BigTV English

OTT Movie : టీచర్ కు పాఠాలు నేర్పించే 17 ఏళ్ల కుర్రాడు… ఓటీటీలోకి వచ్చేసిన మలయాళ ఎమోషనల్ డ్రామా

OTT Movie : టీచర్ కు పాఠాలు నేర్పించే 17 ఏళ్ల కుర్రాడు… ఓటీటీలోకి వచ్చేసిన మలయాళ ఎమోషనల్ డ్రామా
Advertisement

OTT Movie : మలయాళ సినిమాలు సరికొత్త స్టోరీలతో డిజిటల్ స్ట్రీమింగ్ కి వస్తున్నాయి. ఈ సినిమాల కోసం ప్రేక్షకులు కూడా అలాగే ఎదురుచూస్తున్నారు. అయితే మలయాళంలో విశేషంగా ఆకట్టుకున్న ఒక ఫీల్ గుడ్ సినిమా రెండేళ్ల తరువాత ఓటీటీలోకి వచ్చింది. ఈ సినిమా స్టేజ్ మీద కథలు చెప్పే ఒక కళాకారుడి చుట్టూ తిరుగుతుంది. ఒకప్పుడు బాగా పాపులర్ అయిన స్టేజ్ కథలు, కాలం మారడంతో కనుమరుగైపోయాయి. ఈ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. అంతేకాదు, ఈ చిత్రం నేషనల్ ఫిల్మ్ అవార్డ్ – స్పెషల్ మెన్షన్ గెలుచుకుంది. IMDbలో 9.4/10 టాప్ రేటింగ్ తో దూసుకుపోతోంది. ఈ సినిమా పేరు ఏమిటి ? స్టోరీ ఏమిటి ? ఎందులో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే …


స్టోరీలోకి వెళ్తే

చంద్రశేఖరన్ 1980లలో ప్రఖ్యాత కథాప్రసంగం కళాకారుడు. ఒకప్పుడు స్టేజ్ షో లు ఇస్తూ పేరు సంపాదించాడు. ఇప్పుడు కాలం మారడంతో ఆ కళ కూడా అంతరించిపోయింది. తన కష్టాల కారణంగా ఆ కళను వదిలేసి, కొల్లం సమీపంలో ఒక సామిల్‌లో కూలీగా పనిచేస్తుంటాడు. అతని జీవితం ఇప్పుడు ఒడిదొడుకులతో ఉంటుంది. తన కళాకారుడి రూపాన్ని దాచుకుని బతుకుతుంటాడు. ఇంతలో జువెనైల్ హోమ్‌లో ఉండే 17 ఏళ్ల మిథున్,చంద్రశేఖరన్ నుంచి కథాప్రసంగం నేర్చుకోవాలని కోరుకుంటాడు. ఈ పిల్లాడు కోల్‌కతా రెడ్-లైట్ ఏరియాలో తన బాల్యంలో చాలా బాధలు పడి ఉంటాడు.

జువెనైల్ హోమ్ సూపరింటెండెంట్ మంచి మనసున్న వ్యక్తి . మిథున్ కోరికను సపోర్ట్ చేసి, చంద్రశేఖరన్‌ని ఒప్పిస్తాడు. మిథున్ ఉత్సాహం చంద్రశేఖరన్‌లో కథ చెప్పే పాషన్‌ని మళ్లీ రగిలిస్తుంది, వీళ్లిద్దరి మధ్య ఒక గాఢమైన గురు-శిష్య బంధం ఏర్పడుతుంది.చంద్రశేఖరన్, మిథున్‌కి కథాప్రసంగం నేర్పిస్తూ, తన గత కీర్తిని, కళపై ప్రేమను మళ్లీ తెచ్చుకుంటాడు. మిథున్ కూడా తన గత గాయాల నుంచి బయటపడి, ఈ కథల ద్వారా కొత్త ఆత్మవిశ్వాసం పొందుతాడు. ఈ బంధం వాళ్లిద్దరి జీవితాల్లో కొత్త అర్థాన్ని తెస్తుంది.


ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే

‘Kadhikan’ 2023లో విడుదలైన మలయాళ ఫీల్ గుడ్ సినిమా. జయరాజ్ దర్శకత్వంలో, ముకేష్ (చంద్రశేఖరన్), ఉన్ని ముకుందన్ (సూపరింటెండెంట్), కేతకి నారాయణ్, కృష్ణానంద్ (మిథున్) ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2023 డిసెంబర్ 8న థియేటర్లలో విడుదలై, 1 గంట 34 నిమిషాల రన్‌టైమ్‌తో IMDbలో 9.4/10 రేటింగ్ ని పొందింది. 2025 సెప్టెంబర్ 4 నుంచి మనోరమా మ్యాక్స్‌లో మలయాళం, ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో స్ట్రీమింగ్‌కు అందుబాటులో ఉంది.

Read Also : సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ లైఫ్ ఇంత దారుణంగా ఉంటుందా? ఒక్కో సీన్ కు మైండ్ బ్లాక్

Related News

OTT Movie : ఏం సీన్లు గురూ… చలికాలంలోనూ చెమటలు పట్టించే స్టోరీ… పెద్దలకు మాత్రమే మావా

OTT Movie : హైస్కూల్ అమ్మాయిల వెంటపడే పిశాచి… ఈ మూవీని చూడాలంటే హనుమాన్ చాలీసా పక్కనుండాల్సిందే

OTT Movie : ఎనిమీతోనే బెడ్ షేర్ చేసుకునే అరాచకం… అల్టిమేట్ డేర్… ట్విస్టులతో పిచ్చెక్కించే సైకలాజికల్ థ్రిల్లర్

OTT Movie : ఆ రూమ్ లోకి అడుగు పెడితే రెచ్చిపోయే అమ్మాయిలు… ప్రాణాంతకమైన ఉచ్చులోకి లాగే మిస్టరీ… స్ట్రిక్ట్లీ సింగిల్స్ కు మాత్రమే

OTT Movie : నెక్స్ట్ డోర్ క్రైమ్స్… ప్రతీ మర్డర్ కేసులో ఊహించని టర్నులు, ట్విస్టులు… నరాలు తెగే ఉత్కంఠ

OTT Movie : హిందూ అమ్మాయి ముస్లిం అబ్బాయి అరాచకం… ఆ సీన్లే హైలెట్ భయ్యా… దిమాక్ కరాబ్ క్లైమాక్స్

OTT Movie : రియాలిటీ షోలో ఛాన్స్… ఎంత మోసం చేస్తే అంత డబ్బు… ప్రతీ 5 నిమిషాలకు ట్విస్ట్ ఉన్న థ్రిల్లర్

OTT Movie : ‘స్క్విడ్ గేమ్’ను మరిపించే డేంజరస్ సర్వైవల్ గేమ్… కాన్సెప్ట్ వేరు గానీ కథ మాత్రం నెక్స్ట్ లెవెల్

Big Stories

×