BigTV English

OTT Movie : సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ లైఫ్ ఇంత దారుణంగా ఉంటుందా? ఒక్కో సీన్ కు మైండ్ బ్లాక్

OTT Movie : సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ లైఫ్ ఇంత దారుణంగా ఉంటుందా? ఒక్కో సీన్ కు మైండ్ బ్లాక్
Advertisement

OTT Movie : సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ కల్చర్ ని సెటైరికల్ గా చూపిస్తూ ఒక హాలీవుడ్ సినిమా ప్రేక్షకులను అలరిస్తోంది. ఇందులో రివేంజ్ థీమ్‌ ని కూడా కామెడీగా చూపించారు. ఈ సినిమాలో ఒక సోషల్ ఇన్‌ఫ్లూయెన్సర్ ని కొంతమంది ఎగతాళి చేయడంతో అసలు స్టోరీ మొదలవుతుంది. ఇక ఆమె ఒక్కొక్కరిని ఒక్కోరకంగా ఏసుకుంటూ పోతుంది. ఈ ఆసక్తికరమైన సినిమా ఎందులో ఉంది ? పేరు ఏమిటి ? స్టోరీ ఏమిటి ? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.


కథలోకి వెళ్తే

సిసిలియా అలియాస్ “సిస్సీ” ఒక సక్సెస్‌ఫుల్ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్. “ఐ యామ్ లవ్డ్, ఐ యామ్ స్పెషల్, ఐ యామ్ ఎనఫ్” అనే మాటలతో 2,00,000 మంది ఫాలోవర్స్‌కు మానసిక ఆరోగ్య సలహాలు ఇస్తూ, ఒంటరిగా ఒక గజిబిజి అపార్ట్‌మెంట్‌లో నివసిస్తూ ఉంటుంది. ఆమె చిన్నతనంలో ఎమ్మాతో బెస్ట్ ఫ్రెండ్‌గా ఉండి, “ఎప్పటికీ కలిసి ఉంటామని” ఒక టైమ్ క్యాప్సూల్‌తో ప్రమాణం చేస్తుంది. కానీ అలెక్స్ ఎంట్రీతో వీళ్ళ స్నేహం విరిగిపోతుంది. సిసిలియా, అలెక్స్‌ను ఒక కర్రతో కొట్టి ముఖంపై గాయం చేస్తుంది. ఈ గత ట్రామా ఆమెను వెంటాడుతుంటుంది. ఒక రోజు ఫార్మసీలో ఎమ్మాని సిసిలియా అనుకోకుండా కలుస్తుంది. ఎమ్మా ఆమెను తన ఎంగేజ్‌మెంట్ పార్టీకి, తర్వాత బ్యాచిలొరెట్ వీకెండ్‌కు ఆహ్వానిస్తుంది. ఈ ట్రిప్‌లో అలెక్స్ కూడా ఉంటుందని తెలిసి, సిసిలియా కంగారుపడుతూనే వెళ్తుంది. ఇక ఆపార్టీలో అలెక్స్ సిసిలియాను “సిస్సీ” అని ఎగతాళి చేస్తూ, ఆమె ఇన్‌ఫ్లూయెన్సర్ జీవితాన్ని తక్కువ చేస్తుంది.


