E-Paper
Advertisement

Shoaib Akhtar: పాకిస్తాన్ లో స‌చిన్ పుట్టింటే..అర్జున్ టెండూల్క‌ర్ కు కెప్టెన్సీ ఇచ్చేవాళ్లం

Shoaib Akhtar:  పాకిస్తాన్ లో స‌చిన్ పుట్టింటే..అర్జున్ టెండూల్క‌ర్ కు కెప్టెన్సీ ఇచ్చేవాళ్లం
Advertisement

Shoaib Akhtar: సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar ) గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. క్రికెట్ గాడ్ గా పేరుగాంచిన సచిన్ టెండూల్కర్, టీమిండియాకు ఎన్నో విజయాలను అందించాడు. అయితే అలాంటి సచిన్ టెండూల్కర్ కు బీసీసీఐ అలాగే ఇండియన్ గవర్నమెంట్ అనేక సత్కారాలు ఇచ్చి గౌరవించింది. కానీ సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ కు టీమిండియాలో మాత్రం అవకాశం ఇవ్వడం లేదు. రంజిల్లో అద్భుతంగా రాణిస్తున్న అర్జున్ కు ఐపీఎల్ లో లేదా టీమిండియాలో ఎక్కడ అవకాశాలు రావడం లేదు. వాటర్ బాయ్ గా అతడిని వాడుకుంటున్నారు. అయితే దీనిపై తాజాగా పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ (Shoaib Akhtar) కీలక వ్యాఖ్యలు చేశారు. సచిన్ టెండూల్కర్ గనుక పాకిస్తాన్ దేశంలో పుట్టి ఉంటే… అర్జున్ టెండూల్కర్ కు (Arjun Tendulkar) చాలా అవకాశాలు ఇచ్చేవాళ్ళమంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. పాకిస్తాన్ ఆడే ప్రతి మ్యాచ్ లో అతనికి అవకాశం వ‌చ్చేద‌ని వెల్లడించారు. కానీ ఇండియాలో అతని పరిస్థితి అత్యంత దారుణంగా ఉందంటూ హాట్ కామెంట్స్ చేశారు. దీంతో పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ చేసిన వ్యాఖ్య‌లు దుమారం రేపుతున్నాయి.

Also Read: Litton Das ON T20 World Cup 2026 : పాకిస్తాన్ లో అడుగుపెట్టాలంటే గన్ మెన్లను పెట్టుకోవాల్సిందే..బంగ్లా క్రికెటర్ సంచలనం

పాకిస్తాన్ లో స‌చిన్ పుట్టింటే..అర్జున్ కు కెప్టెన్సీ ఇచ్చేవాళ్లం

Advertisement

సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ కు టీమిండియాలో అవకాశాలు రాకపోవడంపై పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ కీలక వ్యాఖ్యలు చేశారు. టీమిండియాకు ఎన్నో విషయాలు అందించిన సచిన్ టెండూల్కర్ ను చూసి అర్జున్ కు బీసీసీఐ అవకాశాలు ఇవ్వాల్సింది.. కానీ అలా చేయడం లేదని వెల్లడించారు. అదే పాకిస్తాన్ లో అయితే, మామ పోతే అల్లుడు… అల్లుడు పోతే మనవడు… ఇలా అందరికీ అవకాశాలు ఇస్తారని బాంబు పేల్చారు. మామ-అల్లుళ్ళ వ్యవహారం పాకిస్తాన్ క్రికెట్ బోర్డులో నడుస్తోందని… పరోక్షంగా షాహిద్ అఫ్రిది ఫ్యామిలీ గురించి విమర్శలు చేశారు షోయబ్ అక్తర్.

అయితే ఇండియాలో క్రికెట్ గాడ్ గా పేరు ఉన్న సచిన్ టెండుల్కర్ కొడుకు అర్జున్ కు మాత్రం అవకాశం ఇవ్వడం లేదని.. బీసీసీఐ అలాగే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మధ్య ఉన్న తేడాను చెప్పే ప్రయత్నం చేశారు షోయబ్ అక్తర్. సచిన్ టెండూల్కర్ గనుక పాకిస్తాన్ లో పుట్టి ఉంటే… అర్జున్ టెండూల్కర్ కు టీ20 లు, వన్డేలు అలాగే టెస్టులు ఇలా అన్నిటిలో అవకాశం దక్కేదని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పరువు తీసేలా మాట్లాడారు. అంటే బీసీసీఐ లాగా టాలెంట్ ఉన్నవాళ్లకు మాత్రమే అవకాశం ఇవ్వాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు.

Advertisement

Also Read: Manav Sutar’s career changed with superstition: మూఢనమ్మకాల‌తో మాన‌వ్ సుతార్ కెరీర్ ఛేంజ్…6 వికెట్లు తీసి 38 ఏళ్ల రికార్డ్ బ్రేక్ చేసిన‌ జ‌డేజా వార‌సుడు

 

 

Related News

సంజు కంటే అభిషేక్ శ‌ర్మ పెద్ద‌ పోటుగాడా? అంద‌రికీ ఒకే రూల్స్ ఉండాలి

పసికూన‌ జింబాబ్వే పైన గెలవడం కాదు…మ‌గాళ్లు అయితే మాపై గెల‌వండి!

పాకిస్తాన్ ఘోర అవ‌మానం…ఏ ఒక్క కామెంటేటర్ ను పిల‌వ‌ని వెస్టిండీస్‌

వైభ‌వ్ సెంచ‌రీ మిస్…టీమిండియా చేతిలో జింబాబ్వే వైట్ వాష్

Video: వైభవ్ సూర్యవంశీ భారీ సిక్సర్..స్టేడియం బయట పడ్డ బంతి

జింబాబ్వేను బెదిరించి సిరీస్ గెలుచుకున్నారు..త‌న్వీర్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక ధోని కుట్ర‌లు?

జింబాబ్వే బౌలర్లు స్లో బంతులు వేశారు…అందుకే టీమిండియా గెలుపు

Big Stories

Advertisement
×