E-Paper
Advertisement

Commonwealth Games 2030 : 2030 కామన్‌ వెల్త్ గేమ్స్‌కు భారత్ ఆతిథ్యం..అసలు వీటికి ఆ పేరు ఎలా వ‌చ్చింది

Commonwealth Games 2030  : 2030 కామన్‌ వెల్త్ గేమ్స్‌కు భారత్ ఆతిథ్యం..అసలు వీటికి ఆ పేరు ఎలా వ‌చ్చింది

Commonwealth Games 2030 :  భారత క్రీడాకారులకు బిగ్ అలర్ట్. కామన్‌వెల్త్ క్రీడల నిర్వహణపై ( Commonwealth Games 2030 ) కీలక అప్డేట్ వచ్చింది. 2030 కామన్వెల్త్ గేమ్స్ కు మన ఇండియా ఆతిథ్యం ఇవ్వబోతోంది. కామన్ వెల్త్ గేమ్స్ నిర్వహణకు ఇండియా ఎంపికైనట్లు అధికారిక ప్రకటన వెలువడింది. 2030 లో జరిగే ఈ క్రీడలు గుజరాత్ ( Gujarat) రాష్ట్రంలోని అహ్మదాబాద్ లో ( Ahmadabad) నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారట. 2010 సంవత్సరంలో భారత తొలిసారి కామన్వెల్త్ గేమ్స్ కు ఆతిథ్యం ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే దాదాపు 20 సంవత్సరాల తర్వాత మరోసారి ఇండియాకు ఈ అవకాశం వచ్చింది. దీంతో కామన్ వెల్త్ 2030 గేమ్స్ కు ఆతిథ్యం ఇవ్వబోతోంది ఇండియా. ఇది ఇలా ఉండగా అహ్మదాబాద్ ను కామన్‌వెల్త్ బోర్డు వేదికగా ప్రతిపాదించింది భారత్. ఇక దీనిపై వచ్చేనెల 26వ తేదీన తుది నిర్ణయం ప్రకటించనున్నారు.

Also Read: Team India Jersy: బుర‌ద ప‌ట్టిన టీమిండియా జెర్సీ వెనుక ఉన్న సీక్రెట్ ఇదే..చ‌రిత్ర‌లో మిగిలిపోవ‌డం ప‌క్కా

కామన్‌వెల్త్ గేమ్స్‌కు అసలు ఆ పేరు ఎలా వ‌చ్చింది ?

 

కామన్ వెల్త్ క్రీడాల ( Commonwealth Games 2030 ) గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అంతర్జాతీయంగా ఈ క్రీడాలకు గుర్తింపు ఉన్న సంగతి తెలిసిందే. కామన్వెల్త్ క్రీడలు 1990 సంవత్సరంలో బ్రిటిష్ ఎంపైర్ గేమ్స్ పేరుతో మొట్టమొదట జరిగాయి. అవి కూడా కెనడాలోని హామీల్టన్ లో తొలిసారి ఈ క్రీడాలను నిర్వహించారు. అయితే ఆ తర్వాత బ్రిటిష్ ఎంపైర్ అండ్ కామన్వెల్త్ గేమ్స్… కాస్త బ్రిటిష్ కామన్వెల్త్ గేమ్స్ గా మారిపోయాయి. ఇక 1978 నుంచి కామన్వెల్త్ గేమ్స్ గా పిలుస్తున్నారు. బ్రిటిష్ పాలన నుంచి స్వతంత్రం పొందినవి ఇందులో సభ్య దేశాలుగా ఉన్న సంగతి తెలిసిందే. ఇక 2022 సంవత్సరంలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్ లో 53 సభ్య దేశాలు ఉండగా 72 దేశాలు క్రీడల్లో పాల్గొన్నాయి.

ఇండియాలో కామన్వెల్ గేమ్స్ నిర్వహించడంపై అమిత్ షా కీలక ప్రకటన

భారతదేశంలో కామన్వెల్త్ క్రీడాలు ( Commonwealth Games 2030 ) జరగనున్న నేపథ్యంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కీలక ప్రకటన చేశారు. దాదాపు 20 సంవత్సరాల తర్వాత కామన్వెల్త్ క్రీడాలు ఇండియాలో జరగడం చాలా సంతోషకరమని ఈ సందర్భంగా పేర్కొన్నారు. అంతేకాదు అహ్మదాబాద్ మహానగరంలో నిర్వహించేందుకు కామన్వెల్త్ అసోసియేషన్ ఆమోదం తెలపడం గర్వించదగిన విషయమని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ప్రపంచ క్రీడా పటంలో ఇండియాను ఉంచడానికి ప్రధాని నరేంద్ర మోడీ చేస్తున్న నిరంతర ప్రయత్నాలకు.. కామన్ వెల్త్ క్రీడల వేదిక నిదర్శనమని పేర్కొన్నారు. ఇక అటు 2030లో అహ్మదాబాద్ వేదికగా శతాబ్ది వేడుకలు కామన్వెల్త్ గేమ్స్ చరిత్రలో ఒక మైలు రాయి అని వెల్లడించారు కామన్వెల్త్ స్పోర్ట్స్ తాత్కాలిక అధ్యక్షుడు డోనాల్డ్. ఇలాంటి అవ‌కాశం ఇండియాకు రావ‌డం గొప్ప విష‌యం అన్నారు డోనాల్డ్..

Also Read: IND vs WI: రెండో టెస్ట్ లోనూ విజ‌యం…విండీస్ ను వైట్ వాష్ చేసిన టీమిండియా.. WTCలో మ‌న ర్యాంక్ ఎంతంటే

 

Related News

Jos Buttler: న‌న్ను నంబ‌ర్ 4లో పంపి, ఆశిష్ నెహ్రానే స‌ర్వ నాశ‌నం చేశాడు !

బాబ‌ర్ పై ట్రోల్స్‌..ఇండియ‌న్స్ అనుకుని, ఆస్ట్రేలియా ఫ్యాన్స్ ను అరెస్ట్ చేసిన పాక్ !

మైదానంలోనే స్మోకింగ్..మ‌రో వివాదంలో టిమ్ డేవిడ్, ఇక ప‌ర్మినెంట్ బ్యాన్ !

టీమిండియాకు బిగ్ షాక్‌..బంగ్లాదేశ్ లోనే ఆసియా కప్ 2027, షెడ్యూల్ ఇదే

ఎలిమినేట‌ర్ లో ఓడిపోయిన‌ SRHకు ఊపిరిపోసిన పాకిస్తాన్ ప్లేయ‌ర్

రెండోసారి ఛాంపియ‌న్ గా RCB..ప్ర‌మాదంలో సూర్య‌, శ్రేయ‌స్ అయ్య‌ర్ భ‌విష్య‌త్తు !

Tanveer Ahmed: విరాట్ కోహ్లీ మ‌గాడైతే, పాకిస్తాన్ పిచ్ ల‌పై ఆడి చూపించాలి

లాహోర్ గ‌డ్డ‌పై విరాట్ కోహ్లీ ప్లకార్డులు…గూస్ బంప్స్ రావాల్సిందే

Big Stories

×