E-Paper
Advertisement

Jio hotstar : హాట్‌స్టార్ లో ట్రెండ్ అవుతున్న టాప్‌-5… దుమ్మురేపుతున్న బిగ్ బాస్, మరో తెలుగు సినిమా

Jio hotstar : హాట్‌స్టార్ లో ట్రెండ్ అవుతున్న టాప్‌-5… దుమ్మురేపుతున్న బిగ్ బాస్, మరో తెలుగు సినిమా

Jio hotstar : జియో హాట్‌ స్టార్ 2025 అక్టోబర్ నెలలో ఆడియన్స్ కి హై బజ్ క్రియేట్ చేస్తోంది. ‘బిగ్ బాస్ సీజన్ 9’తో మొదలు పెడితే, ‘మిరాయ్’, ‘సెర్చ్’ వెబ్ సిరీస్, ‘హౌ టు ట్రైన్ యువర్ డ్రాగన్’, ‘హార్ట్’ ఈ వీకెండ్ టాప్ 5లో దుమ్మురేపు తున్నాయి. పిల్లలతో కలసి ఫ్యామిలీ ఆడియన్స్ కూడా వీటిని ఉత్సాహంగా చూసి ఆనందిస్తున్నారు. వీటి వివరాలు తెలుసుకుందాం పదండి.

1. ‘బిగ్ బాస్ సీజన్ 9’

ఈ రియాలిటీ షో జియో హాట్‌ స్టార్ లో దుమ్మురేపుతోంది. అక్కినేని నాగార్జున హోస్ట్ తో ఆడియన్స్ కూడా ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నారు. 16 మంది కంటెస్టెంట్స్ బిగ్ బాస్ హౌస్‌లో ఎంట్రీ ఇచ్చి సందడి చేస్తున్నారు. హౌస్‌లో కంటెస్టెంట్స్ టాస్క్‌లు, గేమ్స్, గొడవలతో హంగామా సృష్టిస్తున్నారు. ఒక్కొక్కరు ఎలిమినేషన్ అవుతూ, చివర్లో విన్నర్ కి ₹50 లక్షలతో పాటు, ఒక కార్ కూడా బహుమతి పొందనున్నారు. అక్టోబర్ 5 తర్వాత ఈ షో వీకెండ్ వ్యూస్ 5 మిలియన్లకి పైగా ఉంది. ప్రస్తుతం ఈ రియాలిటీ షో టాప్ లో ట్రెండ్ అవుతోంది.

2. ‘హౌ టు ట్రైన్ యువర్ డ్రాగన్’

ఈ హాలీవుడ్ లైవ్ యానిమేషన్ మూవీ థియేటర్లలో ఐదు వేల కోట్ల వసూళ్లతో రికార్డ్ సృష్టించింది. అక్టోబర్ 11న ఓటీటీ రిలీజ్ తర్వాత 4 మిలియన్ల వ్యూస్ తో టాప్ లేపుతోంది. ఫ్యామిలీ ఆడియన్స్ ని ఈ సినిమా విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ కథలో వైకింగ్స్, డ్రాగన్‌ లమధ్య హోరాహోరీ పోరు జరుగుతుంది. హిక్కప్ అనే కింగ్ కొడుకు, వైకింగ్ రాజ్యాన్ని డ్రాగన్‌ల నుండి కాపాడాల్సి వస్తుంది. అతను ఒక టూత్‌లెస్ అనే డ్రాగన్‌తో కలసి, భీకరంగా పోరాడి ఆ రాజ్యాన్ని సేవ్ చేస్తాడు.

3. ‘మిరాయ్’