అక్కడ అలెక్స్, ట్రేసీ, జామీ సిసిలియాని బాధపెడతారు. ఆమె ఫోన్‌ని తీసి, ఆమెను “క్రూయల్, సాడిస్ట్” అని సోషల్ మీడియాలో ఎక్స్‌పోజ్ చేసే వీడియో పోస్ట్ చేస్తారు. ఆతరువాత సిసిలియా కోపంతో అలెక్స్‌ని రాయితో కొట్టి చంపేస్తుంది. ఆమె శరీరాన్ని ఖననం చేసి, లైవ్‌స్ట్రీమ్‌లో మెడిటేషన్ చేస్తూ కవర్ చేస్తుంది. ఎమ్మా, ఫ్రాన్ లతో సిసిలియా మానసికంగా బ్రేక్‌డౌన్ అవుతూ, ఒక్కొక్కరినీ హింసాత్మకంగా చంపేస్తుంది. ఫ్రాన్‌ని కారుతో గుద్ది, ట్రేసీని బాత్‌టబ్‌లో ముంచి, జామీని కిరోసిన్‌తో కాల్చేస్తుంది. చివర్లో, సిసిలియా ఎమ్మాని కూడా చంపి, తనను బాధితురాలిగా చూపిస్తూ, సోషల్ మీడియాలో సెల్ఫ్-హెల్ప్ గురుగా మరింత పాపులర్ అవుతుంది. ఈ సినిమా సోషల్ మీడియా, మానసిక ఆరోగ్యం గురించి సెటైరికల్ గా డార్క్ కామెడీతో నడుస్తుంది.

ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే

‘Sissy’ 2022లో విడుదలైన ఆస్ట్రేలియన్ సైకలాజికల్ హారర్ కామెడీ చిత్రం. హన్నా బార్లో దర్శకత్వంలో, ఐషా డీ (సిసిలియా), హన్నా బార్లో (ఎమ్మా), ఎమిలీ డి మార్గరీటి (అలెక్స్), డేనియల్ మాంక్స్ (జామీ), యెరిన్ హా (ట్రేసీ), లూసీ బారెట్ (ఫ్రాన్) ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2022 సెప్టెంబర్ 29న షడ్డర్‌లో స్ట్రీమింగ్‌కు వచ్చింది. ఆతరువాత ట్యూబీ, అమెజాన్ ప్రైమ్ వీడియో, ఫండాంగో ఎట్ హోమ్‌లో ఇంగ్లీష్ ఆడియోతో, ఇంగ్లీష్, హిందీ, తెలుగు సబ్‌టైటిల్స్‌తో స్ట్రీమింగ్‌కు అందుబాటులో ఉంది. 1 గంట 42 నిమిషాల రన్‌టైమ్‌తో IMDbలో 6.1/10 రేటింగ్ ను పొందింది.

Read Also: భర్త చనిపోయాడని చెప్పి భార్యను లాక్కునే ఆఫీసర్… అతను తిరిగొచ్చి ఇచ్చే ట్విస్టుకు ఫ్యూజులు అవుట్

Related News

OTT Movie : బేస్మెంట్లో బంధించి పాడు పని… కూతురిని వదలకుండా… షాకింగ్ రియల్ స్టోరీ

OTT Movie : అక్క బాయ్ ఫ్రెండ్ తో చెల్లి… నరాలు జివ్వుమన్పించే సీన్లు మావా… ఇయర్ ఫోన్స్ మాత్రం మర్చిపోవద్దు

OTT Movie : బాయ్ ఫ్రెండ్ తో ఒంటరిగా గడిపే అమ్మాయిలే ఈ కిల్లర్ టార్గెట్… వెన్నులో వణుకు పుట్టించే థ్రిల్లర్ మావా

OTT Movie : వరుసగా అమ్మాయిలు మిస్సింగ్… ప్రొఫెసర్ ముసుగులో సైకో వల… సీట్ ఎడ్జ్ క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : 8 ఏళ్ల తరువాత థియేటర్లలోకి… నెలలోపే ఓటీటీలోకి 170 కోట్ల హిలేరియస్ కోర్ట్ రూమ్ డ్రామా

OTT Movie : జంప్ అవ్వడానికి ట్రై చేసి అడ్డంగా బుక్… ఇష్టం లేకుండానే ఆ పని… తెలుగు మూవీనే మావా

OTT Movie : అనుకున్న దానికంటే ముందుగానే ఓటీటీలోకి ‘కాంతారా చాఫ్టర్ 1’… ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే ?

OTT Movie : ధృవ్ విక్రమ్ ‘బైసన్’కు ఓటీటీ ఫిక్స్… స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Big Stories

×