంచుతుంది. కానీ అతని శాడిస్ట్ తండ్రి అతన్ని ఘోరంగా ట్రీట్ చేస్తుంటాడు. ఒక రోజు చో-ఇన్ కట్టు తీసేసి, తండ్రిని ఆత్మహత్య చేసుకునేలా చేస్తాడు. దీంతో అతని తండ్రి చనిపోతాడు. ఈ విషయం తెలుసుకున్న చో-ఇన్ తల్లి అతన్ని చంపడానికి ప్రయత్నిస్తుంది. కానీ చో-ఇన్ తప్పించుకుని పారిపోతాడు. కొన్ని సంవత్సరాల తర్వాత, అతను సమాజంపై విరక్తితో, తన శక్తిని ఉపయోగించి దొంగతనాలు చేస్తూ ఒంటరిగా జీవిస్తుంటాడు.


మరోవైపు క్యూ-నామ్ అనే వ్యక్తి స్క్రాప్‌యార్డ్‌లో పనిచేస్తూ, టర్కీ నుంచి వచ్చిన అలీ, ఘ,నా బుబ్బాతో స్నేహంగా ఉంటాడు. క్యూ-నామ్ ఒక కారు యాక్సిడెంట్‌లో గాయపడిన తరువాత ఉద్యోగం కోల్పోతాడు. అతను జంగ్-సిక్ నడిపే యూటోపియా అనే పాన్‌షాప్‌లో కొత్తగా ఉద్యోగం సంపాదిస్తాడు. అక్కడ జంగ్-సిక్ కూతురు యంగ్-సూక్ తో స్నేహం చేస్తాడు. నెక్స్ట్ సీన్ లో చో-ఇన్ యూటోపియాని దోచుకోవడానికి వస్తాడు. అక్కడ అందరినీ తన శక్తితో నియంత్రిస్తాడు. కానీ క్యూ-నామ్ అతని పవర్‌కి లొంగడు. అతన్ని ఆపడానికి ప్రయత్నిస్తాడు. ఈ గొడవలో, చో-ఇన్ జంగ్-సిక్‌ని దారుణంగా చంపేస్తాడు. క్యూ-నామ్ కూడా తీవ్రంగా గాయపడతాడు. కానీ తొందరగానే కోలుకుంటాడు. క్యూ-నామ్, జంగ్-సిక్ మరణానికి చో-ఇన్‌ని నిందిస్తూ, అతన్ని పట్టుకోవాలని అనుకుంటాడు. అలీ, బుబ్బాతో కలిసి, చో-ఇన్‌ని పట్టుకోవడానికి CCTV ఫుటేజ్ సేకరిస్తాడు.

కానీ చో-ఇన్ తన శక్తితో జనాలను నియంత్రించి వాళ్లపై దాడి చేయిస్తాడు. చో-ఇన్‌ని క్యూ-నామ్ కష్టపడి పట్టుకుని పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్తాడు. కానీ చో-ఇన్ పోలీసులను కూడా నియంత్రించి తప్పించుకుంటాడు. ఒక సబ్‌వే స్టేషన్‌లో, చో-ఇన్ ఒక తల్లిని తన బిడ్డని రైలు ముందు వెళ్లేలా హిప్నటైజ్ చేస్తాడు. కానీ క్యూ-నామ్ వాళ్ళను కాపాడతాడు. అలీ, బుబ్బా ఒక పాత వ్యాన్‌ని మాడిఫై చేసి, చో-ఇన్‌ని ఆపడానికి ఫ్లేర్ గన్ తయారు చేస్తారు. కానీ అది కూడా పనిచేయదు. చో-ఇన్, క్యూ-నామ్‌ని, అలీ, బుబ్బాని యూటోపియాలో ఉరితీస్తాడు. కానీ క్యూ-నామ్ తృటిలో తప్పించుకుంటాడు. అయితే ఈ ఘటనలో అలీ, బుబ్బా చనిపోతారు. ఇప్పుడు ప్రతీకారం తో క్యూ-నామ్ రగిలిపోతాడు. క్లైమాక్స్‌లో అదిరిపోయే సీన్స్ ఉంటాయి. చో-ఇన్‌ని కథని క్యూ-నామ్ ఎలా ముగిస్తాడు ? అనే ప్రశ్నకు సమాధానం కావాలనుకుంటే, ఈ యాక్షన్ థ్రిల్లర్ సినిమాని మిస్ కాకుండా చుడండి.

రెండు ఓటీటీలలో స్ట్రీమింగ్

‘హాంటర్స్’ (Haunters) దక్షిణ కొరియా సైన్స్ ఫిక్షన్-యాక్షన్ థ్రిల్లర్ సినిమా. దీనికి కిమ్ మిన్-సుక్ డైరెక్ట్ చేశారు. ఇందులో గాంగ్ డాంగ్-వోన్, గో సూ, జంగ్ యున్-చే, బైయన్ హీ-బాంగ్ నటించారు. Viki, Tubi ప్లాట్‌ ఫామ్ లో ఈ సినిమా అందుబాటులో ఉంది. 114 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా IMDbలో 7.0/10 రేటింగ్ ను పొందింది.

Read Also  : అక్క పెళ్లి చేసుకోవాల్సిన వాడితో ఆ పని చేసే చెల్లి… ట్విస్టులతో పిచ్చెక్కించే తమిళ క్రైమ్ డ్రామా

Related News

OTT Movie : పెళ్ళైన నెలకే భర్త మృతి… అర్ధరాత్రి అలాంటి అమ్మాయి ఇంటికి అనామకుడు… ఫీల్ గుడ్ తమిళ మూవీ

OTT Movie : కోర్టులో కచేరి… ఓటీటీలో ట్రెండ్ అవుతున్న కోర్టు రూమ్ డ్రామా… ఇంకా చూడలేదా?

OTT Movie : ఆ సౌండ్స్ వింటే ఈ దెయ్యానికి పూనకాలే… అమ్మాయి వెంటపడి అరాచకం… కల్లోనూ వెంటాడే హర్రర్ సీన్స్

F1 OTT: ఓటీటీ స్ట్రీమింగ్ కి సిద్ధమైన క్రేజీ రేసింగ్ మూవీ F1.. ఎప్పుడు?ఎక్కడంటే?

OTT Movie : ఇంటి ఓనర్లే ఈ కిల్లర్ టార్గెట్… వీడి చేతికి చిక్కారో నరకమే… క్రేజీ మలయాళ సైకో థ్రిల్లర్

Big Stories

×