ఈ తెలుగు ఫాంటసీ యాక్షన్ సినిమా, కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కింది. ఇందులో తేజ సజ్జా, మంచు మనోజ్, రితికా నాయక్, జగపతి బాబు, జయరామ్, శ్రీయ సరన్ ప్రధాన పాత్రల్లో నటించారు. అక్టోబర్ 10 ఓటీటీ రిలీజ్ తర్వాత వీకెండ్ వ్యూస్ 2 మిలియన్లకు పైగా వచ్చాయి. ఈ కథ ఒక ఫాంటసీ వరల్డ్‌లో ఒక యోధుడు 9 పవిత్ర గ్రంథాలను సేవ్ చేయాల్సి వస్తుంది. ఇవి మనిషిని దేవుడిగా మార్చగలవు. విలన్ (మంచు మనోజ్) బ్లాక్ స్వోర్డ్‌తో ఈ గ్రంథాల కోసం ఫైట్ చేస్తాడు. యోధుడు గురువుల (జగపతి బాబు, జయరామ్) సహాయంతో ప్లానెట్స్ ట్రావెల్ చేస్తూ విలన్‌ను ఓడించి, గ్రంథాలను సేవ్ చేస్తాడు. ఈ సినిమాలో ఉండే విజువల్ ఎఫెక్ట్స్ కి ప్రశంసలు కోడా వచ్చాయి.

4. ‘సెర్చ్’ వెబ్ సిరీస్

రోహన్ సిప్పీ రూపొందించిన ఈ హిందీ థ్రిల్లర్ సిరీస్ లో కొంకనా సెన్ షర్మ , చంద్సీ కటారియా ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సిరీస్ అక్టోబర్ 10 రిలీజ్ తర్వాత 3 మిలియన్ల వ్యూస్ తో ట్రెండింగ్ లో ఉంది. ఈ కథ నైనా అనే కాలేజ్ అమ్మాయి మిస్సింగ్ తో మొదలవుతుంది. ఆ తరువాత ఆమె ఒక పాలిటీషియన్ కార్‌లో శవమై కనిపిస్తుంది. పోలీస్ ఆఫీసర్ సంయుక్తా (కొంకనా సెన్ షర్మ) ఈ కేస్ తీసుకుంటుంది. కిల్లర్ ని పట్టుకునే క్రమంలో ఈకథ ఉత్కంఠంగా నడుస్తుంది. చివర్లో కిల్లర్ పాలిటీషియన్ అసిస్టెంట్ అని తెలుస్తుంది.

5. ‘హార్ట్’

ఈ హిందీ రోమాంటిక్ సినిమాకి వసు వర్మ దర్శకత్వం వహించారు. ఇందులో విక్రాంత్ మసే, రాధికా మద్ది, అభిషేక్ బానర్జీ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ కథ హీరో, హీరోయిన్ ల ప్రేమతో మొదలవుతుంది.కానీ ఈ జంట చాలా సమస్యలను ఫేస్ చేస్తారు. అక్టోబర్ 12 రిలీజ్ తర్వాత ఈ సినిమా 1.5 మిలియన్ల వ్యూస్ తో జియో హాట్‌ స్టార్ లో ట్రెండ్ అవుతోంది.

Read Also : చెరువులో మనిషి పుర్రె… మర్డర్ మిస్టరీలో మతిపోగోట్టే ట్విస్టులు… టెన్షన్ పెట్టే ఇంటెన్స్ మలయాళ థ్రిల్లర్

Related News

తెలుగు నుంచి హిందీ వరకు… ఈ వీకెండ్ మిస్ అవ్వకుండా చూడాల్సిన 11 సినిమాలు

థియేటర్లలో డిజాస్టర్ ఈ తెలుగు మూవీ… ఓటీటీలో ట్రెండింగ్ లోకి ఎలాగబ్బా ?

ఎట్టకేలకు హాట్ స్టార్ మోస్ట్ అవైటింగ్ క్రైమ్ సిరీస్‌ రిలీజ్ డేట్ ఫిక్స్

ఈ వారం OTTలో చూడాల్సిన మలయాళ తమిళ సినిమాల లిస్ట్

ఈ వీకెండ్ ఓటీటీలో మిస్ అవ్వకుండా చూడాల్సిన తెలుగు కన్నడ సినిమాలు ఇవే

ట్రంకు పెట్టెలో శవం… భోజనానికి ఆహ్వానిస్తే బుర్రపాడు ట్విస్ట్

17 ఏళ్ల అమ్మాయి హత్య… ఓటీటీని ఊపేస్తున్న 6 ఎపిసోడ్‌ల మిస్టరీ థ్రిల్లర్

IMDbలో 7.5 రేటింగ్… మలయాళం మర్డర్ మిస్టరీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫ్లిక్స్

Big Stories

×