E-Paper
Advertisement

Horror thriller series OTT : గుండె గుభేల్మన్పించే దెయ్యం… రెప్ప వేయనివ్వని తమిళ సిరీస్… ఫ్రీగానే చూడొచ్చు

Horror thriller series OTT : గుండె గుభేల్మన్పించే దెయ్యం… రెప్ప వేయనివ్వని తమిళ సిరీస్… ఫ్రీగానే చూడొచ్చు
Advertisement

Horror thriller series OTT  : ఇప్పుడు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో హరర్, సస్పెన్స్ థ్రిల్లర్ కంటెంట్ ను చూసేందుకు అడియన్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అందుకే మేకర్స్ కూడా ఎక్కువగా హరర్ కామెడీ చిత్రాలను తీసుకువస్తున్నారు. ఇతర భాషలలో సూపర్ హిట్ అయిన సినిమాలను కూడా తెలుగులోకి డబ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ వెబ్ సిరీస్ యూట్యూబ్ (youtube) లో భాషతో సంబంధం లేకుండా అందరినీ ఆకట్టుకుంటోంది. తమిళంలో రూపొందించిన హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ను యూట్యూబ్ లో ఫ్రీగా కూడా చూడొచ్చు. దీని పేరు, ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే ..

ఈ సిరీస్ పేరు ఏమిటంటే

తమిళంలో రూపొందిన ఈ సిరీస్ పేరు ‘కరువనం’ (Karuvanam). యూట్యూబ్ లో ఈ వెబ్ సిరీస్ ట్రెండింగ్ లో కూడా ఉంది. అయితే ఇది ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో అందుబాటులో ఉంది. ఇందులో ఉదయ సుందరి, జయ శ్రీ విజయన్, విఘ్నేష్ వరదరాజన్, వీరరాఘవన్ ప్రధాన పాత్రలు పోషించారు. కుమరన్ సుందరన్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ లో ఊహించని ట్విస్టులతో పాటు, వణుకుపుట్టించే సీన్లు కూడా ఉంటాయి.

స్టోరీ ఏమిటంటే

Advertisement

మీరా, షాలిని అనే ఇద్దరు అనాథలు ఓ ఆశ్రమంలో పెరుగుతుంటారు. వారిద్దరిని ఓ గొప్పింటి మహిళ దత్తత తీసుకుంటుంది. వాళ్ల అమ్మ చనిపోయాక ఒక పాత బంగళా వీళ్లకు వారసత్వంగా వస్తుంది. ఆ ఇల్లు రిపేర్ చేయడానికి వెళ్లిన వీళ్లకి ఊహించని సంఘటనలు ఎదురుపడతాయి. ఒకరి గురించి ఒకరికి అప్పుడే తెలుస్తుంది. అయితే ఆ ఇంట్లోకి అడుగుపెట్టిన దగ్గరి నుండి వీళ్లకి వింత వింత శబ్దాలు, భయంకరమైన దృశ్యాలు కనిపిస్తుంటాయి. అసలు ఆ ఇల్లు ఎందుకు ఖాళీగా ఉంది ? వాళ్ల అమ్మ తమని ఎందుకు వదిలేసింది ? అనే విషయాలను తెలుసుకోవాలని ప్రయత్నిస్తారు.

కానీ ఆ ఇంట్లో ఒక భయంకరమైన దుష్టశక్తి ఉంటుంది. వాళ్ల పూర్వీకులు చేసిన కొన్ని క్షుద్ర పూజలు, తప్పుల వల్ల ఆ కుటుంబం మీద ఒక శాపం ఉంటుంది. ఆ శక్తి ఇప్పుడు ఈ కవలల ప్రాణాల మీదకు వస్తుంది. ఒకవైపు ఇంట్లో జరుగుతున్న భయంకర పరిణామాలు, మరోవైపు బయట పడుతున్న వాళ్ల ఫ్యామిలీ సీక్రెట్స్ మధ్య ఈ ఇద్దరు అమ్మాయిలు ఆ గండం నుండి ఎలా బయటపడ్డారు ? ఆ దుష్టశక్తిని ఎలా ఎదుర్కొన్నారు ? అనేదే ఈ సిరీస్ క్లైమాక్స్.

Advertisement

Read Also : పూల తోటలో మృతదేహాలు… ప్రేమలో పడ్డ అమ్మాయిని కూడా… ఈ ఆరు ఎపిసోడ్‌ల క్రైమ్ థ్రిల్లర్ భీభత్సమే

Tags

Related News

కుటుంబం, ప్రేమ మధ్య నలిగిపోయే క్లాసికల్ మ్యూజిషియన్ కథ… కన్నీళ్లు పెట్టించే ఎమోషనల్ జర్నీ

హైదరాబాద్ కుర్రాడికి కొరియన్ దెయ్యంతో లవ్… కితకితలు పెట్టే ఇండో-కొరియన్ థ్రిల్లర్

సోమరిపోతులే ఓటీటీలో సినిమాలు చూస్తారా? శివాజీ షాకింగ్ కామెంట్స్!

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. ఏకంగా 14 స్ట్రీమింగ్…!

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

Big Stories

Advertisement
×