DMart Shopping Offers: దేశ వ్యాప్తంగా మెట్రో నగరాల నుంచి పట్టణాల వరకు డిమార్ట్ స్టోర్లు అందుబాటులోకి వచ్చాయి. ఈ స్టోర్లు ఎప్పుడూ కస్టమర్లతో రద్దీగా ఉంటాయి. చౌక ధరలకు వస్తువులు లభించడంతో పాటు నాణ్యతలోనూ రాజీ ఉండదు. రోజువారీ కిరాణా సరుకులతో పాటు గృహోపకరణాల వరకు చక్కటి ఆఫర్లతో లభిస్తాయి. పేద, మధ్య తరగతి ప్రజలు డిమార్ట్ లో షాపింగ్ చేసేందుకు ఎక్కువగా ఇష్టపడుతారు. అయితే, డిమార్ట్ కు వెళ్లే వినియోగదారులు కొన్ని వస్తువుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇంకా చెప్పాలంటే, ఆ వస్తువులను వీలైనంత వరకు కొనకపోవడం మంచిది. ఎందుకుంటే..
డిస్కౌంట్ కోసం ఆశ పడొద్దు!
వినియోగదారులను ఆకట్టుకునేందుకు డిమార్ట్ పండుగలు, ప్రత్యేక సందర్భాల్లో డిస్కౌంట్లను ఇస్తుంది. కొన్నిసార్లు వీకెండ్స్ లోనూ డిస్కౌంట్లు ఇస్తుంది. అయితే, ఈ ఆఫర్ల విషయంలో వినియోగదారులు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే, ఆఫర్లు, డిస్కౌంట్లు అందించే వస్తువులు, సామాన్లు ఎక్కువగా పాతవి ఉంటాయి. అంటే, గడువు తేదీ, దగ్గర పడి ఉంటాయి. ముఖ్యంగా ఫుడ్, సౌందర్య సాధనాలు కొనుగోలు చేసే సమయంలో అలర్ట్ గా ఉండాలి. ఆఫర్లు అందించే వస్తువులకు సంబంధించి గడువు తేదీని చెక్ చేయడం మంచిది. అలా చూడకుండా కొనుగోలు చేయడం వల్ల మీకు నష్టం కలిగే అవకాశం ఉంటుంది. వీలైనంత వరకు గడువు తేదీ ఎక్కువ రోజులు ఉన్నవి కొనుగోలు చేయడం ఉత్తమం.
బ్రాండెడ్ ఉత్పత్తులు
డిమార్ట్ లో చౌకైన కిరాణా వస్తువులు మాత్రమే కాదు. ఈ సంస్థకు చెందిన యాప్ ద్వారా ఆన్ లైన్ లో ఎలక్ట్రానిక్స్, దుస్తులు, బ్రాండెడ్ వస్తువులను ఇతర ఆన్ లైన్ ప్లాట్ ఫామ్ లలో పోల్చితే తక్కువ ధరలకు పొందే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో Amazon, Flipkartతో పోల్చితే డిమార్ట్ లో ఇంకా తక్కువ ధరలకు లభిస్తాయి.
నో రిటర్నర్ ఆప్షన్ వస్తువులు
డిమార్ట్ రిటర్న్ పాలసీ ప్రకారం.. కొన్ని వస్తువులు, ముఖ్యంగా ఆన్ లైన్ లో కొనుగోలు చేసినవి తిరిగి తీసుకోబడవు. ఇందులో లోదుస్తులు, సౌందర్య సాధనాలు, వ్యక్తిగత వినియోగ వస్తువులు ఉన్నాయి. సో, అలాంటి వస్తువులను కొనుగోలు చేసే ముందు ఒకటి రెండు సార్లు చెక్ చేసుకోవడం మంచిది.
నాణ్యత, ధర పరిశీలించడం తప్పనిసరి!
డిమార్ట్ లో కొన్ని వస్తువులు, ఉత్పత్తులపై స్టాక్ ఉన్నంత వరకు లేదంటే తక్కువ కాలం వరకు ఆఫర్లు ఉంటాయి. మీరు అలాంటి వస్తువును కొనుగోలు చేసే సమయంలో జాగ్రత్తగా పరిశీలించడం మంచిది. ఏదైనా కొనుగోలు చేసే ముందు ఉత్పత్తి నాణ్యత, ధర, వాపసు విధానాన్ని తనిఖీ చేయాలి. ఆఫర్లు ఉన్నాయి కదా అని ఆశపడితే, ఇంటికి వెళ్లి బాధపడాల్సి వస్తుందంటున్నారు నిపుణులు. ఇతర మార్ట్ లతో పోల్చితే డిమార్ట్ లో చౌక ధరలకు వస్తువులు లభించినా జాగ్రత్తగా కొనుగోలు చేయాలంటున్నారు.
Read Also: డిమార్ట్ లో వస్తువుల ధరలు ఎందుకంత తక్కువ? ఏ రోజుల్లో మరింత చీప్ గా కొనేయొచ్చు?